అర్ధ గౌరవం !
మన కెన్ని తెలివి తేటలున్నా భగవతత్వం తెలియనిదే పరమ చరమ లక్ష్యం సిద్ధించదని పరమ యోగుల ఆప్తోపదేశం. ఆ లక్ష్య సిద్ధికై మహా జ్ఞానులు చేసిన ప్రయత్నంలో నుండే వైదిక వాఙ్మయం వెలువడింది. "సర్వం వేదాత్ర సిద్ధ్యతి" అన్నాడు మనువు. 'బ్రహ్మావై సర్వస్య ప్రతిష్ఠా" అన్నది వేదం. "ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్" అని ఇతిహాస పురాణాలన్నీ వేదానికి ఉపబృంహణాలు. సృష్టి రహస్య భేదనం చేసే పురాణాల్లో ప్రతిష్ఠితమైన దేవతా ప్రాణాధ్యనం ఒక జ్ఞాన యజ్ఞం. అందులో శ్రీ లలిత బ్రహ్మాండ పురాణాం తర్గత మహా మాయా స్వరూపిణి. ఆ మహా శక్తిని గూర్చి "అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశు:" అని ఢంకా బజాయించి చెప్పిన శ్రీ కృష్ణ భగవానుడు కూడా "వాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః" అంటున్నాడు. ఇంతకీ 'మాయ' అంటే ఏమిటి ? "మీయతే అనయా మినోతియా - మాయా" అఖండ పరబ్రహ్మ తత్యాన్ని ఖండాయమానంగా చేసి విశ్వరూపంగా ప్రదర్శించే మహాశక్తి. ఆ శక్తి యొక్క లాలిత్య దర్శ శ్రీ లలిత. ఆమె యొక్క సాకార, నిరాకార నిగూఢ తత్త్వ దర్శనమే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. సహస్రారంలో తప్ప యీ నామార్థాలు వికసించవు. అనుభూతిరూపంలో హృదయంలో తప్ప పరిమళించవు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తత్త్య చరిత్ర ఉంటుంది.
ద్వే విద్యే వేదితన్యే శబ్ద బ్రహ్మ పరం చయేత్
శాబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మారి గచ్ఛతి !!
అని ఉపనిషద్వాణి, శబ్దం ద్వారానే అర్థ సాక్షాత్కారం. అందుకు నామ పరిచయం, పారాయణం పూజావిధానంలో ప్రముఖమైన అంశాలయ్యాయి.
కవిగా, విమర్శకుడుగా, వ్యాసకర్తగా గుర్తించబడిన కృష్ణప్రసాద్ వేదాంత విద్యారంగంలో స్థిరపడుతున్నాడు. తాతికాంశాలు చాలా తెలుసుకుంటున్నాడు. తనకు తెలిసిన విషయాలు, తమ పొందిన ఆనందానుభూతులు నలుగురికి పంచుతున్నాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.