శ్రీ పానకాల లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం మంగళగిరి|Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri

Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం

మంగళగిరిలో పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తాడు. ఇది గుంటూరు నుండి 19 కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ముగ్గురు నరసింహ స్వాములు భక్తుల పూజలనుకుంటున్నారు. కొండ దిగువన ఉన్న దేవుని పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండపైన ఉన్న దేవుడిని పానకాల స్వామి మరియు మూడవది కొండపైన గండాల నరసింహ స్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలువబడుచున్నది. ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహ స్వామి. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం వున్నది.  అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు నమ్ముతారు. మంగళగిరి పానకాలస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం  (పంచదార, బెల్లం, చెరకు)తో అభిషేకం చేస్తే స్వామి అభిషేకించిన పానకంలో సగభాగాన్ని స్వామి వారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. పానకంతో ఎంత అభిషేకం చేసినా అందులో సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు వదిలేస్తారు. అందుకే ఈ స్వామి వారిని పానకాలస్వామి అని పిలుస్తారు. ప్రతి నిత్యం బిందెల కొలది పానకం సమర్పించినా ఒక్క చీమ అయినా దరి, దాపులలో ఎక్కడా కనిపించదు. ‘ఈ విశేషం వల్లనే ఈ దైవం. పానకాల స్వామి గా ప్రసిద్ధుడయ్యాడు. ఆలయానికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన మెట్లకు కుడివైపున విజయనగరానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల రాతి శాసనం మరియు మరికొంత ముందుకు మహాప్రభు చైతన్య పాద ముద్రలు కనిపిస్తాయి. మెట్లపై మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది, అక్కడ నోరు విశాలంగా తెరిచిన ముఖం మాత్రమే ఉంది. 1955లో ఆలయం ముందు ధ్వజస్తంభం నిర్మించబడింది. ఆలయం వెనుక శ్రీ లక్ష్మి ఆలయం ఉంది, దీనికి పశ్చిమాన కృష్ణానది ఒడ్డున వుండవల్లి గుహలకు దారితీసే సొరంగం ఉంది.

1890లో శ్రీ చన్నప్రగడ బలరామదాసు ఈ ఆలయానికి మెట్లను నిర్మించారు. కొండపై దేవి ఆలయం పక్కన ఒక గుహ ఉంది. ఆ గుహ నుండి వుండవల్లికి ఒక దారి ఉందని, ఆ మార్గంలో ఋషులు కృష్ణానదిలో స్నానానికి వెళ్లేవారని చెబుతారు. ఇప్పుడు, గుహ చాలా చీకటిగా ఉంది, మరియు మార్గం కనిపించలేదు.

గాలి గోపురం

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తయినది. ఆలయానికి తూర్పున ఈ గాలిగోపురం ఉన్నది.   దీనిని 1807-09 కాలంలో అమరావతి ప్రభువు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు శ్రీ గారు కట్టించారు. ఇది 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపురం పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మించారు.

పానకాలస్వామి కొండ

మంగళగిరిలోని కొండ అదియుగపు కాలము నాటి భోండా లైట్ అని పిలువబడే రాళ్ల సమూహానికి చెందినది. ఈ కొండ ఆకారం ఏనుగులా కనిపిస్తుంది. అన్ని దిశల నుండి కొండ ఏనుగు ఆకారంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ కొండ ఎత్తు 875 అడుగులు. కొండపైకి 480 మెట్లను 1890లో శ్రీ చన్నప్రగడ బలరామదాసు ఈ ఆలయానికి మెట్లను నిర్మించారు.. ఈ కొండపై అమ్మవారి దేవాలయం పక్కనే ఒక గుహవున్నది. గుహ నుండి వుండవల్లికి ఒక దారి ఉందని, ఆ మార్గంలో ఋషులు కృష్ణానదిలో స్నానానికి వెళ్లేవారని చెబుతారు. ఇప్పుడు, గుహ చాలా చీకటిగా ఉంది, మరియు మార్గం కనిపించలేదు.

