కుమార శతకము|Kumara satakam Telugu Book Download
శ్రీ కుమారశతకము సంస్కృతములో రావు భాస్కరరావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిణి రాజా చెల్లయ్యమ్మ రావుబహద్దూరు ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలమ్ ప్రెస్సులో క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రిగారిచే ముద్రించబడింది. ఈ శతకంలో 101 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి వెనువెంటనే ఆంధ్రీకృతపద్యము ఉన్నాయి. రావు వంశపు కులవృద్ధుడైన రావు భాస్కరరావు పిఠాపురం మహారాజా రావువేంకటకుమార మహీపతి సూర్యారావును ఉద్దేశించి రాజనీతిని బోధించిన శతకము ఇది. రావు వంశపుటౌన్నత్యము, మహారాజా వారి మాతృపితృ నగర మహిమ, మహారాజా వారి విద్వత్తు మొదలైన విషయాలు ఈ శతకంలో పొందుపరచబడి ఉంది. "కుమార!" అనేది ఈ శతకానికి మకుటంగా ఉంది.
కుమార శతకము
కవి పేరు :రావు భాస్కర రావు
అనువాదకుడు :దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి
వ్రాయబడిన సంవత్సరం :1897
మొదటి ప్రచురణ తేదీ :1900
దేశం : భారతదేశం
భాష తెలుగు : మకుటం కుమార!
విషయము(లు) :రాజనీతి
పద్యం/గద్యం :పద్యం
ఛందస్సు :తేటగీతి
ప్రచురణ కర్త :క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి
ప్రచురణ తేదీ :1900
మొత్తం పద్యముల సంఖ్య :101
అంకితం :రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
ముద్రాపకుని పేరు :క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి
ముద్రణా శాల :లారెన్స్ అసైలం ప్రెస్, మద్రాసు
1) శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్య దయా స్వభావు సారననాభున్
లోఁభావించెద నీకున్
వైభవము లోనగుచుండ వసుధ గుమారా!
ఓ కుమారా! లక్ష్మీ వల్లభుడైన శ్రీహరి, పద్మనాభుడు, దయాశాలి నీకు సర్వసంపదలు ఇచ్చుదాత.
2) ఆజ్ఞ యొనరెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలుగు లోకుల మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్షన్
బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా!
ఓ కుమారా! నీవు సమర్థుడుగా పేరు పొందుటకు నీకిచ్చిన పనిని నైపుణ్యముగా చేయటయే కావలెను.
3)అతి బాల్యములో నైనను
బ్రతికూలపు మర్గాములఁ బ్రవర్తింపక న
ప్రతి మీర మెలగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును గుమారా!
కుమారా! సుఖముననుభవించుటకు బాలము నుండి దుందుడుకు చేష్టల చేయక సత్సవర్తన కల్గిన వాడే తగును.
పుస్తకాల కోసం డౌన్లోడ్ పై క్లిక్ చేయండి
More Books
Keywords:|Kumara shatakamu,|Kumara shatakamu telugu book|Kumara shatakamu pdf Download,|Kumara shatakamuin pdf books,TTD ebooks download,,Bhagavad Gita Telugu books download,Astadasa puranalu PDF download,Shri Brahma puranam PDF download,markandeya purana PDF download,purana PDF download,Sri Narasimha puranam PDF download,Shri Harivansh Puran PDF download,