భాస్కర శతకం|Bhaskara shatakamu Telugu Book Download
ఈ భాస్కర శతకమును మారన వెంకన 17 వ శతాబ్దిలో రచించెను. ఈ శతాబ్ద లోతుల యందు మక్కువ ఎక్కువ. వేమన వలెనే ఈయన కూడ నీతి పద్యముల చెప్పి నను వేమనయంత ప్రాచుర్యము రాలేదు. వేమన పద్యాలలో గల క్లుప్తత ఇక్కడ కని పిండు. ఈయనకు రామాయణమన్న మక్కువ ఎక్కువ. ఎక్కువ శ్లోకాల్లో రామాయ ణాన్ని ఉదహరిస్తూ చెప్తారు.
1. శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా.
భాస్కరా! ఎన్ని ప్రయాసల కోర్చి ఐనను ప్రజలు ధనవంతుని చేరుదురే గాని బీద వాని దగ్గరకు పోరు. నదులన్నియు రత్నములు కలవన్న ఆశతోనే సముద్రుని చేరిన ట్లుగా.
2 అంగన నమ్మరాదు తనయంకెకురాని మహాబలాఢ్యు వే భంగుల మాయలోడ్డి చెఱువందలపెట్టు, వివేకియైన సా రంగధరుం బదంబులుఁగరంబులు గోయగ జేసిఁ దొలిచి త్రాంగియనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా.
17 వ శతాబ్ది యందలి స్త్రీ యందు గల దురభిప్రాయమునకు ఈ కవి కూడ దూరుడుకాడు. చిత్రాంగి సారంగధరుల ఉపమానమును తీసుకొని ఈ పద్యము న కవి చిత్రాంగి తన చేత చిక్కనందుకే సారంగ ధరునికి అంత దురవస్థ కల్పించి నదని స్త్రీలను నమ్మరాదని చెప్పుచున్నారు.