Lalitha Sahasranama Vivaranamu-4 Telugu Book Download|లలితా సహస్ర నామ వివరణము-4
ముందుమాట
మొత్తం మీద ఈ లలితా సహస్ర నామ వివరణ ప్రచురణా యజ్ఞం అనుకున్న విధంగా, అనుకున్న కాలంలో అన్ని విధాలా అందరికీ సంతృప్తిని కలుగజేస్తూ ఈశ్వరనామ సంవత్సర కాలపరిమితిలోనే పూర్తి అయింది. అందుకు నాకు చాలా సంతృప్తిగాను, ఆనందంగాను ఉంది.
వివరణ పుట్టుపూర్వోత్తరాలు
13.10.1977 నుండి 15.11.1978 మధ్య వరకు దాదాపు సంవత్సర కాలం మా గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, విశాఖపట్నంలో - ఈ లలితా సహస్ర నామాలకు ధారావాహిక వివరణాత్మక ప్రసంగాలు చేసారు. వాటిని విని, పరవశించిన నేను 21.3.97 నుండి 28.2.98 వరకు గల దాదాపు సంవత్సర కాలంలో చేసిన నిర్విరామ కృషి వలన 'చతుర్భాగ సమన్విత గా ఈ 'లలితా సహస్రనామ వివరణ ప్రచురణా యజ్ఞం' శబ్దరహితంగా, స్ఫూర్తిదాయకంగా, చైతన్యవంతంగా ఆనందానుభూతి ప్రదంగా పరిసమాప్తమైంది.
గురుదేవులు వివరించిన విషయాలతో పాటు, నాకు దర్శనమైన విషయాలను గూడా జోడించి ఒక వినూత్న పద్ధతిలో సంప్రదాయానికి భిన్నంకాకుండా, అటు - - విజ్ఞాన శాస్త్రానికి, ఇటు - బ్రహ్మ విద్యకు వారధిలాగా ఉండే విధంగా 'ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన' సమన్వయాత్మకంగా సాగిన ఈ వివరణ, విశ్లేషణ, అన్ని రకాల వారి మన్ననలను, ప్రశంసలను, ప్రోత్సాహాలను పొందింది.