దేవి అశ్వధాటి|Devi ashwadhati Telugu book download
మదాలస
కవికుల గురువు కాళిదాసు కాశీమాత అనుగ్రహం వల్ల కవన శక్తిని పొంది రఘువంశాది కావ్యాలను, అభిజ్ఞాన శాకుంతలాది నాటకాలను రచించాడు. భక్తినిర్భరమైన అనేక స్తుతులను కూడా రచించాడు. వాటిలో ఈ దేవీ అశ్వధాటి ఒకటి.
కాళిదాసు దృష్టిలో జగతఃపితరులైన పార్వతీపరమేశ్వరులు నాగర్థాల లాంటివారు. అందుచేతనే కాళిదాను శబ్దస్థానీయురాలైన పార్వతీదేవిని శబ్ద ప్రధానమైన అశ్వధాటి వృత్తాలలో ప్రస్తుతించాడు.
అశ్వధాటి పాదానికి 22 అక్షరాలు కలిగిన ఆకృతి చ్ఛందోజాతం. ఇందులో 4 పాదాలుంటై. ప్రతిపాదంలోను త భ య జ న ర స గ అనే గణాలుంది. 7-14 అక్షరాలు యతి స్థానాలు. కనుక 8-15 అక్షరాలలో ప్రాసయతి ఉంటుంది. అంటే ప్రతి పాదంలోను 2-9- 16 అక్షరాలు సమంగా ఉండాలి. ఆ ప్రాసయతిలో హల్బామ్యంతోబాటు అచ్చామ్యం గూడా ఉంటే గమనం అందగిస్తుంది. కేవలం హల్సామ్యం మాత్రమే ఉండటం దోషంకాదుగాని ఆ నిందర్యం మందగిస్తుంది. సంస్కృత కవులలో కొంతమంది ఏ పాదానికి ఆ పాదాన్నే ప్రత్యేకంగా పరిగణించి వివిధ హల్లులతో ప్రాసయతిని ప్రయోగించారు. కాని అది శోభావహంగా లేదు. మన తెలుగు వృత్తాలలో ప్రాస నియమం నిత్యం కనుక, నాలుగు పాదాలలో రకరకాల హల్లులను ప్రాసయతిగా ప్రయోగించే అవకాశంలేదు.
Keywords:Sri Rama Karnamrutham Stotralu,Sthotralu,Sri Rama Karnamrutham Stotralu telugu book,Sri Rama Karnamrutham Stotralu,telugu shtotralu in pdf books, devotional ashtottaralu pdf files,Telugu Sthotralu,TTD ebooks download,Sri Lalitha sahasranama stotram PDF download, taparia sahitha stotralu PDF download, Devi mahatyam PDF download, Sri Vishnu sahasranama stotram PDF download,Sri Lalitha sahasranama stotram volume 1 PDF download,