గండదీపం

కొండపైన ఉన్న గుండాల స్వామి వారికీ రూపం లేదు. అక్కడ దీపం వెలిగించే ఏర్పాటు మాత్రమే ఉంటుంది గాని అక్కడ ప్రత్యేక విగ్రహం ఉండదు. భక్తులు తమకు గండాలు వచ్చినప్పుడు ఆ గండాలు తొలగిపోవాలని మ్రొక్కుకుంటారు. గండాలు పూర్తయిన తర్వాత గండదీపం వెలిగించాలని భక్తులు స్వామి వారిని ప్రార్థిస్తారు. ఇక్కడ వుండే ఖాండిలో  ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి  వాత్రి పెట్టి సాయంత్రం వేళల్లో  వెలిగిస్తారు. ఆ గండదీపం చుట్టుపక్కల చాలా గ్రామాల ప్రజలకు కనిపిస్తుంది.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం

ఆగమ శాస్త్ర విధి శ్రీ శాంత నరసింహ స్వామి, శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారి రోజున ఇక్కడ కల్యాణం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ముందు రోజు చతుర్దశి రోజు రాత్రి నరసింహ స్వామి కల్యాణం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. వివాహానికి ముందు, చెంచులు తమ ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహ స్వామితో వివాహం చేసుకున్నందుకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక వేడుకను నిర్వహిస్తారు.

ఉత్సవాలు

ఫాల్గుణ మాసంలో 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి.  ఫాల్గుణ శుధ్ద షష్టినాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి, శ్రీదేవి, భూదేవులకు కళ్యాణం  జరుగుతుంది. మరునాడు, అంటే పౌర్ణమి రోజు జరిగే రధోత్సవంలో లక్షమంది పైగా ప్రజలు పాల్గొంటారు.  స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రధం లాగటానికి భక్తులు పోటీ పడతారు.  కనీసం ఆ రధం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు.  ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరనాళ్ళుకూడా ప్రసిధ్దికెక్కింది. శ్రీరామ నవమి, హనుమజ్జయంతి, నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి వగైరా ఇక్కడ జరిగే

ఇతర ముఖ్య ఉత్సవాలు.

కొండపైన పానకాలస్వామి ఆలయానికి మెట్ల మార్గమేకాక  వాహనంలో కూడా చేరుకోవచ్చు.

దర్శన  సమయాలు

కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది.  సాయంత్రం సమయంలో దేవతలు, ఋషులు స్వామిని సేవించటానికి వస్తారని ఇక్కడివారి నమ్మకం.  అందుకే 3 గం.లకి ఆలయం మూసేస్తారు.

కొండ దిగువనవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలు

ఉదయం 5 గం. లనుంచి 12-30 దాకా తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి 8-30 దాకా.

పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమయాలు

ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 07:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల ఆలయం వరకు తెరిచి ఉంటుంది.

ప్రతిరోజు పూజ సమయాలు

అర్చన: ఉదయం 07:00 గంటల నుండి ఉదయం 07:30 నిమిషాల వరకు.

ప్రత్యేక అర్చన మరియు పానకం సమర్పణ: ఉదయం 07:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు.

ద్వారబంధనం:మధ్యాహ్నం 03:00 గంటలకు ఆలయ తాలుపుమూసివేయడం జరుగుతుంది.

సాయంత్రం వేళల్లో దేవతలు, ఋషులు భగవంతుడిని పూజిస్తారని చెబుతారు. కాబట్టి సాయంత్రం పూట అర్చన ఉండదు.

HISTORY OF TEMPLE

Mangalagiri Temple

The temple of Sri Panakala Lakshmi Narasimhaswamy is situated on a hill. On the right side of the steps (provided to reach the temple), there is a stone inscription by Sri Krishna Deva Raya of Vijayanagar, and a little further up, the footprints of Chaitanya Mahaprabhu can be seen. Midway up the steps, there is a temple of Lord Panakala Lakshmi Narasimhaswamy, there is only the face with the mouth opened wide

Sri Pankala Lakshmi Narasimha Swamy Temple is located in Mangalagiri of Guntur District. Mangalagiri means The Auspicious Hill. This place is one of the Ashta Vyshnavakshetrams (sacred places) in India. The eight places where Lord Vishnu manifested himself are:

Behind the main temple, there is a temple of Sri Rajyalakshmi Ammavari Temple the consort of Lord Narasimha. Here, to the North of the temple, you can find a tunnel which is said to end at Undavalli on the banks of River Krishna. It was believed that sages used to pass through this tunnel to have baths in River Krishna.

