Lalitha Sahasranama Vivaranamu-2 Telugu Book Download|లలితా సహస్ర నామ వివరణము-2
శ్రీ లలితా సహస్రనామ వివరణ నాలుగు భాగాల పుస్తకాలకు స్వదేశ విదేశాల్లోని తెలుగువారినుండి అనూహ్యమైన స్పందన వచ్చి అతి తక్కువ కాలంలోనే ముద్రించిన పుస్తకాలన్నీ దాదాపు అయిపోయాయి. ప్రస్తుతం ద్వితీయభాగ ద్వితీయ ముద్రణ ముందుగా, అత్యవసరమైంది. ఈ సందర్భంలో
శ్రీ పోలిశెట్టి సోమసుందరం శ్రీమతి నాగరత్నమ్మ' పుణ్యదంపతి జ్ఞాపకార్థం వారి కనిష్ట పుత్రుడు పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారు
ఈ పుస్తక ముద్రణకు కొంత ద్రవ్యసహాయం చేశారు. వారికి నా తరఫున మా జగద్గురుపీఠం గుంటూరుశాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలను తెల్చుకుంటున్నాను.
శ్రీ లలితాపరమేశ్వరియొక్క అనుగ్రహం పరిపూర్ణంగా
వారి కుటుంబసభ్యులు ఆయురారోరెం
ఇది - 'శ్రీలలితా సహస్రనామ వివరణ'కు సంబంధించిన ద్వితీయ భాగం.
మొదటి నామం అయిన 'శ్రీమాతా' నుండి 200వ నామం అయిన 'సర్వమంగళా' నామం వరకూ ఉన్న రెండు వందల నామాలకు సంబంధించిన ' ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన' సమన్వయాత్మకమైన వివరణ - ప్రథమ భాగంగా 1997 జూన్ 29వ తేదీన గుంటూరులోనే ఆవిష్కరింపబడింది.
పూర్వ ప్రోత్సాహము
ప్రథమ భాగంలోని నామాల వివరణకు పాఠక సోదర, సోదరీమణులు; పెద్దలు; పండితులు; శ్రీ విద్యోపాసకులు మొదలైన వారందరి నుండి వచ్చిన స్పందన - అనూహ్యము, అపూర్వము. 1983లో మొట్టమొదటగా నేను వ్రాసిన 'గాయత్రి' అనే చిన్న పుస్తకాన్ని చూసి మాస్టరు గారు (Master E.K) వాత్సల్య పూరితమైన అభిమానాన్ని, అనుగ్రహాన్ని వర్షింపచేశారు. 1986లో వ్రాసిన 'తైత్తిరీయోపనిషత్తు', 1995లో వ్రాసిన ‘అక్షర గణపతి - కుండలినీపతి', 1997లో వ్రాసిన ఈ 'శ్రీలలితా సహస్ర నామ వివరణ' పుస్తకాలు కూడా చూచి ఉంటే ఆనందంతో కౌగిలించుకునే వారనిపించింది. (ఎందుకంటే - ఆ మూడు పుస్తకాలు అలాంటివి). 1997 ఆగష్టులో హైదరాబాదులో జరిగిన గురుపూజలకు వెళ్ళినపుడు ఈ లలితానామ వివరణ ప్రథమభాగాన్ని చదివిన ఒక