కృష్ణ శతకం|Krishna shatakamu Telugu Book Download
కృష్ణ శతకం
కవి పరిచయం
కృష్ణ శతక కర్త నృసింహ కవి. అతను దాదాపు క్రీ.శ 1760 ప్రాంతమువాడు. అతని గురించి సమాచారం లభ్యం కాకపోయినా అతను రాసిన శతకములో వాడిన పదాల ఆధారంగా అతను చిత్తూరు మండలమునకు చెందినవాడని లేదా రాయలసీమ ప్రాంతము వాడనీ ఊహించవచ్చును. ఈ శతకం చివరలో ఈ కవి తనను గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు.
భారద్వాజసగోత్రుడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహాహ్వయుడన్
శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణా
అతను రాసిన "తిరిమణి మనుజుడు పరమ పవిత్రుండు" అను పద్యమును బట్టి అతను వైష్ణవ మతానికి చెందిన వాడు కావచ్చు.
క. శ్రీరుక్మిణీశ! కేశవ!
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా!
రుక్మిణీదేవికి భర్తవు! పరమేశ్వరుడవు! నారద అమర సంగీతనందు ప్రియము చూపువాడవు! గోవర్ధన పర్వతమును నీ చిటికెన వ్రేలితో నెత్తి గో-గోపాలురను సంరక్షించినవాడవు! ప్రజలను సర్వదా కాపాడే ద్వారకావాసీ! ఓ శ్రీకృష్ణా! మమ్ము దయతో కాపాడుము స్వామీ.
క. నీవే తల్లి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!
ఓ కృష్ణా నీవే నాకు తల్లివి, తండ్రివి, సహాయకుడివి.. సఖుడవు. నా గురువు కూడా నీవే. నా దైవము. ప్రభువు. పతి గతి గూడా నీవే అయివున్నావు. ఇలా సమస్తమునీవే అయివున్నావు.
క. నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానననైరీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా!
శ్రీమన్నారాయణ! పరమేశ్వరా! ఓ నీలమేఘశ్యామా! రాక్షసవైరీ! పాలసమద్రమున శయనించువాడా! యదుకులవీరా! నన్ను దయతో రక్షించవయా.
Keywords: Krishna shatakamu, Krishna shatakamu telugu book,Krishna shatakamu pdf Download,Krishna shatakamuin pdf books,TTD ebooks download,Shri Durga sahasranama stotram PDF download,Sri Chandi Mantra Sadhana pdf download, shrimati Sushma wala PDF download,PDF download,Sri Lalitha Sahasranamam PDF download, TTD ebooks free download, Telugu popular books download, Telugu books download,