Lalitha Sahasranama Vivaranamu Telugu Book Download|లలితా సహస్ర నామ వివరణము-1
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రానికి వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ ఈ ప్రస్తుత వివరణ చాలా విషయాల్లో వాటికి భిన్నంగా ఉంటుంది. 'ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన' సమన్వయాత్మకమైన విశేషార్థాలు, అంతరార్ధాలు, సంకేతార్థాలను ఎన్నో ఈ ప్రస్తుత వివరణలో చెప్పడానికి ప్రయత్నించాను. వాటిలో కొన్ని మా గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు సెలవిచ్చినవి కాగా, మరికొన్ని- అమ్మవారి అనుగ్రహం వలన, గురుదేవుల కృప వలన - నాకు స్ఫురించినవి. ఇంతవరకు సాంప్రదాయరీతిలో వస్తున్న, వ్రాస్తున్న అర్థాలే కాకుండా స్వతంత్రించి హేతుబద్ధంగా వ్రాసినవి గూడా వున్నాయి.
నేను వివరించిన విషయాల కన్న ఈ నామాలకు ఇంకా ఎన్నో విలువైన విశేషాలు గూడా ఉండటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. పరిశోధనా దృక్పథంతో ఆలోచిస్తే - ఏ విషయం గురించి అయినా - 'ఇదే చివరకు చెప్పే విషయం, ఇంకా చెప్పవలసింది ఏమీ మిగలలేదు!' అనే 'భరతవాక్యం' ఎప్పుడూ వుండదని నా అభిప్రాయం. ముందు ముందు మరికొన్ని విశేషాలతో, క్రొత్త క్రొత్త వివరాలతో వ్యాఖ్యానాలు గూడా రావచ్చును.
Keywords:Lalitha Sahasranamam,Sthotralu,Lalitha Sahasranamam telugu book,Lalitha Sahasranamam part-1,అష్టోత్తరాలు , telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,లలితా సహస్ర నామ వివరణము-1