కాళహస్తీశ్వర శతకము|Kaalahasteeshwara shatakamu Telugu Book Download
శ్రీ కాళహస్తీశ్వర శతకము
శ్రీకాళహస్తీశ్వర శతకమును వ్రాసిన భూర్జటి 16వ శతాబ్దమునాటి వాడు. శ్రీకృష్ణదేవ రాయల వారి భువన విజయములో (ఆస్థానములో) అష్ట దిగ్గజములలో ఒకనిగా వాసి కెక్కిన వాడు చాల కాలము శ్రీకాళహస్తిలో నుండి తరువాత రాయల ఆస్థానమునకు వెళ్ళినను 'రాజులు మత్తులో అవి రాజులగురించి తిట్టగల ధీశాలి. నిర్భయుడు. ప్రాపంచిక సుఖములను రోసి భక్తితో భగవంతునిమీద శతకము చెప్పినవాడే
1.శ్రీశ్రీ విద్యత్కలితాజవంజవ మహ జీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోజ్జ సుముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! మీ కరుణా శరత్సమయ మింతే చాలు, చిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తి అనగా సాలెపురుగు, పాము, ఏనుగులకు అక్కడ వెలసిన ఈశ్వరుడు మోక్షము నిచ్చు టచే ఆ దేవునికి శ్రీకాళహస్తీశ్వరుడని పేరు వచ్చినది. ఇటువంటి తిర్యక్కులపైకూడ నీకరుణ వర్ణించిన ఒదేవా! సంసార బంధనములనే మబ్బులతో కమ్మిన నామనసును నీ దయతో రక్షింపుము. నాలో భక్తి భాష మనే వెన్నెలను కురిపించి నా హృదయ పద్మమును వికసింప జేయుము. నీ దయను శరత్కాల సమయమున కూడా కొంచెమైనా ప్రసరింపచేయుము ఎందుకంటే శరత్కాలమున స్వచ్ఛమైన సూర్య కిరణాల చేత తామరలు విళపిస్తాయి.
2.వాణీవల్లభ దుర్లభంబగు భవద్వారంబు నన్నిల్చి, ని
ర్వాణశ్రీ చెరపట్ట చూచిన విచార ద్రోహమో, నిశ్యక
రాణ క్రీడలబాస్ దుర్ఘశలపాలై, రాజులోకాధమ
శ్రేణి ద్వారముదూర వేసి దిపుడో శ్రీకాళహస్తీశ్వరా.
ఓ ఈశ్వరా! నీ సన్నిధి యందు నిలిచి మోక్షము పొందుటకు మనుసునిలకడ లేనిచో బ్రహ్మకెనా సాధ్యము కాదు. అటువంటి నీ సన్నిధి యందు నిలిచియు మోక్షలక్ష్మిని పొందలేక సంసారలంపటాలలో తగులు కొని రాజుల నాశ్రయించుటకు పరుగులు పెడుతున్నాను. ఇటువంటి నన్ను పైరితిగా అను గ్రహింపజేయుము పరమేశ్వరా! పాహి పాహి