శ్రీరామ రక్షాస్తోత్రం| Sri Rama Raksha Telugu Book Download
ఓం శ్రీ రామ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ రక్షాస్తోత్రము
కోటి ప్రతుల ప్రచురణ ప్రచారోద్యమ శాఖ
భావార్ధ సహితము
శ్రీరామ రక్షాస్తోత్రము అత్యంత ఫలప్రదమయినది. సాధకుని శ్రద్ధ, భక్తి, భావములను అనుసరించి యిది లౌకిక పార లౌకికములగు సుఖముల -సన్నియు లభింపజేయును. సిద్ధిచేసిన తరువాత యీ స్తోత్రమును
పఠించుటవలన విశేషఫలము కలుగును.
సిద్ది చేయు విధానము
ఆశ్వయుజ శుక్లపక్షములో లేదా వసంత ఋతువులో లేదా ఓ శుభ ముహూర్తములో తొమ్మిది రోజులవరకు నిత్యం బ్రహ్మ ముహూర్తంలో సాధకుడు స్నానాది నియమిత నిత్యకర్మలు పూర్తి చేసుకుని శుద్ధవస్త్రములు
ధరించి కుశాసనముపై (దర్భాసనము) సుఖాసీనుడు కావలెను.
శ్రీ రామచంద్ర భగవానుని పరమ కళ్యాణప్రద దివ్య మంగళ సుందర స్వరూపములో చిత్తమును ఏకాగ్రమొనర్చి అత్యంత శ్రద్ధావిశ్వాసములతో మహత్తర ఫలములను ప్రసాదించు యీ స్తోత్రమును శక్తి ననుసరించి 11 పర్యాయములు లేదా సప్తపర్యాయములు నిత్యము నియమిత రూపేణా పఠింపవలెను. శ్రద్ధ ఎంత అఖండముగా నుండునో ఫలము కూడా దానిని అనుసరించియే వుండును.
వివాహ, ఋణవిముక్తి రోగనాశనము మానస సంకట నివారణము, విపత్తి నాశనము చింతానాశవాది ఎంతటి కష్టముల విషయములో నయినను దీనిని ప్రయోగింపవచ్చును. రోగివద్ద కూర్చుని నిత్యము శుద్ధ స్పష్ట రూపములో పఠించుటవలన సత్ఫలములు కలిగి తీరును.