సుమతి శతకం|Sumathi satakam Telugu Book Download
ఈ సుమతీ శతక కర్త బద్దెన. 13వ శతాబ్దికి చెందినవాడు. ఈ శతక కర్త చెప్పిన నీతులు ఆకాలానికే కాదు ఎప్పటికీ జననే విధంగా తీర్చిదిద్దాడు.
1.శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాం
ధారళమైన నీతులు
నోరూరగ వుబుట్ట నుడివెద సుమతీ,
తన శతక స్వభావాన్ని పూరించే విధంగా మొట్ట మొదటి పద్యంలోనే చెప్పాడు. తను చెప్పటం లేదట. శ్రీరాముని దయ చెప్పిస్తోందట. ఏ విధంగా అంటే అఖిల లోకము. ఎల్ల జనులు మెచ్చుకొనే విధంగా 'ఔరాయనంగా ఎన్నో నీతులు నోటిలో నించి ధారా పాతంగా వస్తాయట. నోటిలో నీరు ఏవిధంగా పూరుతుందో తన కలంలోంచి (గంటం. లోంచి) ఆ విధంగా నీతులు వస్తాయట. చదివే వాడు (వినే) బుద్ధిమంతుడైతేనే ఇవి రుచిస్తాయి. అందుకనే 'సుమతీ' అనే మకుటం ఎన్నుకొన్నాడు.
2. అక్కరకురాని చుట్టము.
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము.
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ,
ఏవేవి వెంటనే వదలి వేయాలో చిన్న చిన్న మాటలలో మనసుకి హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పాడు. అవసరానికి పనికి రాని చుట్టాన్ని, ఎన్ని వేడుకున్నా వరమీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కినా పరుగెత్తని గుఱ్ఱన్ని నీతిమంతుడు వెంటనే వదలి వేస్తాడు