భక్త్యంజలి
ఈ కృతిని ఆశీర్వదించుచు, నారాయణ స్మరణపూర్వకముగ శ్రీముఖము ననుగ్రహించిన శ్రీమత్పరమహంస పరివ్రాజకేత్యాడి బిరుదాంచితులు, జగద్గురువులు, శ్రీ శ్రీ పుష్పగిరి మహాసంస్థాన శంకర పీఠాధీశ్వరులు అగు శ్రీ శ్రీ శ్రీ శ్రీమదభినవోద్దండ విద్యానృసింహ భారతీస్వామి శ్రీచరణులకు: సభక్తి ప్రణామములు : సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీభాషలయందు నిష్ణాతులు.
ప్రస్థానత్రయ భాష్యకాంతిపరులు, బహుళావేదాంత, దార్శనిక గ్రంథావ లోకనముచే పురీకులు. పరమనైష్ఠికులు, |బోధయందుగల ప్రతిభచే నాయట్టి అజ్ఞుల హృదయములయందు పారమార్థికాసక్తిని రేకెత్తించి, విమర్శనాదృష్టి సంవఱచి, గ్రహణశక్తికి దోహదముజేసి, ఊసరక్షేత్ర
ముల పదునుంచి, శాస్త్ర మూలసూత్రవీజముల నందు నాటి, అవి మొలకలెత్తి, దిగుడటాకులు వేసి, మొక్కలగువరకు శ్రమించిన వనమాలి, నా సద్గురువులు, పూజ్యపాదులు శ్రీ శ్రీ మున్నంగి పున్నయ్య పంతులు వారికి హృదయపూర్వక నమోవాకములు.
రామలింగేశ్వర పేట నగురోరధికం శివశాసనతః
తెనాలి శిష్యుడు
16-4-77 విజయగోపాలరావు