శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ|Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda

Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda

శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ

కోటప్పకొండ, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

దేవాలయ చరిత్ర

ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు

దర్శన సమయాలు

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది

వసతి సౌకర్యాలు

కొండపై తిరుమల దేవస్థానంవారి సత్రం, గవర్నమెంటువారి అతిథి గృహాలు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరము సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయి.

స్థలపురాణం

పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు.లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది.ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరంఅనబడుచుంది.విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైఋతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది.ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె మునిమంద, ఎల్లమంద అనిపేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చినవని చెపుతారు.

ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు, భార్య కుందిరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి (గొల్లభామ) అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్ర కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి, ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజూ రుద్ర కొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమ దేవర లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశకలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు.ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి, పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి, ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్ర కొండ నుండి, ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తరువాత, ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం, ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి, జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి, తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది.

Shri tri koteswara Swamy Devasthanam kotappakonda

Kotappakonda, the Temple abode of 'Trikoteswara Swamy', is a village, 13 kilometers South West of Narsaraopet in Guntur district. Its original name is Kondakavuru, but is more popularly known as Kotappakonda or Trikutaparvatam, a three-peaked hill nearby. The Temple is dedicated to Lord Siva that was created on a hill with one thousand steps.

Though surrounded by other hills, the three hills, also known by the names of Trikutachalam or Trikutadri, can be distinctly seen from a distance from any direction. And the three peaks are described as Lord Brahma, the god of creation, Lord Vishnu, the preserver god and Lord Rudra, the god of storms.

The epigraphs at Kotappakonda clearly state that the deity established in the shape of Siva Linga on the hill top is known as Trikuteswara' or Trikoteswara'. A steep flight of steps leads to the hill and the deity is located at a height of 1,587 feet. There are a number of ponds on the hill of which eight are located in front of the temple.

Mahasivaratri, which falls during February-March, is the important festival celebrated here with great devotion and fervor every year and a large number of devotees throng the place

Festivals and Celebrations

Kotappakonda Tirunallu is celebrated during Mahasivaratri with great devotion. Apart from daily Pujas, Abhishekam, Ashtotharam and Archana are performed in the temple.

Temple Timings:

The Temple is open for pilgrims from

06:00 AM to 01:30 PM and

03:00 PM to 08:00 PM.

Timings & Darshan Details:

Opening hours: 6:00 am

Morning Abhisheka: 6:00 am – 12:15 pm

Sarva Darshan: 6:00 am – 1:00 pm

Pancha Harathi: 1:15 pm – 1:30 pm

Closing hours: 1:30 pm

Temple will be closed: 1:30 pm – 3:00 pm

Temple reopens: 3:00 pm

Astottaram: 3:00 pm – 8:00 pm

Sarva Darshan: 3:00 pm – 8:00 pm

Temple closing hours: 8:00 pm

Regular Sevas & Darsan Timings

శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం తెరచివుండు సమయం ఉదయం (రెగ్యులర్ సేవలు )

06:00 AM-01:30 PM

SRI TRIKOTESWARA SWAMY VARI DEVASTHANAM OPENING TIME MORNING (REGULAR SEVAS) 

06:00 AM-01:30 PM

శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం తెరచివుండు సమయం సాయంత్రం ( రెగ్యులర్ సేవలు) 

03:00 PM - 08:00 PM

SRI TRIKOTESWARA SWAMY VARI DEVASTHANAMOPENING TIME EVENING (REGULAR SEVAS)

