భర్త్రుహరి సుభాషితము| Bharthruhari Subhashitam satakam Telugu Book Download
“ఓం నమః పరమార్థ కరూపాయ పరమాత్మనే స్వేచ్ఛావభాసితాసత్య భేదభిన్నాయ శంభవే ”
“సుభాషిత త్రిశతి” కర్త యగు భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీనకవులలో నొకఁడు. అతనిని అతని గ్రంథములనుగూర్చి విశ్వసనీయములగు చారిత్రికాధారములు శానరావు. అతని జీవితము లోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున ఆనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించియున్నను నవి యొండొంటికి పొంది పొసగి యుండకపోవుటచే నానావిధ గాధలకును సామరస్య మేర్పఱచుట దుస్సాధ్యమే యగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ డనియు తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు రోసి రాజ్యమును తనతముఁడగు విక్ర మార్కున కప్పగించి తాను వానప్రస్థుఁ డయ్యె ననియు నొక ప్రతీతి గలదు ఈవిక్రమార్కుఁడే విక్రమశశాబ్దమునకు మూలపురుషుఁడు. అది యటుండ నిండు. భర్తృహరివిరచితము లగు శతకములనుండి యత నికి జీవితమున నాశాభంగము మిక్కిలిగ నేర్పడె ననియు, స్వకుటుంబ మునో యిరుగుపొరుగులనో సూక్ష్మదృష్టితోఁ బరిశీలించుటవలన స్త్రీల శీలమున నతనికి సంక్రయము బలపరె పని విస్పష్ట మగును.