ఆదిత్య హృదయ |Aditya Hrudayam Telugu Book Download
తొలి పలుకు
శ్రీరామచంద్రుడు భగవంతుడే అని కీర్తించి కొన్ని వేల సంవత్సరాలుగా పూజిస్తున్నవారు ఉన్నారు. ఆయన ఒక సర్వోన్నత సద్గుణ సంపన్న రాజకుమారుడు మాత్రమే అని భావించే వారూ ఉన్నారు.
వాల్మీకి రామగాధ రచించాడు. భగవంతుని అవతారమని కీర్తించాడు. కానీ రామునికి తనే భగవంతుడనని తెలియదు అని వ్రాశాడు. ఆయన దైవాంశ సంభూతుడైన రాజకుమారుడనే వ్రాశాడు. ప్రజా రంజకుడైన రాజు, సద్గుణ సంపన్నుడైన వ్యక్తి, శరణన్న శత్రువుని కూడా కాపాడే దయామూర్తి, సోదరులకి దైవసమానుడైన అన్న, తండ్రికి బహిః ప్రాణమయిన కుమారుడు, భార్యకి ప్రాణాధిక్యుడయిన భర్త, స్నేహితుని కోసం దొంగచాటుగా వాలిని చంపి అపప్రథకు కూడా వెరువని స్నేహమూర్తి, హనుమంతునికి దైవమే అయిన యజమాని ఇలా ఆయన ఎన్నో విశిష్ట వ్యక్తులు ఒకే చోట ఉన్న పరాక్రమ మూర్తి, ఖరదూషణాది
వేల రాక్షసులను ఒక్కసారే సంహరించిన మేటి వీరుడు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని ఆ మహామహుని ప్రవృత్తి.
అందుకే తులసీదాసు ఆయనకంటే దేవుడు లేడని కీర్తించాడు. త్యాగయ్య, రామదాసు జీవితమంతా ఆయనను కీర్తనల ద్వారా