సాయి స్తోత్రాలు|sai sthotralu Telugu Book Download
శ్రీ సాయినాథాయ నమః
షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే,
శ్రీ సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం.
రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సాయీరాం,
ఈశ్వర్ అల్లా తేరానాం. సబ్క సమ్మతే భగవాన్,
శ్రీ సాయినాథ సుప్రభాతమ్
షిర్డిక్షేత్రాయ విద్మహే,సాయినాధాయ ధీమహి,
తన్నో సాయిరామ ప్రచోదయాత్.
ఉత్తిష్ట దేవదేవేశ ఉత్తిష్ట నరపుంగవ,
ఉత్తిష్ఠ సిద్ధసంసేవ్య కర్తవ్యం భక్తరక్షణం,
ఉత్తిష్టోత్తిష్ట సాయీశ, ఉత్తిష్ఠ గురుపుంగవ,
ఉత్తిష్ఠయోగహృద్వాస, త్రైలోక్యం మంగళం కురు.
తవ సుప్రభాతమభయప్రదాతా,
భవతు ప్రసన్న భక్తజన కాంక్షమానాః,
యోగీంద్ర హృదయనివాస కాంక్షమానాః,
శ్రీ సాయినాథవిభో తవసుప్రభాతం.
శుకసనక నారద తుంబురాదయస్తే.
ధామాంతికే కరగృహీత ప్రసూనమాలాః,
తిష్ఠంతి శతవదర్శన కాంక్షమానా:
శ్రీ సాయినాథవిభో తవ సుప్రభాతం.