కనకదుర్గఅమ్మవారిస్తోత్రమ|Kanaka Durga Amma Vari Sthotramu Telugu Book Download
జగన్మాత బాల
శ్లోకము
బాల పర్వతవర్ధనీ భగవతీ
బాలార్క కోటి ప్రభా
కల్యాణీ నిఖిలేశ్వరీ శుభకరీ
గౌరీ శివా పార్వతీ
సర్వజ్ఞా సకలాగమాంత వినుతా
సౌభాగ్య సంపత్ప్రదా
దుర్గాంబా నవకోటిమూర్తి సహితా
మాంపాతు మహేశ్వరీ ||
భావము :
పర్వతరాజైన హిమవంతుని ప్రభావమును వృద్ధి పొందించు నదియును, వరమైశ్వర్యనంవున్నయును, ఉదయించుచున్న, కోటిసూర్యులకాంతి కలదియును, జగత్కల్యాణ స్వరూపిణియును, సకల లోకాధీశ్వరియును, భక్తులకు సమస్త శుభములు సమకూర్చునదియును, మంగళగౌరీదేవియును, శుభప్రదయును, హైమవతియును సకల కలావేదినియును, నానావిధములైన ఉపనిషత్తులచే ఉపాసింపబడునదియును. సౌభాగ్య సంపత్కారిణియును, నవకోటిరూపధారిణియున -మహేశ్వరి మహాదుర్గ జగన్మాత "బాల" నన్ను రక్షించుగాక