శివ మహా స్తోత్రము
శివపురాణము మహాపురాణమని "శ్రీ శివమహాపురాణ ప్రామాణ్య ప్రశంసా విశేషములు" అను నా విరచిత గ్రంధములో ప్రామాణికముగ యుక్తియుక్తముగాను నిరూపింపబడి పండిత ప్రకాండుల మెప్పు బడసినది. శివమహాపురాణములో ఏడవదగు వాయవీయ సంహిత-తలమానిక ముగా తనరారునట్టిది ఉపమన్యు మహర్షిగారు-శివమహాభక్తులలో అగ గణ్యుఁడై శివుని దర్శించి ఆనందముతో నుండగా శ్రీకృష్ణభగవానుఁడు ఉపమన్యువు నాశ్రయించి 'శివయోగములలో శ్రేష్ఠమైనదాని నుపదేశింపుడని' ప్రార్థింపగా-ఉపమన్యమహర్షి - ఈ శివమహాస్తోత్రమును పఠింపవలసినదని యుపదేశించెను. స్తోత్రమును పఠించువారు- సకలదేవతాస్తోత్రఫలమును పొందవచ్చును.
గాన నిట్టి స్తోత్రము పదునేడు (17, మహాపురాణములలో లేదనియే చెప్ప వచ్చును ఇందు పరశివుఁడు, ఆదిశక్తి, సదాశివుఁడు, సద్యోజాతాది పంచ బ్రహ్మలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాద్యష్టదిక్పాలురు, నవ గ్రహములు పార్వతీ లక్ష్మీసరస్వతులు. నారదాది మహర్షులు మరియు ముఖ్యులందరును ఐదు ఆవరణములలో నుతింపఁబడిరి.
శివభక్తులేగాక దైవభక్తులందరును పఠింపఁదగినది. స్తోత్రము శ్రీ వేదవ్యాసులచే ఉపమన్యుప్రోక్తముగా రచింపఁబడినందున దానికి తెలుగు సేత యవసరమని వ్రాసితిని.
ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
More Books