Sripathi Stuti Mala Telugu Book Download |శ్రీపతి స్తుతిమాల
శుభాశంసనము
గురుభ్యస్తద్గురుభ్యశ్చ నమోవాకమధీమహే | వృణీమహే చ తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ ॥
భగవద్బన్ధువులారా!
మన వైదికవాఙ్మయంలో స్తోత్రసాహిత్యానికి అత్యున్నతమైన స్థానమున్నది. సకలకళ్యాణగుణాఢ్యుడైన శ్రియఃపతిని కీర్తించడానికే విజ్ఞాననిధులైన మన పరమర్షులు పురాణవాఙ్మయంలో లలితమధురము లైన అనేక స్తుతులను నిర్మించారు. శ్రీవిష్ణుపురాణములో శ్రీస్తుతి, శ్రీమద్భాగవతములో బ్రహ్మస్తుతి, భీష్మస్తుతి, వేదస్తుతిలాంటి సారగర్భితములైన స్తోత్రములనేకములున్నవి.
భగవద్గుణానుభవనిమగ్నులు, ప్రామాణికులు అయిన మన పూర్వాచార్యులు మనకందించిన స్తోత్రవాఙ్మయము చాలా అనర్హమైనది. అగాధభగవద్భక్తిసిన్ధువులైన ఆళ్వార్లు భక్తిపారవశ్యముతో పాడిన దివ్య ప్రబద్ధములన్నీ భగవంతుని స్తుతిరూపములే. మన శిష్టులవలంబించి మనకు హితముగా చూపిన నిష్కంటకరాజమార్గమే ఈ స్తోత్రానుసన్దాన