శ్రీ గణేశాయనమః
శ్రీబాలాత్రిపుర సుందర్యై నమః
ముందుమాట
శ్రీ చండీ నవశతిపై నేను ఈ వ్యాఖ్యను వ్రాయుటలో "చండివార్ధ ప్రకాశః" అను సంస్కృత వ్యాఖ్య ఎంతయో ఉపకరించినది. శ్లోకములకు దండాన్వయము కాక, తాత్పర్యమును వ్రాసితిని. అనగా తెలుగుభాషకు సహజమగు వాక్య నిర్మాణమును పాటించుచు, మూలశ్లోకములోని పదములన్నియు అనువదింపబడునట్లు ప్రయ
శ్రీశ్రీశ్రీ కళ్యాణానందభారతి తరువాతి కాలములో శ్రీగోపానందనాథులు వామాచారమును నిరసించుటలో ప్రముఖులు, ఈ వ్యాఖ్యాన రచనను. వారు నాకప్పగించుట నా అదృష్టముగా భావించు చున్నాను. మిత్రులు శ్రీరాఘవరావుగారి సహృదయత వలననే నాకీ అవకాశము లభించినది.
నేను మా తండ్రిగారు బ్రహ్మశ్రీ రాణి నరసింహశాస్త్రిగారి వద్ద అభ్యసించిన వేదాంతశాస్త్రము ఈ రచనలో నాకెంతయో ఉపకరించినది. కొంతభాగము చదివి వినిపింపగా వారు తమ ఆమోదమును తెలిపిరి.