ఆదిత్య హృదయ రహస్యము|Aditya Hrudayam Rahasyamu Telugu Book Download
భూమిక
ఆదిత్య హృదయ రహస్యము
"ఆదిత్య హృదయము" ను ఆదికవియగు వాల్మీకి మహర్షి ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో రావణవధ గావించుటకు అగస్త్య మహర్షి - శ్రీ రామచంద్రమూర్తికి ఉపదేశించిన మీదట వారిని యీ స్తోత్ర ముతో ధ్యానించి శత్రువధగావించి జయము నొందెనని తెల్పియున్నారు.
పరమపవిత్రమైన యీ స్తోత్రరాజమును, భక్తులు నాడు మొదలు నేటివరకు నిత్యము పారాయణ గావించుచు కోరిన ఫలములను పొందు చున్నాం.
ఈ సూర్యవంశీయుడైన శ్రీరామప్రభువు రఘువంశమున అవత
రించి యుండెను.
ఆరఘువంశమును మహాకావ్యముగ వ్రాయబూనిన కాళిదాస మహాకవి"క్వసూర్య ప్రభవో పంశః క్వచాల్ప విషయామతిః”. సూర్య భగవానునివలన వృద్ధినందిన రఘువంశమెంత గొప్పది? ఆల్పమతిపైన నేనెంతటివాడను. ఈ ప్రయత్నమెట్లున్నదనగా అజ్ఞాని చాటుటకశక్య మైనసాగరమును చెప్పుకొయ్య సాయముతో దాటదలచినట్లున్నదని తన యసామర్ధ్యమును తెలిపియుండెను.
ఆ కాళిదాసు వంశమున జన్మించినవారిలో మిక్కిలి సామాన్యుడు నైన నేను రఘువంశమునకును సమస్త లోకములకు ఆరాధ్య దైవమైన సూర్యభగవానుని స్వరూపముము మహిమను దెలు చుండు యీ స్తోత్ర మును వివరింపబూనుట అత్యంత సాహసకార్యము. ఈ స్తోత్రమునకు గీర్వాణాంధ్ర భాషలలో ఇప్పటివరకు ఎందరో వ్యాఖ్యానించి లోకోప కాధము గావించినారు. వారికి నా అనంతానంత నమస్కారములు.