INTERESTING THINGS ABOUT THE TEMPLE

The temple of Sri Panakala Lakshmi Narasimhaswamy is situated on the hill. Lord Panakala Lakshmi Narasimhaswamy there is only the face with the mouth widely opened. It is a regular practice in the temple to offer beverage made of jaggery and water as Naivedya.

The Image of the Lord in the form of Narasimha (man-lion) and that of Lakshmi Devi to his left are of stone. The garland of the Lord with 108 saligramams is of special significance here. Dakshanavrutha Sankham, a special conch believed to be one that was used by Lord Krishna and presented by the Maharaja Sarfoji of Tanjore, is one more possession of significance of the Lord.

About 200 years back Raja Vasireddy Venkatadri Naidu who ruled from Amaravati as his capital constructed a stupendous gopuram (tower) on the eastern gate of the Lakshmi Narasimhaswamy. It is one of the highest gopurams in South India and only one of its type in this part of India. It is 153 ft. in height and 49 feet wide with 11 stories, and gates facing east and west.


 Regular Sevas & Darsan Timings

Sri Pankala Lakshmi Narasimha Swamy Temple (Up Hill)
07:00 AM-03:30 PM

sri Lakshmi Narasimha Swamy Temple (Down Hill)
05:00 AM-08:30 PM

ప్రత్యక్ష అష్టోత్తరం రూ. 60/- (రెగ్యులర్) దిగువ సన్నిధి 
08:00 AM-06:00 PM 

Prathyaksha Ashtottharam Rs. 60/- (Regular), Down Hill
08:00 AM - 06:00 PM

ప్రత్యక్ష కుంకుమార్చన రూ. 50/- (రెగ్యులర్) దిగువ సన్నిధి 
08:00 AM - 06:00 PM 

Prathyaksha Kunkumarchana Rs. 50/- (Regular) Down Hill
 08:00 AM-06:00 PM

ప్రత్యక్ష అష్టోత్తరం రూ. 60/- (రెగ్యులర్) ఎగువ సన్నిధి 
08:00 AM 03:00 PM 

Prathyaksha Ashtottharam Rs. 60/- (Regular), Up Hill
08:00 AM - 03:00 PM

ప్రత్యక్ష కుంకుమార్చన రూ. 50/- (రెగ్యులర్) ఎగువ సన్నిధి
08:00 AM-03:00 PM 

Prathyaksha Kunkumarchana Rs. 50/- (Regular) UP Hill
08:00 AM - 03:00 PM

పానకం నివేదన రూ.60/- (రెగ్యులర్) (పానకం తయారీ ఖర్చు రూ.55/- + నివేదన రూ.5/-)
07:00 AM-03:30 PM 

Panakam Rs. 60/- (Regular) (Panakam Preparation Charge Rs. 55/-+ Nivedana Rs. 5/-) 
07:00 AM-03:30 PM

ప్రత్యక్ష సహస్రనామార్చన రూ. 200/- (రెగ్యులర్) 
07:30 AM-08:30 AM

Prathyaksha Sahasranamarchana Rs. 200/- (Regular)
07:30 AM-08:30 AM 

ప్రత్యక్ష శాంతి కళ్యాణం రూ.1116/- (రెగ్యులర్
09:00 AM - 10:30 AM 

Prathyaksha Santhi Kalyanam Rs. 1116/- (Regular)
12:45 PM-10:30 AM

ప్రత్యక్ష సుదర్శన హోమము రూ.3500/- (రెగ్యులర్) 
07:00 AM-09:30 AM

Prathyaksha Sudarshana Homam Rs. 3500/(Regular)
07:00 AM-09:30 AM

ప్రత్యక్ష నరసింహ హోమము రూ.3500/- (రెగ్యులర్) 
07:00 AM-09:30 AM

Prathyaksha Narasimha Homam Rs. 3500/- (Regular) 
07:00 AM - 09:30 AM

ప్రత్యక్ష తిరుమంజనం రూ.1116/- (రెగ్యులర్) శ్రీ స్వామి వారికి ప్రతి ఏకాదశి & ప్రతి స్వాతి నక్షత్రం 
04:00 AM 05:30 AM.

