ముందుమాట
అనంతశక్తి స్వరూపిణి కంచి కామాక్షీదేవి. ఆ మాతృమూర్తి దయకు పాత్రుడైన కవీంద్రుడు మూకకవి. పుట్టుకతోనే ఈయన మూగ కామాక్షీదేవి కటాక్ష విశేషంచేతను, కంచి కామకోటిపీరా నికి 19వ ఆచార్యులైన శ్రీ మార్తాండ విద్యాఘనేంద్రస్వాముల వారి ఆశీర్వాద బలం వల్లను తన మూగతనాన్ని పోగొట్టుకొని సార్ధక నామధేయుడైన ధన్యజీవి ఈ కవి. కామాక్షీ దేవిని గూర్చి 'మూక పంచశతి' అనే 500 శ్లోకాల స్తుతిరత్నాల్ని వెలయించిన ఈ మహనీ యుడు క్రీ.శ. 399-489 సం.ల మధ్యకాలంలో కంచి పీఠాన్ని 20వ ఆచార్యులుగ అధిష్టించారని ప్రచారంలో వుంది. మణిప్రభ గ్రంథకర్త రామిలుడు, హయగ్రీవవధ రచయిత మేంఠుడు - అనే సుప్రసిద్ధ సంస్కృ తకవులు మూకకవీంద్రుని శిష్యులు.
'మూక పంచశతి' అనే ఈ స్తుతి గ్రంథంలో దేవి యౌవనా పం, లావణ్యం, శృంగారం మున్నగు విషయాలు భక్తిపారవశ్యంతో వర్ణింపబడ్డాయి. చిద్రూపగాను, మోక్ష ప్రదాయినిగాను, ఆనందాద్వైత మూర్తిగాను జగన్మాత ఈ గ్రంథంలో మనకు దర్శనమిస్తుంది. “సాధ కుడు లోకోత్తరమైన ఈ స్తుతిని పఠించినంత మాత్రాన ఈ మహాక వితోను, ఆ పై పరదేవతతోను ఐకాత్మ్యానుభూతిని పొందినట్టి స్థితిని పొందగలడు" జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారి ఈ మాట 'మూక పంచశతి' విషయంలో ప్రత్యక్షరసత్యం.
ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
more books