శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం ఒంగోలు|Shri Prasanna Chennakesava Swamy Devasthanam ongolr

Shri Prasanna Chennakesava Swamy Devasthanam ongolr

శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం అయిన ఒంగోలు నందు కలదు. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది మరియు పురాతనమైనది. ఈ ఆలయం లో శ్రీ చెన్నకేశవ స్వామి వారితో పాటు అనేక దేవతా మూర్తులు కొలువై ఉండడం మరో ప్రత్యేకత.

శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. మహా విష్ణువు లక్ష్మీ దేవి సమేతుడై ఉండడం వలన యాత్రికులు మరియు స్థానికులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అద్భుతమైన శిల్ప కళాకృతులతో నిర్మించబడిన గోపురం మరియు పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మితమైన మండపం వలన ఈ ఆలయం వైభవోపేతంగా ఉంది.

క్షేత్ర చరిత్ర:

శ్రీ ప్రసన్న చెన్న కేశవ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లాలోనే ప్రాచీనమైన ప్రముఖ దేవస్థానం, విజయనగర సామ్రాజ్య పాలకులకు సామంత రాజులైన మందపాటి రాజు సోదరులు రామభద్రరాజు, రఘుపతి రాజులు 16వ శతాబ్దం చివరిలో ఒంగోలులో (ఇప్పటి కోట వీధిలో) కోటను నిర్మిచుకొని పాలించేవారు. వారి ఇష్టదైవమైన శ్రీ ప్రసన్న చెన్న కేశవ స్వామి వారిని కోటాలో ప్రతిష్టించి నిత్యం ధూపదీప నైవేద్యములతో పూజించేవారు.

కోట వైశాల్యం చిన్నది కావడం వలన ఉత్సవములు, పర్వదినములలో రద్దీవలన గ్రామస్తులు చెన్నకేశవ స్వామి వారిని బయట నుంచే దర్శించుకోవలసిన పరిస్థితి ఉండేది. అంతేకాక ఆ రోజుల్లో వెంకటగిరి రాజులతో ఉన్న వైరము వలన కోటభద్రతకు సేనాధిపతి రఘునాయకుడు చాలా ఇబ్బంది పడేవారు. ఈ విషయం గుర్తించిన మంత్రి వంకాయలపాటి వీరన్న విషయాన్ని రాజు గారి దృష్టికి తీసుకొని వచ్చారు. అంతేగాక స్త్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామిని ప్రజలు నిత్యం దర్శించుకొనే భాగ్యం కలిగించాలనే సంకల్పం మహారాణి మంజులత గారికి ఉండేది. అన్ని విషయములు దృష్టిలో పెట్టుకొని మహారాజు రఘుపతి రాజు గారు ఆస్థాన పురోహితుడు వంగల సీతారామ అవధాని, ఇతర పండితులతో చర్చించి శ్రీ చెన్నకేశవ స్వామికి కోట వెలుపల పెద్ద ఆలయం కట్టించి నిత్యం ప్రజలకు స్వామి వారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

స్థల పరిశీలనకు వాస్తు నిపుణులను రప్పించి సముద్ర మట్టము కంటే ఎత్తుగా విశాలమైన భూభాగముతో సూర్యోదయ కిరణాలను ప్రసరింపచేసుకొని వీరాజిల్లుతున్న ఒంగోలు కొండను దేవాలయ స్థాపనకు అనువుగా నిర్ణయించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం విధులు నిర్వహించటానికి పూజారులను శ్రీరంగం నుండి రప్పించి క్రీ.శ. 1712లో స్వామి వారి ఆలయాన్ని దివ్యెముగా ప్రారంభించారు. నాటి నుండి ప్రజలు శ్రీ చెన్నకేశవ స్వామి వారిని నిత్యం దర్శించుకొనటానికి వీలుపడింది. ఈనాడు ఆ కొండ కేశవాద్రిగా, ఆ ప్రాంతము కేశవస్వామిపెటగా పిలువబడుతుంది.

ప్రజలు కొరకు రాజలచే కట్టించబడిన దేవస్థానంలో అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు, శ్రీ సత్యనారాయణస్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి, సంతాన వణుగోపాలస్వామి, సప్తమాతృకలు, కొలను, నాగశిల ప్రతిష్టించారు. దేవస్థానమునందున్న అన్ని దేవాలయములలో నిత్య ధూప దీప నైవేద్యములతో సూర్యోదయ సూర్యాస్తమయ సమయములో మంత్రాళములతో, వేదపారాయణములతో, మాసకళ్యాణములతో, నిత్యం భక్తులతో విరాజిల్లుతోంది. శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానము ఒంగోలు నగరమునకు శోభ చేకూర్చునది జనాకర్షనీయమైన ఒక యాత్రా స్థలముగా విరాజిల్లుతోంది.   

ఆలయ సమయాలు:
ఆలయం ఉ.6:00 గం.ల నుండి ఉ.11:00 గం.ల వరకు మరియు సా.6:00 గం.ల నుండి రా.9:00 గం.ల వరకు తెరచి ఉంటుంది. భక్తులు సేవా కార్యక్రమాలు మరియు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చును. ఈ దేవస్థానము నందు వైఖానస ఆగమము ప్రకారము పూజలు జరుగును.

About 

This temple is one of the most Ancient temples present in the Prakasam district of Andhra Pradesh. During the end of the 16th century, Rama Bhadra Raju and Raghupathy Raju, the long-term ruled kings for the Vijayanagara Kingdom were ruling from Ongole. These Kings were ardent devotees of Lord Venkateshwara. Hence they installed an idol of the lord in their fort itself and named the lord Chennakesava Swamy.

To reduce the security risk from predators, the king with the Pandits and Vaasthu experts decided to build the temple on the hill of Ongole and was named Kesavadhri.

The King invited the required priests from Sri Rangam to commence the poojas in the inaugural ceremony of the Lord Chennakesava Temple as per the vaikhanasa agama tradition during the year C.E. 1712

Idols of Goddess Rajyalakshmi, Aandaal, Lord Sathyanarayana, Lord Prasanna Anjaneya, Santhana Venugopala Swamy, Sapthamathrukas, and Naaga Devathas were installed in the temple. 

Timings to visit 

6:00 AM – 12:30 PM | 5:00 PM – 9:00 PM 

Festivals celebrate at Sri Prasanna Chennakesava Swamy Temple
Ugadi
Sri Vari Brahmotsavam
Hanuman Jayanti
Vaikunta Ekadashi
Sri Guru Purnima Mahotsavam
Krishna Janmashtami

Regular Sevas & Darsan Timings

SUPRABHAATHA SEVA 6:00 AM సుప్రభాత సేవ: ఉదయం గం.6:00 లకు
06:00 AM-06:30 AM

PRATHYAKSHA ASHTOTHARA NAAMAARCHANA (REGULAR) - RS.10/ TIMINGS: 6:30 AM TO 11:00 AM &
6:00 PM TO 9:00 PM  ప్రత్యక్ష అష్టోత్తర నామార్చన (రెగ్యులర్)   - రూ.10 /- లు సమయము ఉదయం గం.6:00 నుండి 11:00 వరకు & సాయంత్రం గం. 6:00 నుండి 9:00 వరకు
06:30 AM - 09:00 PM

TEMPLE TIMINGS (REGULAR)  6:00 AM TO 11:00AM & 6:00 PM TO 9:00 PM 
06:00 AM - 09:00 PM

దేవస్థానము దర్శన వేళలు ((రెగ్యులర్)) : ఉదయం గం. 6:00 నుండి 11:00 వరకు & సాయంత్రం గం. 6:00 నుండి 9:00 వరకు 
06:00 AM-09:00 PM

ప్రత్యక్ష సహస్ర నామార్చన (రెగ్యులర్) - రూ.20 /- లు సమయ: ఉదయం గం. 8:00 నుండి 11:00 వరకు మరియు సాయంత్రం గం. 6:00 నుండి 8:00 వరకు 
08:00 AM - 08:00 PM

PRATHYAKSHA ABHISHEKAM SRI PRASANNA CHENNA KESAVA SWAMY VARU (REGULAR) - RS.216/
08:00 AM - 09:30 AM

ప్రత్యక్ష అభిషేకం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారు (రెగ్యులర్) రూ.216/
08:00 AM - 09:30 AM

PRATHYAKSHA ABHISHEKAM - SRI RAJYA LAKSHMI AMMAVARU (REGULAR) - RS.216/ 
08:00 AM - 09:30 AM

ప్రత్యక్ష అభిషేకం - శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు (రెగ్యులర్) రూ.216/
08:00 AM - 09:30 AM

PRATHYAKSHA ABHISHEKAM - SRI VENKATESWARA SWAMY VARU (REGULAR) -RS.216/-
08:00 AM-09:30 AM

ప్రత్యక్ష అభిషేకం - శ్రీ వేంకటేశ్వర స్వామి వారు (రెగ్యులర్) రూ.216/
08:30 AM-09:30 AM

