Anjaneya stotra makarandam Telugu Book Download |ఆంజనేయ స్తోత్ర మకరందము
మైత్రేయ జనతాం నిత్యం మంత్ర మేకం హనూమతః |
సప్తకోటి మహామంత్రా స్సిధ్యంత్యేవ న సంశయః ॥
ఆరాధితే కపిశ్రేష్టే సమస్తా అపి దేవతాః ||
భవంతి సతతం తుష్టా : సర్వదేవాత్మకోహిః||
యేకకేనా ప్యుపాయేన హనుమత్భూజనై ర్భుధః |
దివనం సఫలం కుర్యాత్ స్తోత్రైర్వా వందనై రపి ॥
తా॥ హనుమన్మంత్రము నొక్కటి నిత్యము జపించుటచే సప్తకోటి మహామంత్ర సిద్ది కలుగును. కపివరుని ఆరాధనచే సర్వదేవతారాధన ఫలము కలుగును. ఆయన సర్వదేవతా స్వరూపుడు కాన సర్వదేవతలు తుష్టులగుదురు. కాన హనుమత్పూజనము స్తోత్రము వందనములచే ప్రతిదినము సఫలము.
పరాశర
అన్యద్రహస్యం వక్ష్యామి కథాం పాపప్రణాశనీం
సావధానమనా భూత్వా శృణుష్వ మునిపుంగవ ॥
ఓ మైత్రేయ మహర్షి సర్వపాప ప్రణాశనకరమగు ఒక రహస్యమగు కథను
చెప్పెదను వినుము.
రాక్షసైః పీడితా దేవా బ్రహ్మాణం శరణం యయు: 1
బాధంతే రాక్షసా నిత్యం బ్రహ్మా శ్లోకా నృషించ్చనః॥
తా॥ ఓ మైత్రేయా | రాక్షసులు దేవతలనున్ను ఋషీశ్వరుల నున్ను లోకమునున్నూ
అనేక విధముల బాధించుచుండ దేవతలందరు ఆ బాధను సహింపజాలక బ్రహ్మను
చూచి
తేషాం కురు వధోపాయం త్వం హినః పరమాగతిః |
ఇత్యుక్తః ప్రాహ తా న్దేవాన్ మయాన జ్ఞాయతే వధః ॥
తా|| ఓ బ్రహ్మాదేవుడా | ఆ దుర్మార్గులను వధించు మార్గమును మాకు చెప్పవలసినది.
నీ కన్న మాకు వేరు శరణ్యము లేదని చెప్పగా విని ఆ రాక్షసులు నాశనము చేయుట
నావలన కాదు.