శ్రీ వల్లూరమ్మ అమ్మవారి దేవస్థానం టంగుటూరు|Sri Valluramma Ammavari Devasthanam Tanguturu

Sri Valluramma Ammavari Devasthanam Tanguturu

శ్రీ వల్లూరమ్మ అమ్మవారి దేవస్థానం టంగుటూరు

వరాల తల్లి... వల్లూరమ్మ :

కోరిన కోర్కెలు తీర్చు తల్లిగా, విఘ్నములు బాపు కల్పవల్లి, సంతతికి కలిగే ఆపదల నుండి గాచు అమృతవల్లిగా, దుష్టశక్తులను అంతం చేయు సర్వశక్తిమయిగా వివిధ రూపాలలో రక్షిస్తుంది. సహజంగా తండ్రి ఆలన లేకున్నా మానవుడు జీవించగలడేమో గాని, తల్లి పాలన, లాలన లేకుండా బ్రతుకు దుర్భరం. సుమారు ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొని, నేటికిని దినదిన ప్రవర్ధమానమవుతున్న దేవాలయం శ్రీ వల్లూరమ్మ దేవస్థానం, ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణానికి సుమారు 5 కి.మీ. దూరంలో దక్షిణ దిశగా, విజయవాడ- మద్రాసు జాతీయ రహదారిపై నిరంతర వాహనాల రద్దీతో, భక్తుల సందోహాలతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం వల్లూరమ్మ కేత్రం.. క్షేత్రపాలకురాలు శ్రీవల్లూరమ్మ..వల్లూరమ్మ గుడి ఎలా వెలసింది అనేదానికి స్థానికులు ఓ కధ చెప్తారు.వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజులకు సరిపడేది కాదు. వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులు. వారివలన తమకు హాని జరగకుండా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకూడదని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ సంగతి తెలిసిన వెంకటగిరి రాజులు యజ్ఞం జరక్కుండా చేయాలనుకున్నారు. వెంటనే, యజ్ఞం నిర్వహించే యోగీంద్రుని ఏదో నెపాన ఆపాలనుకున్నారు. కానీ, మందపాటి రాజుల సంకల్పం ఉన్నతమైనది కనుక అలా జరగలేదు.మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. అయితే యజ్ఞవాటిక నుండి మహా జ్వాలలు బయల్దేరాయి. అందులోంచి ఉల్కలు వస్తున్నాయి. అది చూసి అందరూ భయపడ్డారు. ఏదయినా అపరాధం జరిగిందా అని సంశయించారు. కానీ చూస్తుండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతి దాల్చి ముందుకు సాగింది. అలా వల్లూరు చెరువు వైపు వెళ్ళి అక్కడ అంతర్ధానం అయింది. ఆ దివ్య స్వరూపం చూసి అక్కడివారు ముందు భయపడినా, వెంటనే మహానుభూతికి గురయ్యారు. ఆ శక్తి వేరెవరో కారని, అమ్మవారేనని అర్ధం చేసుకుని ఆలయం కట్టించారు. అగ్ని నుండి వెలసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు. వల్లూరులో వెలసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది. స్థానికులు వల్లూరమ్మ అని, వల్లూరమ్మ తల్లి అని వ్యవహరిస్తూ భక్తిప్రపత్తులతో ఆరాధిస్తారు.

పొంగళ్ల సమర్పణ :

ప్రతి ఆదివారం వల్లూరమ్మ ఆలయంలో భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. రైతులు. వ్యాపారులు, సంతానార్థులు, అవివాహితులు తమ ఈప్సితాలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. పొర్లుదండాలు పెడతారు. మేళతాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

వాహన పూజలు

వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి కూడా భక్తులు కొత్త వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ ఒకసారి వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, ప్రమాదాలు జరగవని విశ్వాసం.

సుందర శిల్పాలయం :

దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంగా 16 విగ్రహాలను, శిల్పాలను ఏర్పాటు చేశారు. అష్టలకులతోపాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు, శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణామూర్తివంటి దేవతామూర్తులను ఏర్పాటుచేస్తున్నారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

విశేష కార్యక్రమాలు :

వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. వెయ్యిమందికిపైగా మహిళలు పాల్గొంటారు. ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పర్వదినంనాడు అమ్మవారికి గ్రామోత్సవంతోపాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది.


ఆలయానికి చేరుకునే మార్గం :

వల్లూరమ్మ ఆలయం విజయవాడ-చెన్నై ప్రధాన జాతీయ రహదారి పక్కన ఉంది. పల్లెవెలుగు బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వల్లూరు గ్రామం ఒంగోలుకు 12 కి.మీ.లదూరంలో ఉంది. బస సౌకర్యాలు ఒంగోలు, బంగుటూరులు ఉన్నాయి. వల్లూరమ్మ దేవస్థానంలో కూడా భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు.

HISTORY OF TEMPLE

Valluramma Temple :

Sri Valluramma Temple is one of Valluru in Ongole, Andra Pradesh’s renowned Shakthi Temple. This temple is on the highway to Nellore, 12 kilometers from the town of Ongole. During the Dasara Festival, huge numbers of devotees visit this Valluramma Temple Ongole.

Is connected to Ongole east at 8KM. Valluramma Temple is one of the many temples that have been accepted. Bags of admirers from the city boundaries and their bound assemblage of the temple during the Dasara Festival. Accessibility to Valluramma Temple for the ambit acquisitions in the middle of Ongole. It is available during the journey, which is about 11 km away. We also get to know the Biking Time from Ongole to Valluramma Temple is 13 minutes after a lot of trouble. The ambit and cycling time would alter properly depending on the circumstances of the cart and the alley. The godess valluramma is the valluru’s most important god, the devotees will worship the valluramma to satisfy their desires and views.


Valluramma Temple History:

Sri Valluramma Temple is present in the Valluru Village on the Calcutta-Chennai national highway, 8 km away from the city’s southern side. In ancient days, there were conflicts in the kingdom between Venkatagiri Rajas and pelluru Mandapati Rajas so they announced conflict. In ancient days, there were conflicts in the kingdom between Venkatagiri Rajas and pelluru Mandapati Rajas so they announced conflict. Addanki Ramachandra Rao, well-known Homam conducted by Bhrahmin of the kings. Ulkamuhki Ammavaru has risen from that Homam. People in the village of Addanki believed Ulkamukhi Ammavaru was their daughter in the village. People from the village of Valluru worshiped Ulkamukhi Ammavaru with excellent dedication and Ammavaru became “Valluramma” for individuals from the village of Valluru.

Valluramma Temple Timings:

Morning : 6 am – 1 pm

Afternoon : 1.30 pm – 8 pm

Regular Sevas & Darsan Timings

SAHSRANAMALU(DAILY), సహస్రనామాలు (ప్రతిరోజూ) RS:20/ 

06:00 AM 08:00 PM

VAHANA PUJA (TWO WHEELARS), వాహన పూజ (రెండు చక్రాల బండి) RS:50/

06:00 AM-08:00 PM

ABHISHEKAM (EVERY TUESDAY, FRIDAY), అభిషేకం ( మంగళవారం, శుక్రవారం) RS:100/

06:00 AM 08:00 AM

ANTHARALAYA ASHTOTRAM(DAILY), అంతరాలయం అష్టోత్రం (ప్రతి రోజు) RS:40/ 

06:00 AM - 08:00 PM

PONGAL(DAILY), పొంగల్ (ప్రతి రోజు) RS:10/ 

06:00 AM - 08:00 PM

ASHTOTRAM(DAILY), అష్టోత్తరం (ప్రతి రోజు) RS:20/ 

06:00 AM 08:00 PM

VAHANA PUJA(FOUR WHEELAR), వాహన పూజ (నాలుగు చక్రాల బండి) RS:75/ 

06:00 AM-08:00 PM

LARI,BUS ETC,VAHANA PUJA, లారీ, బుస్స్ మొదలైనవి.. వాహన పూజ RS:100/

06:00 AM - 08:00 PM

Paroksha (Virtual) Seva Details

PAROKSHA ABHISHEKAM (EVERY TUESDAY,FRIDAY), పరోక్ష అభిషేకం (మంగళవారం, శుక్రవారం) RS:100/

Every Tuesday from 06:00 AM-08:00 AM

PAROKSHA ASHTOTRAM(DAILY), పరోక్ష అష్టోత్రం (ప్రతి రోజు)RS:20/

Daily from 06:00 AM-08:00 PM

PAROKSHA ANTHARALAYA ASHTOTRAM(DAILY), | పరోక్ష అంతరాలయ అష్టోత్రం (ప్రతి రోజు) RS:40/ 

Daily from 06:00 AM-08:00 PM


Transport|రవాణా

By Road:

Busses are available from Tanguturu APSRTC Bus Station & Ongole Bypass APSRTC Bus Station to reach this temple.

ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ఒంగోలు మరియు టంగుటూరు నుండి ఏ.పి.యస్ .ర్.టి.సి. బస్సులు అందుబాటులో కలవు.

By Train:

Surareddipalem Railway Station & Ongole Railway Station are the nearby Railway stations to Valluru.

ఈ ఆలయానికి సమీపంలో సురారెడ్డిపాలెం మరియు ఒంగోలులో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి.

By Air:

The nearest Airport is Vijayawada International Airport.

శ్రీ వల్లూరమ్మ ఆలయానికి 152 కిలోమీటర్ల దూరములో గన్నవరం జాతీయ విమానాశ్రయం కలదు.

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Chennakesava Swamy Temple

"Sri Prasanna Chennakesava Swamy" is one of the famous and oldest temple in Prakas am District. The royal brothers of the Vijayanagara Empire ruled the royal brothers Ra mabhadra Raja and Raghupati kings in the end of the 16th century in the Ongole (now on Castle Street).They worshipped their family goddess "Sri Prasanna Chennakesava S wamy" with a great respect and do daily pooja and abhishekam.

"శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి" వారి దేవస్థానము ప్రకాశం జిల్లాలోనే ప్రాచీనమైన ప్రముఖ దేవస్థానము, విజయనగర సామ్రాజ్య పాలకులకు సామంత రాజులు అయిన మందపాటి రాజు సోదరులు రామభద్రరాజు, రఘుపతి రాజులు 16వ శతాబ్దము చివరిలో ఒంగోలులో ( ఇప్పటికి కోట వీధిలో ) కోటను నిర్మించుకొని ప రిపాలించేవారు. వారి ఇష్టదైవము అయిన "శ్రీ చెన్నకేశవస్వామి" వారిని ప్రతిష్టించి నిత్యం దూపదీప నైవేద్యములతో పూజించేవారు.

Sri Kashi Visweswara Swamy Temple

Other famous temple to visit in Prakasam district is Kashi Visweswara Swami temple. This is one of the famous shrine to visit in this region. This temple was constructed in 1945. The presiding deity in this temple is Swami Visweswara Swami. This is lo cated on the bank of Kusasthali River. The calm and peaceful environments all-around of this temple attracts lot of devotees from different part of this region. The architectu re of this temple is marvelous and depicts fine quality of engineering. The idol of this t emple is very beautiful and inspiring. You can also attend the arti program which is hel d in the premises of this temple at every morning and evening.

ప్రకాశం జిల్లాలో మరొక ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం 194 5 లో నిర్మించబడింది. ఈ ఆలయ దేవతా మూర్తి "శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు". ఈ ఆలయం కుశస్థలి. నది ఒడ్డున ఉన్నది. ప్రశాంతమైన వాతావరణం కలిగిఉన్న ఈ దేవాలయం వివిధ ప్రాంతాల భక్తులను ఆక ర్షిస్తుంది. ఈ దేవాలయ నిర్మాణం అద్భుతమైన ఇంజనీరింగ్ నాణ్యతను వర్ణిస్తుంది. ఈ దేవాలయంలో విగ్ర హం చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే హారతి కార్యక్రమానికి ప్రజలందరూ హాజరు అవుతుంటారు.

Contact Numbers and information

Sri Valluramma Ammavari Devasthanam,

Valluru,

Prakasam District,

Andra Pradesh.

Pincode:523 272.

Popular post to download:

telugu books downloadAditya Hrudayam Telugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

More Books
keywords:Sri Valluramma Ammavari Devasthanam Tanguturu Information,Sri Valluramma Ammavari Devasthanam Tanguturu,Sri Valluramma Ammavari Devasthanam Tanguturu history,Sri Valluramma Ammavari Devasthanam Tanguturu contact numbers,popular places to visit in Tanguturu ,Tanguturu transport,Shri sadguru stotram PDF download, Aditya hridayam pdf download,Mallikarjuna suprabhatam PDF download,Sri Lalitha trishakti bhashan Deepika PDF download,Sri Ramakrishna amrutham PDF download, Deviashwathaati PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS