ముందుమాట
భగవంతుడు భక్త పరాధీనుడు.
"తమ హృద్భాషల సఖ్యమువ్ శ్రవణమువ్ దాపత్వమువ్ వందనా ర్చవముల్ సేవయు వాత్మలో వెఱుకయున్ పంకీర్తవల్ చింతపం బమ నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరివ్ మి ప జ్జమఁడై యుండుట భద్రమంచు దలంతువ్ సత్యంబు దైత్యోత్తమా” [భాగ 7-167]
అని భాగవతంలో పోతనచే చెప్పబడిన నవవిధ భక్తి మార్గాలు సర్వదుఃఖ నివృత్తికీ, పరమ శ్రేయః ప్రాప్తికి సాధనాలు.
భగవద్గుణరూప సంకీర్తన వాచిక వ్యాపారం, జపం మానసిక వ్యాపారం.
ఒకటి మరొకదానికి సహకారం అందిస్తూ విశ్రేయప సిద్ధికి తోడ్పడుతాయి.
సంస్కృత సాహిత్యంలో స్తోత్ర సాహిత్యం విశిష్టమైంది. స్తోత్రాలకు మూలం వేదాలే. "అగ్నిమీలే...." అనే ప్రథమ ఋగ్వేద ఋక్కు అగ్ని స్తుతి. యజుర్వేదంలో రుద్ర స్తోత్రం, ఆధర్వవేదంలో శ్రీ సూక్తం మొదలైనవి ఉన్నాయి. ఉపనిషత్తులలో కూడ అనేక స్తోత్రాలు కనిపిస్తాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామస్తోత్రం, దుర్గాస్తోత్రం; రామాయణంలో రామస్తోత్రం, ఆదిత్యహృదయం మొదలైనవి ఉన్నాయి. పారాయణానికి తగ్గట్టుగా వివిధ స్తోత్రాలను బృహత్ స్తోత్రరత్నాకరం, స్తోత్రరత్నావళి మొదలైన వాటిల్లో మన పూర్వులు సంకలనం చేసి ఇచ్చారు.