శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, నెల్లూరు:
12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం,ఇది నెల్లూరులో రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది.రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, గాలిగోపురం 95 అడుగుల పొడవున్న ఈ గాలిగోపురంపై ఉన్న 7 కలశములు 10 అడుగుల పొడవుతో బంగారు తొడుగును కలిగి ఉంటాయి.
స్థలపురాణం
మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోనుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.
ఆలయ విశేషాలు
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, గాలిగోపురం ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి.ఇచ్చట శ్రీరంగనాథ్ స్వామి ఆలయం దర్శించగలం. విశాలమైన ఆలయ ప్రాంగణముకు తూర్ప దిశలో ఏడు అంతస్ధుల రాజగోపురం ఉంది. ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయం నకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవాహించు చున్నది. దీనిని పినాకినీ నది అని కూడా పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచారించి దైవ దర్శనముకు భయులు దేరుతారు.ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషుతల్పం పై శయనముద్రలో శీ రంగనాథడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి - భూదేవిని దర్శించవచ్చును. గర్భాలయం చుటూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.
12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.
సా.శ. 7,8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది. 12 వ శతాబ్దం లోని రాజరాజనరేంద్రుడు, ఉభయ కుళోత్తుంగ ఛోళుడు గోదావరి, కావేరీ నదుల మధ్యభాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ, ప్రాకారాదులను నిర్మింపచేశారు
*క్రీ.శ 1879 వ సంవత్సరంలో శ్రీ యెరగడిపాటి వెంకటాచలం పంతులుగారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు.
*సుమారు 100 సంత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారం తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాలమండపాన్ని బహూకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు.
*గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
*ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
దర్సన సమయం
ఆలయం దర్శనం ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు దొరుకుతుంది.
రవాణా సౌకర్యం
రైలు విజయవాడ - గూడూరు రైలు మార్గములో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. రైల్వే స్టేషన్ కు పశ్చిమ & తూర్పు ప్రవేశ ద్వారములున్నాయి. పశ్చిమ ప్రవేశ ద్వారం (PF No.1) నకు సుమారు ఒక కీ.మీ దూరంలో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఆటోలు దొరుకుతాయి. బస్సు రాష్ట్రం లోని అన్ని ప్రాంతములు నుంచి నెల్లూరుకు బస్సులు ఉన్నాయి. నెల్లూరులో రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి. RTC మెయిన్ బస్ స్టాండు & ఆత్మకూరు బస్ స్టాండ్. ఆలయం నకు ఆత్మకూరు బస్ స్టాండ్ కొంత దగ్గరవుతుంది.
వసతిసౌకర్యములు
గాంధీ బొమ్మ సెంటర్ లో యాత్రికులుకు వసతులు దొరుకుతాయి
అడ్రస్సు
తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, రంగనాయకులపేట, నెల్లూరు – 524001, ఫోన్: 0861 2331156
HISTORY OF TEMPLE
Sri Talapagiri Ranaganatha swamy:
Temple is located in Nellore city and is about 5kms away from Nellore Bus stand. RanganadaSwamy Temple in Nellore is more than 600years old. This temple is situated on the banks of the river Pennar and is marked by a huge 29 Mts tall Galigopuram with seven gold kalasams and its architectural splendour. On the east there is seven storied Maha gopuram, south Sri Ranganayaki Lakshmi Devi) temple and beautiful mirror dias, west is sacred Pennar river and north Sri Andal Ammavari temple.
The main Deity, Garbhodakasayi Vishnu reclining on his couch of Ananta Sesa, is ten feet long. Laksmi is sitting on a lotus flower on his chest. Lord Brahma sitting on a lotus rising from the Lord's navel. At the Lord's feet are 26" high deities of Sridevi and Bhudevi. In front of the main Deity are the Utsavamurtis (festival Deities) of Ranganatha Swami. There is also a four-handed seated Deity of Laksmidevi called Ranga-nayaki-devi.
The annual Rath Yathra of the God is a much awaited ritual in Nellore. There are seven kalisams, which brings beauty to the temple. Every year during the month of March-April (varies according to vedic calendar) Brahmotsavam (grand festival) is celebrated.
On the bank of river penna sri kashyapa Maharshi performed yagna and as a fruit of his penance conferred upon him the gift of establishing himself as Ranganadha Swamy here. In 7th cebtury, by Pallava ruler Sri Rajaraja Narendra, subsequently in 13th century Sri Jatha Varma has offered precious stones and metal to Lord Ranganadha Swamy. The Andhra Maha Bharatam i.e. from Viratprvam to the end of the epicwas written by the poet Sri kavi Brahma Tikkana, on the bank of pennar river.
Transport|రవాణా
By Road:
Contact Numbers and information
Sri Talpagiri Ranganathaswamy Swami Vari Devasthanam,
Ranganayakula Peta,
Nellore,
Andhra Pradesh.
PinCode: 524 002.
ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి