Narayanamanthram Telugu Book Download TTD eBooks Download
నారాయణమంత్రం
Author: Dr. Gali Gunasekhar
Literature: TEMPLE LITERATURE
Language: Telugu
Year: 2019
ముందుమాట
ఎన్నో పుణ్యక్షేత్రాలకు, మరెన్నెన్నో దేవాలయాలకు ఆలవాలం దివ్యభారతావని. అందులో ఆసేతుహిమాచలం భారతదేశంలో వేలాది వైష్ణవక్షేత్రాలు వెలసి ఉన్నాయి.
ఈ వైష్ణవక్షేత్రాలల్లోని అధిదైవతమైన శ్రీమహావిష్ణువును ఎందరో మహనీయులు దర్శించారు, తమిళభాషలో కీర్తించారు. ముఖ్యంగా శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రవర్తకులలో పేరెన్నికగన్న పండ్రెండుమంది ఆళ్వారులు శ్రీవైష్ణవ క్షేత్రాలను ఎన్నింటినో దర్శించారు. వాటిలో ని దర్శించడమే గాక తమిళకీర్తనల్లో స్తుతించారు కూడా. ఇలా ఆళ్వారులు దర్శించి కీర్తించిన వైష్ణవక్షేత్రాలు "శ్రీవైష్ణవదివ్యదేశాలు"గా "దివ్యతిరుపతులు"గా ప్రసిద్ధిని పొందాయి. ఒక్కొక్క వైష్ణవ దివ్యదేశంలో శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క పేరుతో వెలసి ఉండడం విశేషం. ఈ దివ్యక్షేత్రాలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన మహనీయులు భగవద్రామానుజాచార్యులవారు.
ఈ చిన్న పుస్తకంలో అందరూ సులభంగా తెలుసుకొనే విధంగా 108 దివ్యదేశాలను, అందులోని అర్చామూర్తులను, ఆలయశిఖరవిమానాలను, వారిని కీర్తించిన ఆళ్వారుల వివరాలను పట్టికరూపంలో పేర్కొనబడింది. ఇంకా ఈ రచయిత ఆ క్షేత్రాలలోని దేవతలను తిరునారాయణ మంత్రంలో కీర్తిస్తూ చిన్న చిన్న గీతాలను రచించడంతోపాటు పుస్తకం చివర్లో భగవద్రామానుజాచార్యులవారి జీవితచరిత్రను, సంగ్రహంగా, సమగ్రంగా తెలియజేశారు.
Narayanamanthram Telugu Book Download