దాశరధి శతకము| Dasharadhi shatakam Telugu Book Download
17వ శతాబ్దము భద్రాచలరామదాసు విరచితము
దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు.
భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు.
శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!
దాశరథీ శతకమును కంచర్ల గోపన్న (భద్రాచల రామదాసు). అను పరమభక్తగణ్యుడు భక్త్యావేశ మున ఆశువుగా చెప్పెను. ఇతను 17వ శతాబ్దికి చెందినవాడు. రాముని బల పరాక్రమమును, గుణ గణ ములను పొగడుటయే ఇందు కానవచ్చును.
1. శ్రీ రఘురామ, చారు తులసీ దళధామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ: జగజ్జనకల్మషార్ణవో
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
ఈ పద్యములన్నియు భద్రాచలములో వెలసిన రామచంద్రుని మీదనే! మంగళకరమయిన ఇక్ష్వాకు వంశ మునజన్మించి తులసి పేరులు మెడకొని, శము క్షమాది శృంగార గుణములను తాల్చి వీరులైనటువంటి కబంధుడుమొదలైన రాక్షసుల సంహరించినటువంటి, లోకములను కాపాడు నటువంటి ఓ రామా! నీకు మంగళము, నీవు మా పాపములను బాపుము...
2. రామ విశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనా విముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్వ వంశ కలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామ విరామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
ఓరామా, అనంతమైన పరాక్రమముచే, పరశురాముని గర్వభంగ మొనర్చి,ఏక పత్నీ వ్రతమును తాల్చి,మేఘమువంటి శరీరఛాయకలిగిఇక్ష్వాకుకుల వంశచంద్రుడివై, రాక్షసులను చంపువాడవు.
Keywords: Dasharadhi shatakamu, Dasharadhi shatakamu telugu book Dasharadhi shatakamu pdf Download, Dasharadhi shatakamuin pdf books,TTD ebooks download,Mahabharat in Telugu pdf download,Mahabharat popular books download,Sangeeta Vidya darpan PDF download,Sangeeta Shastra sudhar navam PDF download,Sangeeta lakshanam download,Sri Lalitha sahasranama stotralu Vol-1PDF download,