PRATHYAKSHA ABHISHEKAM - SRI PRASANNA ANJANEYA SWAMY VARU (REGULAR) - RS.216/
08:00 AM - 09:30 AM 

ప్రత్యక్ష అభిషేకం - శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు (రెగ్యులర్) రూ.216/ 
08:00 AM - 09:30 AM

PRATHYAKSHA SRI SATHYA NARAYANA SWAMY VARI VRATHAMU (REGULAR) - RS.300/
09:00 AM - 11:00 AM

ప్రత్యక్ష వ్రతములు - శ్రీ సత్య నారాయణ స్వామి వారి వ్రతము (రెగ్యులర్) - రూ.300/
09:00 AM - 11:00 AM

PRATHYAKSHA HOMAM (REGULAR) - SRI SUDARSHANA LAKSHMI NAARASIMHA HOMAM-RS.1,116/ 
09:00 AM - 11:00 AM

ప్రత్యక్ష సేవ: హోమం (రెగ్యులర్): శ్రీ సుదర్శన లక్ష్మి నారసింహ హోమం - రూ.1,116/-లు 
09:00 AM - 11:00 AM

PRATHYAKSHA KALYANAM (REGULAR) - SRI PRASANNA CHENNAKESAVA SWAMY VARU -
RS.216/
07:00 PM - 08:30 PM 

ప్రత్యక్ష సేవ: శ్రీ ప్రసన్న చెన్న కేశవ స్వామివారి కళ్యాణము (రెగ్యులర్ - రూ.216/
07:00 PM - 08:30 PM

PRATHYAKSHA SEVA - KALYANAM - SRI VENKATESWARA SWAMY VARU (REGULAR) - RS.216/
07:00 PM - 08:30 PM

ప్రత్యక్ష సేవ: శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణము (రెగ్యులర్) - రూ.216/
07:00 PM - 08:30 PM


Paroksha (Virtual) Seva Details

PAROKSHA SEVA - ASHTOTHARA NAAMAARCHANA (VIRTUAL) - RS.10/ TIMINGS: 6:30 AM TO 11:00 AM & 6:00 PM TO 8:30 PM
Daily from 06:30 AM-08:30 PM

పరోక్ష సేవ : అష్టోత్తర నామార్చన (వర్చువల్) - రూ.10/- లు: ఉదయం గం.6: 30ల నుండి గం 11:00 ల వరకు మరియు సాయంత్రం గం. 6:00 ల నుండి గం. 8:30 ల వరకు 
Daily from 06:30 AM-08:30 PM


PAROKSHA SEVA - SAHASRA NAAMAARCHANA (VIRTUAL) - RS.20/- TIMINGS: 8:00 AM TO 11:00 AM & 6:00 PM TO 8:00 PM Daily from 08:00 AM-08:00 PM
Daily from 08:00 AM-08:00 PM

పరోక్ష సేవ: సహస్ర నామార్చన (వర్చువల్) - రూ.20/ లు ఉదయం గం.8:00 ల నుండి గం.11:00 ల వరకు మరియు సాయంత్రం గం.6:00 ల నుండి గం.8:00 ల వరకు 
Daily from 08:00 AM-08:00 PM

PAROKSHA SEVA - SRI PRASANNA CHENNA KESAVA SWAMY VARI ABHISHEKAM (VIRTUAL) - RS.216/
Every Wednesday from 08:00 AM-09:30 AM

పరోక్ష సేవ: అభిషేకం (వర్చువల్) శ్రీ ప్రసన్న చెన్న కేశవస్వామి వారు రూ.216/-లు 
Every Wednesday from 08:00 AM-09:30 AM 

PAROKSHA SEVA - SRI RAJYALAKSHMI AMMAVARI ABHISHEKAM (VIRTUAL) - R.216/
Every Friday from 08:00 AM-09:30 AM 

పరోక్ష సేవ: అభిషేకం (వర్చువల్) - శ్రీ రాజ్య లక్ష్మి  అమ్మ  వారు- రూ.216/-లు
Every Friday from 08:00 AM-09:30 AM

PAROKSHA SEVA - SRI VENKATESWARA SWAMY VARI ABHISHEKAM (VIRTUAL) -
RS.216/
Every Friday from 08:00 AM-09:30 AM

పరోక్ష సేవ: అభిషేకం (వర్చువల్) - శ్రీ వేంకటేశ్వర స్వామి వారు రూ.216/-లు 
Every Friday from 08:00 AM-09:30 AM

PAROKSHA SEVA - SRI PRASANNA ANJANEYA SWAMY VARI ABHISHEKAM (VIRTUAL) -
RS.216/

Every Saturday from 08:00 AM-09:30 AM

పరోక్ష సేవ: అభిషేకం (వర్చువల్) - శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు - రూ.216/-లు
Every Saturday from 08:00 AM-09:30 AM

PAROKSHA SEVA - AAKU PUJA (VIRTUAL) SRI PRASANNA ANJANEYA SWAMY VARU -
RS.216/ 
Daily from 10:00 AM-11:00 AM

పరోక్ష సేవ: ఆకు పూజ (వర్చువల్) - శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు - రూ.216/-లు
Daily from 10:00 AM-11:00 AM

PAROKSHA SEVA - KALYANAM (VIRTUAL) - SRI PRASANNA CHENNA KESAVA SWAMY VARU - CHITHA NAKSHATRAM - RS.1,116/
Daily from 07:00 PM-08:30 PM

పరోక్ష సేవ: కళ్యాణం (వర్చువల్) - శ్రీ ప్రసన్న చెన్న కేశవ స్వామి వారు - చిత్త నక్షత్రం - రూ.1,116/-లు 
Daily from 07:00 PM-08:30 PM

PAROKSHA SEVA - KALYANAM (VIRTUAL) - SRI VENKATESWARA SWAMY VARU ON SRAVANA NAKSHATRAM - RS.1,116/
Daily from 07:00 PM-08:30 PM

పరోక్ష సేవ: కళ్యాణం (వర్చువల్) - శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రం - రూ.1,116/-లు
Daily from 07:00 PM-08:30 PM

PAROKSHA SEVA - HOMAM (VIRTUAL) - SRI SUDARSHANA LAKSHMI NAARASIMHA HOMAM - RS.1,116/
Daily from 09:00 AM-11:00 AM

పరోక్ష సేవ : హోమం (వర్చువల్) - శ్రీ సుదర్శన లక్ష్మి నారసింహ హోమం - రూ.1,116/-లు 
Daily from 09:00 AM-11:00 AM

Transport|రవాణా

By Road:

From all major Cities and Towns, there is direct Bus connectivity to Ongole. Auto and Taxi are available from R.T.C. Bus stand. From Ongole R.T.C. Bus stand 1/2 K.M., and Ongole Railway station 1/2 K.M. Near Zilla Praja Parishad Office, Kesavaswamypet, Ongole
అన్ని ముఖ్య పట్టణాల నుండి ఒంగోలుకు బస్సులు కలవు, అక్కడ నుండి ఆటో లేదా టాక్సీలో ఆలయాన్ని చేరుకోవచ్చును.

By Train:
From all major Cities and Towns, there is direct Train connectivity to Ongole. Auto and Taxi are available from Railway Station. 1/2 K.M. from Ongole Railway station to temple
అన్ని ముఖ్య పట్టణాల నుండి ఒంగోలుకు రైలు సౌకర్యం కలదు, అక్కడ నుండి ఆటో లేదా టాక్సీలో ఆలయాన్ని చేరుకోవచ్చును.

By Air:
The nearby Airport is Vijayawada International Airport at Gannavaram with a distance of 166 km
ఆలయానికి దగ్గరగా 166 కి.మీల దూరంలో గన్నవరం నందు విజయవాడ జాతీయ విమానాశ్రయం కలదు.
Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు
Chandavaram



బౌద్ధ మత విశ్వాసాలకు నెలవు ఈ చందవరం, ఈ పురాతన బౌద్ధమత వారసత్వ సంపద అయిన చందవ సింగరకొండ పర్వతాలపై ఉన్నది. నిర్మాణ శైలి మరియు రూపకల్పన వాస్తుశిల్పి మేధస్సుకి మంచి విందులాంటిది. చతురస్రాకార సున్నపురాయి చట్రాలు, క్లిష్టమైన కళాత్మతని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి మూడు రెక్కలతో నిర్మితమైన మరం ఒక గొప్ప శిల్పకళా ప్రదర్శనకి ప్రతిరూపం. చందవరం స్తూపాల వంటి నిర్మాణాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటగా ఇక్కడ నిర్మించారు.
Chandavaram is a holy place for those who follow Buddhist faith. This ancient heritage is located on top of Singarakonda hills. The structure is magnificently designed and th e double terraced stupa is a feast to architect minds. The limestone panels reflect intri cate artisanship. The three-winged monastery is a display of splendid architecture. Ch andavaram Stupa is considered the first of its kind in the entire state of Andhra Prades 

Kothapatnam Beach
ఒంగోలు పట్టణం దగ్గరలోని కొత్తపట్నం బీచ్ ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రం, ఈ బిచ్ ఒంగోలుకి 18 కి.మీల దూరంలో ఉన్నది. స్థానికులకు మరియు పర్యాటకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. సముద్రపు నీలి వర్షపు నీరు, పొడవైన ఇసుక తిన్నెలు మరియు స్వచ్ఛమైన గాలి మనలని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇ ఎక్కడ బోటింగ్ సదుపాయం కలదు. కానీ కార్తీక పౌర్ణమి రోజున 
వచ్చే వేలాదిగా తరలి వచ్చే జన సంద్రోహానికి బీచ్ చిన్నదిగా అనిపిస్తుంది. కావున మీరు పర్యటించాలి అనుకొనే ప్రదేశాల్లో ఈ బీచ్ ని ఎ న్నుకొనడం ఉత్తమం.
Kothapatnam Beach is one amongst the top attractions in Ongole. Located 18 km from the city, the beach is a great source of entertainment for local people and tourists. The clear blue waters of the sea, the long stretches of sand and the gentle breeze is mesm erising. Boating is available here. But for the Karthika Purnima festival, when locals thr ong in thousands, the beach is less frequented. Hence, it is a great place to unwind on your tour to this part of the world.

Bhairavakona
భైరవకొన నల్లమల అడవుల్లో ఉంది. ఇక్కడ 200 మీటర్ల ఎత్తైన జలపాతం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి ప్రకృతి రమణీయమైన అందాలు పర్యాటకులని ముగ్ధభరితులని చేస్తుంది. 7-8 వ శతాబ్దంలో నిర్మించిన 8 ప్రాచీన పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా అరుదైన వివిధ రకాల ఔషధ మూలికలు ల బిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున పున్నమి వెన్నెల నేరుగా ఆలయంలోని పార్వతి అమ్మవారి విగ్రహాన్ని తాక డం ఇంకో ప్రత్యేకత.
ఒంగోలు ప్రాంతంలో చాలా వైవిధ్య ఆలయాలు ఉన్నాయి. వీటి నిర్మాణ శైలి చూపరులను ఆకట్టుకుంటుంది. సుందరమైన ప్రకృతి అందాలు అలసిన మనసుకి ఉల్లాసాన్ని అందిస్తాయి. పరిశోధనాత్మకతను అన్వేషించే వారికి ఈ ప్రాచీన ఆలయాలు ఉత్తేజాన్నిస్తాయి. మొత్తంగా ఒంగోలు పట్టణం పర్యాటకులకు ఒక మ దురానుభూతిని మిగులుస్తుంది.
Bhairavakona is situated in the Nallamala hills. The 200-metre high water falls is a deli ght to watch. Nature in its vibrant form is seen here and you are sure to be enthralled by the beauty of the place. You can find eight temples in this hill and these ancient te mples were constructed during the 7th and 8th centuries. The region has rare herbs u sed to address various medical conditions. Another specialty of the place is that on the day of Karthika Purnima, moonlight falls of goddess Parvathi's idol at the temple.

Ongole has various temples and you will be overwhelmed by the style of architecture displayed in the temples. The picturesque landscape is feast to tired minds and the an cient temples are a delight to inquisitive minds who seek to explore the past. Overall, tourist places in Ongole gives you a different experience altogether to make your stay memorable.

Contact Numbers and information

Sri Prasanna Chennakesava Swamy Devasthanam ,

Kesavaswamypet

Ongole (City and Mandal)

Prakasam District,

Andhra Pradesh-523001

Phone: +91 9494289008, 08592 281537

Popular post to download:

ALL TELUGU BOOKS DOWNLOADtelugu books downloadtelugu books download

telugu books downloadtelugu books download
More Books
keywords:Shri Prasanna Chennakesava Swamy Devasthanam Information,Shri Prasanna Chennakesava Swamy Devasthanam,Shri Prasanna Chennakesava Swamy Devasthanam historyShri Prasanna Chennakesava Swamy Devasthanam contact numbers,popular places to visit in ongolr,ongolr transport,Shri Prasanna Chennakesava Swamy Devasthanam history in englisgh,temple history lova tuni temple timings,ongolr temple adopted places and temples,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS