శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవల్లి|Sri suryanarayana Swamy Vari Devasthanam arasavalli Temple Information

Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli Temple Information

 శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అరసవల్లి|Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli Temple Information

తెలుగులో ఆలయ వివరణము

స్థల పురాణం

ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఈఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం.

చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ సా.శ. 545 లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతని వారసుడు ఒకటో దేవేంద్రవర్మ సా.శ. 648 లో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణుశర్మ , భానుశర్మలనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం సా.శ. 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. సా.శ. 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. సా.శ. 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని, అందులో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.
వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు. సా.శ. 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్ గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. అతని వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట. సా.శ. 1778 లో ఎలమంచిలి పుల్లాజీ అనే అతను ఆ బావిలో మూలవిరాట్ ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసాడు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం ఆలుదు గ్రామస్ధులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని (గోపురం) పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో నిర్మించారు.

సూర్య దేవుని ఆరాధన:

ఈ ఆలయం వేర్వేరు రంగాల ప్రజలను ఆకర్షించే ప్రత్యేకమైనది. ఈ ఆలయం దేవుడు ఒక్కడే అనే భావాన్ని కలిగిస్తుంది. మరియు శివ కేశవుల మధ్య వ్యత్యాసం లేదని చెబుతుంది. ఈ ఆలయంలో ఐదు విగ్రహాలు (పంచాయతనం) ఉంది. అవి:

1.ఆదిత్య

2. అంబిక

3.విఘ

4.వినాయకుడు.

5.మహేశ్వర

భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి, త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) స్వరూపమైన శ్రీ సూర్య నారాయణ స్వామిని ఆరాధిస్తారు. విశ్వంలో ప్రతిరోజు కనిపించే ప్రత్యేక్షమైన దైవమే కాకుండా, అన్ని ప్రాణుల యొక్క జీవనాధారం. సూర్యనమస్కారాలు మరియు అరుణ మంత్రాలు, రిగ్వేద యజుర్వేదానికి సంబంధించిన ఎంతో శక్తివంతమైన ప్రార్ధనలు. వీటిని చదవడం వలన ఆరోగ్యము ప్రాప్తిశ్చింది. మంత్రం లేదా శ్లోకం అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రం. దాన్ని ఎల్లప్పుడూ పాటించడం ద్వారా ఇది మనల్ని రక్షిస్తుంది. ఆదివారం సూర్య దేవుడి ఆరాధనకు అత్యంత శుభమైన రోజుగా భావిస్తారు.

English Information About Temple:

Once Lord Devendra, Ignoring the words of Dwarapalaka Nandi, attempted to force his entry for Darshan of Sri Rudrakoteswara Swamy varu at an untimely hour when Lord siva was along with his consort. The Dwarapalaka Nandi in the discharge of his duties kicked the intruder.

Thus kicked and injured by the Devine attendent Indra fell unconscious in a painful state. Then, it is said, he offered his prayer to the Sun God for relief of his body pains and exhaustion. Sun God took pity on him and touched Lord Indra with his innumerable rays and Indra got back his strength and relief from pain. He was all grateful to the Sun God who gave him back his strength and relief from pain. He begged sun god to allow him to stay there forever and spend his time. He had built a temple and install an Idol of the Sun God.

Archeological experts say that the stone inscriptions available in the temple throw some light to the effect that Devendra Varma, the Ruler of the Kalinga Kingdom, must have built this temple and installed the image of the Sun God in it in the latter half of the 7th Century. The translation of the stone inscriptions reveals the donation of some lands made to the Sun God for perpetual lamps to be installed in the temple, to run a school or a Hostel for the pupils learning Sastras and Veda's.

These donations are stated to have been made by the successors of the Calinga King Devendra Varma prior to 11th Century A.D. The temple is buildt in such a way as to make the Sun Rays focus on the feet of the God twice in the year in the months of March and September in the early hours of the day. The rays so focused on the feet of the Idol through the five entrance gates of the temple, remain for a few minutes.

Worship of Sun God:

This temple has the unique feature of attracting crowds of the people of different sectors, cultures and creeds together and making them believe the God is one and there is no difference between Siva and Kesava. The Five idols (Panchayatana installed in a particular place in the temple) namely:

1. Aditya

2. Ambika

3. Vishnu

4. Ganesha

5. Maheswara, represent all the faiths.

Finally, the devotees visiting this temple, go and worship the presiding deity Sun God about whom the puranas speak as the embodiment of Trimurthies, Brahama, Vishnu and Maheswara. The Lord who sees physically everything in the course of his daily round over the universe and who fully understands the truth behind all things, is not only regarded as Pratyaksha Daivam (Visible God) but also the source and sustainer of all life. The people who perform Suryanamaskara recite Maha Soura and Aruna Manthras containing Powerful beejaksharas of Rigveda and Yazurvada for giving good health, so that it is said that "Arogyam Bhaskaradhischet". The mantra or Hymn is a spiritual formula harmonizing sound which always protects the register in every way. This is the secrecy of the Sun God Worship, Sunday is considered as most auspicious day to sun god worship.

Regular sevas & darsan timings

Paroksha Ksherannabhogam seva (పరోక్ష క్షీరాన్నభోగం సేవ ప్రతి ఆదివారం జరుగును) (Regular) 

12:00 PM - 01:00 PM


Paroksha Kalyana Seva (పరోక్ష కళ్యాణ సేవనెలలో వచ్చు రెండు సారులు (శుద్ధ, బహుళ ఏకాదశిలో మాత్రమే కళ్యాణం చేయడం జరుగును.(Regular)

 08:00AM 11:00 AM.


Paroksha Ksheerabhishgka Seva (పరోక్ష క్షీరాభిషేక సేవనెలలో వచ్చు సంక్రమణం రోజు మాత్రమే జరుగును)

(Regular) 04:00 AM-06:00 AM


Paroksha Suryanamaskaramulu Seva (పరోక్ష సూర్యనమస్కారాలు సేవ) ప్రతి రోజు (365 రోజులు జరుగును (Regular) 

08:00 AM - 11:00 AM


Paroksha Sahasranamarchana Seva (పరోక్ష సహస్రనామార్చన సేవ ప్రతి రోజు జరుగును) (Regular) వేకువ జమునా 

05:00 AM-06:00 AM 


Paroksha Astottarasathanamarchana Seva పరోక్ష అష్టోత్తరశతనామార్చన సేవ ప్రతి రోజు ఉదయం జరుగును) (Regular)

07:00 AM-11:30 AM


Temple Opening Time 

06:30 AM 02:00PM.


Afternoon Temple Opening Timings

 03:30 PM - 08:00 PM.


Paroksha (Virtual) Seva Details

Paroksha (Virtual) Seva Details PAROKSHA SAHASRANAMARCHANA SEVA (పరోక్ష సహస్రనామార్చన సేవ) = Rs. 30/-Per Head One Person Only(Virtual)

Daily from 05:00 AM-06:00 AM


Paroksha Suryanamaskaramlu Seva(85 సూర్యనమస్కారంలు సేవ)=Rs.50/-Per Head Per Day(Virtual) 

Daily from 08:00 AM-11:00 AM


Paroksha Kshirannbhogam Seva(పరోక్ష క్షిరన్నబోగం సేవ )=Rs.50/-Per Head One Person Only(Virtual)

Every undefined from 12:00 PM-01:00 PM 


Paroksha Astottarasathanamarchana Seva (పరోక్ష అస్తోతరసతనమర్చన సేవ Rs.20/-Per Head One Persons Only(Virtual)

Daily from 07:00 AM-11:30 AM


Paroksha Kshirabhishekam Seva(పరోక్ష సేవ క్షీరాభిషేకం)=Rs.500/-(Virtua Every undefined from 04:00 AM-06:00 AM Paroksha Kalyana Seva (పరోక్ష కళ్యాణ సేవ)=Rs.500/-Two Persons Allowed (Virtual)

Every undefined from 08:00 AM-11:00 AM


సందర్శించవలసిన ప్రదేశాలు|Places To Visit

Sri Kurmam Temple, Srikurmam, Gara Mandal, Srikakulam Dist 

శ్రీ కూర్మం అత్యంత పవిత్రమైన మరియు పురాతనమైన పుణ్య క్షేత్రం. ఈ ఆలయం ప్రపంచంలో, కూర్మావతారంలో విష్ణువుని పూజించే ఏకైక ఆలయం. ఈ ఆలయం నిర్మాణం 700 ఏళ్లకు పైగా ఉన్నందువలన, అనేక సార్లు పునర్నిర్మించబడ్డది.

The most sacred and ancient shrine of Sri Kurmam is the only Swayambhu te mple in the world where lord Vishnu is worshipped in the form of Kurma avat ara, while the shrine is said to be more than a few million years old, outer str uctures were reconstructed many times as it is more than 700 years old.


Sri Mukhalingam

ప్రముఖ శివ దేవాలయాలలో ఒకటైన శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ ముఖలింగం లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ హిందూ తీర్థయాత్ర కేంద్రాల లో ఒకటి, శ్రీ ముఖలింగం కూడా కళింగ రాజులకు రాజధానిగా ఉండేది. ఈ ఆ లయాన్ని 8వ శతాబ్దంలో కామాళవ 11 చే నిర్మించబడింది. ఇది వంశధార న ది ఒడ్డున ఉన్న అందమైన ప్రదేశం..

The Srimukhalingeswara Temple, one of the popular Shiva temples, located at Sri Mukhalingam. Sri Mukhalingam is one of the famous Hindu pilgrimage enters in Andhra Pradesh, Sri Mukhalingam was also capital of Eastern Ganga kings of Kalinga (ancient Orissa). The temple bf Srimukhalingsm was built by Kamatnava 11 8th century AD of the Eastern Ganga dynasty. It is beautiful place located on the banks of River Vamsadhara.

Transport

By Road

Distance By Road

Distance From Visakhapatnam to Srikakulam Transport  100.00 kms

Distance From Vijayawada to Srikakulam     452.4 kms.

Distance From Hyderabad to Srikakulam   724.8 kms

Distance from Chennai to Srikakulam       910 3 kms

Distance from Bangalore to Srikakutani   1112.7km


Srikakulam By Bus  

You can travel by to tri alust both gelte and public operators provide regular busas Srikakulam from all major and miline des the state et to Skakutam nun from vijayawaits, and Vishakhapatham, Buses from Hyderabad orta avalistle


By Train:

Anasavall Terie located in Stikalolam, Andling Pradesh India you can reach Sukahulem by joses trains or planes, firkakolam is well corected to other parts of the sta of Andhra Pradesh and also to the major citie


Srikakulam by Train

Srikakulam has a major railway station known as Amadalavalasa. It is 13 kilometres from srikakulam. City buses, taxies, autos are available from the Railway station to Srikakulam RTC Complex and Old Bus Stand for every 10 minutes.

Note: As per IRCTC instead of Amadalavalasa, You will find SRIKAKULAM ROAD (CHE)

Trains from Major Cities


Trains from Hyderabad

Konark Exp, East Coast Exp, Falaknuma Exp, Visakha Exp


Trains from Bangalore

Prasanthl Exp, YPR Howrah Exp, Guwahan Exp


Trains from Chennal

Guwahati Exp. Shalimar Exp. Bhubaneswar E Howrah Mail.



Trains from Howrah

GHY SC Express, Falaknuma Exp, East Coast Exp, HWH YPR Exp, HWH Mas Mail


By Air:

Srikakulam By Air:

The nearest Airport to Srikakulam is Visakhapatnam with a Distance 106 kilometers. RTC Buses are available frequently from Visakhapatnam to Srikakulam.

The nearest Airport is at Visakhapatnam Airport which is 106 km away from Sri Suryanarayana Temple

Contact Numbers and information

Sri Suryanarayana Swamy Vari Devasthanam,

Arasavalli,

Srikakulam District,

Andhra Pradesh,

Pin Code: 532 401.

Temple Clerk No.: +91 3578914660

Office Land Line No. 385-2-222421


Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords:Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli Information,Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli ,Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli history,Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli contact numbers,popular places to visit in arasavalli,arasavalli transport,Sri suryanarayana Swamy Vari  Devasthanam arasavalli mandalam, temple history arasavalli temple timings,arasavalli temple adopted places and temples,Saptagiri PDF download,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS