Lalitha Sahasranama Vivaranamu-3 Telugu Book Download|లలితా సహస్ర నామ వివరణము-3
ముందుమాట
నాకై నేను మున్ముందుగా చెప్పే ఈ నాలుగు మాటలూ విని, అటుపైన అమ్మమాటలు చదువుకోండి. అలా చెయ్యటం సమంజసం కూడా ! ఎందుకంటే - నన్ను ముందు పెట్టుకొని నా ద్వారా అమ్మ పలికే మాటలేగా ఇకముందు పుస్తకంలో రాబోయే మాటలన్నీ! నన్ను ఎలా పలికిస్తోందో ఈ ముందు మాటలో తెలియ చేసి, అటుపైన ఏం పలికించిందో వివరణలో వ్రాస్తాను.
మా గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు 13.10.77 నుండి 15.11.78 వరకు విశాఖపట్నం న్యూకోలనీలో వారి వసతి గృహ ప్రాంగణములో దాదాపు 52 వారాల 52 రోజులు ఈ లలితా సహస్ర నామాలపై ధారావాహికంగా చక్కని వివరణాత్మక ప్రసంగాలు చేశారు. నాలాటి కొందరు ఆ ప్రసంగ విషయాలను చక్కగా వింటూ, అవసరమైన చోట వ్రాసుకుంటూ ఆనందించారు. అలా విన్న విషయాలను, వ్రాసుకొన్న విషయాలను బాగా బుద్ధితో మథనం చేసి కొంత స్వానుభవ జ్ఞానాన్ని,
శాస్త్రజ్ఞానాన్ని, జ్ఞాన వృద్ధుల బోధనామృతాన్ని కలిపి రంగరించటం జరిగింది.