దక్షిణామూర్తి స్తవం|Dakshinamoorthi Sthavamu Telugu Book Download
ముందుమాట
హిందూమతం ఈనాటిది కాదు. ఏనాటిదో ఇదమిద్దంగా ఎవరికీ తెలియదు. మానవుల ఆత్మజ్ఞానానికి ఆలవాలమైన ఈ వృక్షం కేవలం కట్టెల కోసం నరకబడి నేడు గాలివచ్చినా
పడిపోయే దశకి వచ్చింది. ఈ జ్ఞానం అగ్రకులాల సొత్తనే భ్రమతో తలా ఒక కొమ్మ
నరికి వేశారు. ఈ జ్ఞానానికి మతం రంగు ఏ స్వార్ధ పరుడు వేశాడో కాని ఇది కళా విహీనమయిపోయింది.
ఎన్నో మతాలు ఈ వృక్షం పాదుల్లో నీరు బదులు నూనె పోశాయి. పోస్తున్నాయి. అయినా ఇది నిర్మూలం కాలేదు. కాదు కూడా. కారణం ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఏ కులస్థుడి "సొత్తూ కాదు, ఏ మతస్తుడి సొత్తూ కాదు, అందరూ ఒకేలా పుడ్తారు. ఒకేలా చేస్తారు. కానీ ఒకేలా జీవించరు. ఒకే తల్లి దండ్రికి పుట్టిన ఇద్దరు ఒకేలా పెరగరు. పెరిగినా ఒకేలా చదవరు. చదివినా ఒకే స్థితిలో ఉండరు. ఉన్నా ఒకేలా సుఖించరు. సుఖించినా ఒకేలా కీర్తి (అపకీర్తి కూడా) పొందరు, అఖరికి ఒకేలా చావరు (మరణ యాతన)