Tatparya Sahitha StotraTelugu Book Download |తాత్పర్య సహిత స్తోత్రాలు
అధ్యారోహ మంత్రము
అభ్యారోహ మంత్రము
ఓం అసతో మా సద్గమయ ||
తమసో మా జ్యోతిర్గమయ ||
మృత్యోర్మా మృతం గమయ ||ఓం|
అవాస్తవిక స్థితినుండి వాస్తవిక స్థితికి, అజ్ఞానం నుండి జ్యోతిస్వరూపా నికి, మరణంనుండి శాశ్వత అమృత స్థితికి నన్ను గొనిపొమ్ము!
అచ్యుతాష్టకమ్
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ॥
నాశనము లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు,దామోదరుడు, వాసుదేవుడు, హరియు, శ్రీధరుడు, మాధవుడు, గోపికావల్లభుడు, జానకీ నాయకుడైన రామచంద్రుని సేవింతును.
అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితమ్ । ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందభే ॥
శాశ్వతుడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మాధవుడు, శ్రీధరుడు. రాధికకు ఆరాధ్యుడు, లక్ష్మీ దేవికి నివాసమైనవాడు, వర్ణింపనలవి కాని మనసుందరుడు, దేవకీదేవికి ఆనందము కలుగచేయు ఆ శ్రీకృష్ణుని నేను ధ్యానింతును.