Prathyaksha Tirumanjanam Rs. 1116/- (Regular) Sri Swamy variki Every Yekasasi & Every Swathi Nakshathram
04:00 AM-05:30 AM

ప్రత్యక్ష తిరుమంజనం రూ.1116/- (రెగ్యులర్) శ్రీ అమ్మవారికి ప్రతి శుక్రవారం 
04:00 AM-05:30 AM

Prathyaksha Tirumanjanam Rs. 1116/- (Regular) Sri Amma variki Every Friday 04:00 AM-05:30 AM

Paroksha (Virtual) Seva Details

పరోక్ష అష్టోత్తరం రూ. 60/- (వర్చువల్ 
Daily from 08:00 AM-08:30 AM

Paroksha Ashtottharam Rs. 60/- (Virtual) 
Daily from 08:00 AM-08:30 AM

పరోక్ష కుంకుమార్చన రూ.50./- (వర్చువల్ 
Daily from 08:00 AM-08:30 AM 

paroksha Kunkumarchana Rs. 50/- (Virtual) 
Daily from 08:00 AM-08:30 AM

పరోక్ష శాంతి కళ్యాణం రూ 1116/- (వర్చువల్
Daily from 08:00 AM-08:30 AM

Paroksha Santhi Kalyanam Rs. 1116/- (Virtual) 
Dally from 08:00 AM 08:30 AM 

పరోక్ష సుదర్శన హోమము రూ.3500/- (వర్పువల్)
Daily from 07:00 AM-09:30 AM

Paroksha Sudarshana Homam Rs. 3500/-(Virtual)
Daily from 07:00 AM-09:30 AM

పరోక్ష నరసింహ హోమము రూ 3500/- వర్చువల్
Daily from 07:00 AM-09:30 AM 

Paroksha Narasimha Homam Rs. 3500/- (Virtual)
Daily from 07:00 AM-09:30 AM

పరోక్ష సహస్రనామార్చన రూ. 200/- (వర్చువల్
Daily from 07:30 AM-08:30 AM

Paroksha Sahasranamarchana Rs. 200/- (Virtual) 
Daily from 07:30 AM-08:30 AM

పరోక్ష తిరుమంజనం రూ. 1116/- (వర్చువల్), శ్రీ స్వామి వారికిప్రతి ఏకాదశి- Dt: 06.06.2021 05.07.2021 20.07.2021 04.08.2021 18.07.2021 18.08.2021 & స్వాతి నక్షత్రం 21.06.2021 18.07.2021 15.08.2021 
Every Friday from 04:00 AM-05:30 AM

Paroksha Tirumanjanam Rs. 1116/- (Virtual) Sri Swamy variki Every Yekadasi Dt: 06.06.2021 05.07.2021 20.07.2021 04.08.2021 18.07.2021 18.08.2021 & Every Swathi Nakshatram 21.06.2021 18.07.2021 15.08.2021
Every Friday from 04:00 AM-05:30 AM

పరోక్ష తిరుమంజనం రూ. వారికి ప్రతి శుక్రవారం 1116/- (వర్చువల్), శ్రీ అమ్మ
Every Friday from 04:00 AM-05:30 AM

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు
Undavalli Caves



Undavalli Caves, located 6 km south-west from Vijayawada, are the caves cut-out in the sandstone h ill in the 4th to 5th centuries A.D. Of all the caves, the largest one comprises of four stories and is e nshrined with a huge statue of Lord Vishnu. The statue of Lord Vishnu is sculpted in a reclining postu re from a single block of granite.

Besides, the other caves located at the site are dedicated to Lord Brahma, Vishnu and Shiva. One of the main caves depicts the Gupta architecture, as these caves initially were shaped as a Buddhist m onastery. These Buddhist monasteries were designed in the style of Buddhist vihara on the first floo

Dedicated to Anantapadmanabha Swamy and Narisimha Swamy, these caves are also associated wit h the Vishnukundina Kings of 420 to 620 A.D. These caves overlook the Krishna River and several sp ecimens of rock cut Hindu architecture from above the hill.
విజయవాడ నుండి 6 కి.మీ. దూరంలో నైరుతి వైపు ఉన్న ఉండవల్లి గుహలు, నాలుగు నుండి 5 వ శతాబ్దాల్లో క్రీ. పూణ సుక రాతి కొండలో కట్టబడిన గుహలు. వాటిలో నాలుగు గుహలలో అతి పెద్దది నాలుగు కథలు మరియు పెద్ద విగ్రహం. విష్ణు, విష్ణువు యొక్క విగ్రహం గ్రానైట్ యొక్క ఒక బ్లాక్ నుండి ఒక భగవంతుని భంగిమలో చెక్కబడినది. అంతేకాకుండా, ఈ ప్రదేశంలో ఉన్న ఇతర గుహలు బ్రహ్మ, విష్ణు మరియు శివుడికి అంకితమివ్వబడ్డాయి. ప్రధాన గుహలలో ఒకటి గుప్త శిల్ప శైలిని సూచిస్తుంది. ఈ గుహలు మొదట్లో ఒక బౌద్ధ ఆశ్రమంగా ఆకారంలోకి వచ్చాయి. ఈ బౌద్ధ ఆరామాలు మొదటి అంతస్థులో బౌద్ధ విహారా శైలిలో రూపొందించబడ్డాయి. అనంతపద్మనాభ స్వామి మరియు నరసింహ స్వామిలకు అంకితం చేయబడిన ఈ గుహలు విష్ణుకుండినా రాజులతో 420 నుండి 620 ఎ.డి. కు చెందినవి. ఈ గుహలు కృష్ణా నదిని మరియు కొండ పైన ఉన్న హిందూ శిల్పకళను కొలిచే అనేక న మూనాలను అధిగమించాయి.

Bhavani Island


Bhavani Island is located at a distance of 4 km from Vijayawada. This is a river island measuring abo ut 130 acres formed by the Ri Krishna. This place seems to have good boarding and lodging optio ns being run by the Andhra Tourism department.

భవాని ద్వీపం విజయవాడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కృష్ణా నది చేత 130 ఎకరాల కొలిచే ఒక నదీ ద్వీపం.. ఈ ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. మంచి వసతి గృహాలు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

Transport|రవాణా

By Road:

ఈ ఆలయం విజయవాడ బస్ స్టేషన్ కు ఆలయం 13 కి. మీ దూరంలోనే ఉంది.
Temple is 11 km from Vijayawada Bus station. Temple is 22 km from Guntur Bus Station Temple 24 Km from Tenali Bus Station

By Train:
ఆలయానికి దగ్గరలోనే 15 కి.మీ. దూరంలో విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది.
The nearest Railways Station is at Mangalagiri Railways Station of 1.5 km distance from Temple. The nearest Railways Station is at Vijayawada Railways Station of 12 km distance from Temple. The nearest Railways Station is at Guntur Railways Station of 23 km distance from Temple. The nearest Railways Station is at Tenali Railways Station of 25 km distance from Temple. The nearest Railways Station is at Pedavadlapudi Railways Station of 6 km distance from Temple

By Air:
ఆలయానికి 35 కి.మీ. దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉంది.
The nearest Airport is Vijayawada (Gannavaram) Airport of 33 km distance from Temple.

Contact Numbers and information

Sri Panakala Lakshmi Narasimha Swamy Temple,

Mangalagiri,

Guntur District,

Andhra Pradesh,

Pincode: 522 503.

Popular post to download:

TTD eBooks Free Download Bhagavad Gitamahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

More Books:

keywords:Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri Information,Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri Devasthanam,Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri history,Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri contact numbers,popular places to visit in Mangalagiri,Mangalagiri transport,Sri Panna Kala Lakshmi Narasimha Swamy Devasthanam Mangalagiri,temple history Mangalagiri temple timings,Mangalagiri temple adopted places and temples,Telugu popular books download,Sree dakshina Murthy stotram PDF download,sri Gayatri anushthan tatva prakashika pdf download,sri Mukunda mala PDF download, Lalitha sahasranama stotra Vol-1PDF download, sripathi Stuti mala PDF download, mahabharatam PDF download, Bhagavad Gita Telugu pdf download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS