శంకర గ్రంధ రత్నావళి లలితా త్రిశతి భాష్యం -ద్వాదశ సంపుట| Shankara Grandha Ratnavali Lalitha Trishakti Bhashyam Telugu Book Download
శాంకర వాఙ్మయ మధూలిక
బీజ్కేంకురం తరుం తస్మిన్, తస్మిన్ దృష్ట్వా పలాదికమ్ ప్రసాదా చ్ఛంకరగురోః వచ్చి కించిద్ మష్యహమ్ |
ఏకధా బహుధాచైవ భాసమానం మహేశ్వరం | శాస్త్రదృష్ట్యా భావయామి పూజయామి యథాతథమ్ |
వేదశాస్త్ర పురాణములను బట్టి స్పృష్టమైన యీ ప్రపంచమునందు అనేక దేవతలు, గురువులు కన్పట్టుచున్నారు. మూలమునకు పోయినకొలది, 'ఏకో దేవః' యనెడి భావము స్ఫురించును. ఆ దేవుడే గురువు, గురువే దేవుడు.
“శివక్రోధా చ్ఛినస్త్రాతా ! గురుక్రోధా చ్ఛివో న చ యనుచు పురాణాదులు గురుపారమ్యమును ముక్తకంఠముతో
చాటుచున్నవి. దేవీ భాగవతము సత్యవ్రతనామము వరాహమును గురువని చెప్పుచున్నది. వరాహమునకు తత్త్వజ్ఞాన ముండునా ? మంత్రములు గాని, మంత్రబీజాక్షర ములు గాని తెలియునా ? సత్యవ్రతుడు నారస్వతసిద్ధు పై నాడని దేవీ భాగవతమునందు గలదు. దానిని బట్టి శివుడు గురురూపమున వచ్చి చెప్పుననియు, కావుననే కవులందఱు కవిత్వము చెప్పగలుగుచున్నారనియు తెలియును, సాధకునకు