03:00 PM - 08:00 PM

అర్చన దిగువ సన్నిధి ( రెగ్యులర్ ) రూ.20/ 

06:00 AM - 08:00 PM

ARCHANA DOWN HILL (REGULAR) RS.20/ 

06:00 AM - 08:00 PM

అష్టోత్తరం రెగ్యులర్) రూ.100/ 

03:00 PM - 07:45 PM

ASTOTTARAM (REGULAR) RS.100/

03:00 PM - 07:45 PM

పంచహారతి ( రెగ్యులర్ ) రూ.100/

01:00 PM - 01:15 PM

PANCHAHARATHI (REGULAR) RS. 100/

01:00 PM - 01:15 PM

అన్నప్రాసన ( రెగ్యులర్ ) రూ.150/

06:30 AM - 12:00 PM

ANNAPRASANA ( REGULAR) RS.150/ 

06:30 AM-12:00 PM

అక్షరాభ్యాసం రెగ్యులర్) రూ.150/ 

06:30 AM-12:00 PM

AKSHARABHYASAM (REGULAR) RS.150/ 

06:30 AM - 12:00 PM

నవగ్రహ పూజ / శనిత్రయోదశి పూజ (రెగ్యులర్ ) రూ.200/

06:30 AM - 12:00 PM

NAVA GRAHA PUJA / SANI THRAYODASI PUJA ( REGULAR) RS.200/ 

06:30 AM - 12:00 PM

శాంతి యాగశాల పూజ (రెగ్యులర్ ) రూ.1,116/ 

09:00 AM - 12:00 PM

SANTHI YAGASALA PUJA (REGULAR) RS.1,116/

09:00 AM - 12:00 PM

మహవ్యాసపూర్యక ఏకాదశ రుద్రాభిషేకం / రెగ్యులర్ రూ.1,116/

09:00 AM - 12:00 PM

MAHANYASAPURVAKA EKADASA RUDRABHISHEKAM (REGULAR) RS.1,116/

09:00 AM - 12:00 PM

పర్వదినములందు మూలవిరాట్ అభిషేకం ( రెగ్యులర్ . రూ|600/- 

04:30 AM - 01:30 PM

PARVADINAMULANDU MOOLAVIRAT ABHISHEKAM (REGULAR) RS.600/ 

04:30 AM - 01:30 PM

మండప అభిషేకం ( రెగ్యులర్ ) రూ.500/

06:00 AM - 12:00 PM

MANDAPA ABHISHEKAM (REGULAR) RS.500/

06:00 AM - 12:00 PM

కార్తీకమాస పరొక్ష అభిషేకం ( రెగ్యులర్) రూ.600/

05:00 AM - 07:00 AM

KARTHEEKAMASA PAROKSHA ABHISHEKAM (REGULAR) RS.600/ 

05:00 AM - 07:00 AM

మహాశివరాత్రి పరోక్ష అభిషేకం ( రెగ్యులర్ ) రూ.600/

03:00 AM- 05:00 AM

MAHASIVARATHRI PAROKSHA ABHISHEKAM (REGULAR) RS.600/ 

03:00 AM-05:00 AM

ప్రత్యేక దర్శనం ( రెగ్యులర్ ) రూ.100/

06:00 AM - 07:45 PM

PRATHYEKA DARSANAM ( REGULAR) RS. 100/

06:00 AM - 07:45 PM

PRATHYEKA DARSANAM ( REGULAR) RS.100/

06:00 AM - 07:45 PM

శీఘ్ర దర్శనం ( రెగ్యులర్ ) రూ.200/ 

06:00 AM - 07:45 PM

SEAGHRA DARSANAM ( REGULAR) RS.200/

06:00 AM - 07:45 PM

కేశఖండనము ( రెగ్యులర్ రూ.25/ 

06:00 AM - 07:30 PM

KESAKHANDANAM (REGULAR) RS.25/

06:00 AM - 07:30 PM

భారీవాహన పూజ ( రెగ్యులర్ ) రూ.200/ 

06:30 AM - 07:30 PM

HEAVY VEHICLE PUJA ( REGULAR) RS.200/

06:30 AM - 07:30 PM

త్రిచక్ర వాహన పూజ రెగ్యులర్ ) రూ.150/ 

06:30 AM - 07:30 PM

THRI CHAKRA VAHANA PUJA (REGULAR) RS.150/ 

06:30 AM - 07:30 PM

లఘు వాహన పూజ ( రెగ్యులర్ ) రూ.50/

06:30 AM-07:30 PM

LIGHT VEHICLE PUJA ( REGULAR) RS.50/

06:30 AM - 07:30 PM

రుద్ర హొమం ( రెగ్యులర్ ) రూ.2,116/

09:30 AM - 12:30 PM 

RUDRA HOMAM (REGULAR) RS.2,116/

09:30 AM - 12:30 PM

శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం( రెగ్యులర్ ) రూ.2,116/ 

09:30 AM-12:30 PM

SRI MEDHA DAKSHINA MURTHY HOMAM ( REGULAR) RS.2,116/

09:30 AM - 12:30 PM


Paroksha (Virtual) Seva Details

పరోక్ష సేవలు ( వర్చ్యువల్) 

Daily from 09:00 AM-12:00 PM

PAROKSHA SEVAS (VIRTUAL) 

Daily from 09:00 AM-12:00 PM

పరోక్ష నవగ్రహ పూజ / శని త్రయోదశి పూజ (వర్చ్యువల్) రూ. 200/-

Daily from 09:00 AM-12:00 PM 

PAROKSHA NAVAGRAHA PUJA / SANI THRAYODASI

PUJA (VIRTUAL) RS.200/ 

Daily from 09:00 AM-09:30 PM

పరోక్ష మండప అభిషేకం (వర్చ్యువల్) రూ.500/

Daily from 11:00 AM-12:00 PM

PAROKSHA MANDAPA ABHISHEKAM (VIRTUAL) RS.500/

Daily from 11:00 AM-12:00 PM

పరోక్ష రుద్ర హోమం (వర్చ్యువల్) రూ.2,116/ Every Monday from 09:00 AM-11:00 AM PAROKSHA RUDRA HOMAM ( VIRTUAL ) RS.2,116/ 

Every Monday from 09:00 AM-11:00 AM

పరోక్ష శ్రీ మేధాదక్షిణామూర్తి హొమం (వర్చ్యువల్) రూ.2,116/

Every Thursday from 09:00 AM-11:00 AM

PAROKSHA SRI MEDHA DAKSHINA MURTHY HOMAM ( VIRTUAL) RS.2,116/

Every Thursday from 09:00 AM-11:00 AM


Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Sri Chaturmukha Brahmalingeswara Swamy

Sri Chaturmukha Brahmalingeswara Swamy, Chebrolu, Guntur, are located at a distance of about 75 kms from Kotappakonda Temple.

The Chaturmukha Brahmalingeswara Swamy temple which was built by Raja Vasireddy Venkatadri N aidu, about 200 years ago, is one of the few temples, dedicated to Lord Brahma, although he is love d here with Lord Shiva.

A temple of Lord Nataraja and a thousand pillar Hall (Mandapam) are presumed to have existed at t he front of the stone sculpture of dilapidated Nandi which can be seen in the vicinity of the Nageswa ra Swamy temple. It was an idol of Lord Nataraja measuring 12 feet which has been the center of at traction here thousands of years ago, None of these, not even their remains, can be found today.

శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి వారి ఆలయం గుంటూరు జిల్లా, చేబ్రోలు లో ఉన్నది. కోటప్పకొండకు ఈ ఆలయం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని 200 సంవత్సరాల క్రితం రాజ వాసిరెడ్డి వెంకటాద్రి నాయిడు గారిచే నిర్మించి బడినది. బ్రహ్మదేవుని ఆలయాలలో ఇది ఒకటే.

నాగేశ్వర స్వామి ఆలయ సమీపంలో శిధిలమైన నంది రాతి శిల్పం ముందు నటరాజ స్వామి ఆలయం మరియు వెయ్యి స్తంబాల మండపం కలవు. 12 అడుగుల ఎత్తుకల నటరాజ స్వామి వారి యొక్క విగ్రహం, ఇక్కడ ఆకర్షణ కేంద్రంగా ఉంటుంది. వీటిలో ఏవి కూడా నేడు కనిపించవు

Guthikonda Caves, Kotappakonda


Guthikonda Caves are located neat place called Karampudi, which is located at a distance of about 28 kms from Narasaraopet in the Guntur Disnct. These caves are stated to be the chanting place for the great saint called as Muchukunda Maha Moni. History states that there are about 108 caves in th is place, but humans can visit just 5 to 6 caves easily. There are temples for many Gods and Goddes ses in these caves. In addition, there are many Siva Lingam's in these caves.

గుత్తికొండ గుహలు గుంటూరు జిల్లా నరసరావుపేటకు 36 కి.మీల దూరంలో ఉన్న కారంపూణి ఆన్ ప్రదేశంలో ఉన్నాయి. ఈ గువాల్లోనే ముచుకుంది. మహా ముని ఆయన్ను అదరించాలని చెపుతారు. 108 గుహలు ఉన్నాయని చరిత్ర చెపుతుంది. కానీ వాటిలో మనిషి 5 లేక 6 మాలను చూడగలడు. గ్రువా అనేక తల దేవాలయాలు మరియు అనేక లింగాలు కూడా ఉన్నాయి.

Transport|రవాణా

By Road:


శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయము, నర్సరావుపేట బస్టాండ్ నుండి 11 కి.మీల దూరంలో మరియు చిలకలూరిపేట నుండి 16 కి.మీల దూరంలో కలదు.
Sri Trikoteswara Swamy Temple is 11 Km distance from Narasaraopet Bus station and 16 Km from Chilakaluripet.


By Train:

శ్రీ త్రికోటిశ్వర స్వామి ఆలయానికి సమీపంలో 11 కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట రైల్వే స్టేషన్ అన్నది.
The nearest Railway Station is at Narasaraopet which is 11 km away from Sri Trikoteswara Swamy Temple.


By Air:

శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం నుండి 106 కిలోమీటర్ల దూరంలో విజయవాడ కన్వీనరం దీమాన్యాయం ఉన్నది.
The nearest Airport is at Vijayawada-Gannavaram Airport which is 108 km away...

Contact Numbers and information

Sri Trikoteswara Swamy Vari Devasthanam,

Narasaraopet Mandal,

Kotappakonda,

Guntur District.

Andhra Pradesh - 522 601.

Kotappakonda Rd, 

Narasaraopeta, 

Popular post to download:

pothana bhagavatam free downloadmahabharatam books free downloadTelugu Book Downloadtelugu books downloadtelugu books downloadtelugu books download

ALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gita

More Books:

keywords:Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda Information,Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda Devasthanam,Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda history,Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda contact numbers,popular places to visit in kotappakonda,kotappakonda transport,Shri Trikoteswara Swamy Devasthanam kotappakonda Devasthanam,temple history kotappakonda temple timings,kotappakonda temple adopted places and temples,Telugu popular books download, ,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS