శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం నెల్లూరు|Sri Mallikarjuna Swamy kamakshi Tayee Ammavari Devasthanam Nellore

Sri Mallikarjuna Swamy kamakshi Tayee Ammavari Devasthanam Nellore

ఆలయ విశేషాలు

బ్రహ్మాండాది పురాణములలో ప్రశించించబడిన పెన్నా నది తీరమున వెలసియున్న దివ్య క్షేత్రమే జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, అశేష ప్రజానికానికి ఆకర్షణీయమైన ఈ ఆలయం పెన్నానదికి ఉత్తరం ఒడ్డున వెలుగొందుతున్న ఈ క్షేత్రము ఎన్నదగిన వాటిలో ఒకటి. శ్రీ కామాక్షితాయి మల్లికార్జున స్వామి వారికి నిలయమై అలరారుతున్న ఈ జొన్నవాడ పురాతనమైన ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రము.

త్రేతాయుగమున కశ్యప బ్రహ్మ యజ్ఞ మొనరించిన ప్రదేశం కావున, యజ్ఞవాటిక జొన్నవాడ గా సార్ధకమైనది. వాంచితార్ధ ప్రదాయని కామాక్షితాయి అమ్మవారిని ఆది శంకరులు సేవించిరని ప్రతీతి. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మ వారి దేవస్థాన సన్నిది నందు గల రేవు కశ్యప తీర్ధమని, అందు స్నానమాచరించిన సకల దోషములు హరించిపోవునని నమ్మకం. బ్రహ్మర్షియైన కశ్యప బ్రహ్మ ఒకనాడు భూలోకమునకు వచ్చి వేదాద్రిని (నరసింహకొండ), దర్శించి అక్కడ ఒక యజ్ఞము చేసిన మంచిదనుకొని వేదాద్రికి, ఉత్తరమునున్న భూమిని యజ్ఞవాటికగా చేసుకొనెను. బ్రహ్మార్పణముగా కశ్యప మహర్షి యజ్ఞము పూర్తి చేసెను. త్రివిధములైన ఆ అగ్ని కుండములలో నుండి వెలువడిన తేజస్సు దశదిశల వ్యాపించింది. ఆ తపస్సును చూసి ఈశ్వరుడు అగ్ని నుండి మల్లికార్జునుడిగా ఆవిర్భవించెను. జొన్నవాడ యందు ఆ రీతిన మల్లికార్జున స్వామి అవతరించెనని చెప్పగా విని శౌనకాది మహామునులు కామాక్షి తాయి మల్లికార్జున స్వామి చేరిన విధమును తెలుపమని కోరిరి.

కైలాసమందు శివుని కోసం పార్వతి అన్వేషణ ప్రారంభించి చివరకి జొన్నవాడ చేరినది. ఉద్యానవనమున వేంచేసియున్న పార్వత జాడ తెలుసుకొని. ఆద్యంతరహితుడైన శ్రీ మల్లికార్జునుడు స్వయముగా పార్వతిని చేరుకొని దేవి! ఈ యగ్నవతికని (జొన్నవాడ) వదలి వెళ్ళుటకు నాకు మనసు రాకున్నది. కాబట్టి నా కొరకు నీవు కూడా యిక్కడే యుండి "కామాక్షి" అను పేర ప్రసిద్ధిగాంచి భక్తులను రక్షించమని కోరెను. శివుని కోరికననుసరించి ఆనాటి నుండి పార్వతి డివి "కామాక్షి" గా పిలవబడుచు భక్తుల కోరికలు తీర్చుచూ దయామయిగా జొన్న వాడలో అలరారుచున్నారని సూతుడు వివరించెను.

స్థలపురాణం

జన్నవాడ దేవస్థానం నెల్లూరు నగరమునకు 12 కి. మీ దూరంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం నందు పెన్నానది ఒడ్డున కలదు. ఈ ఆలయ ద్వారం ధ్వజ స్థంభం మరియు బంగారంతో తయారు చేసి 5 కలశంలతో అలంకరించిన ఆలయ గోపురం భక్తులను ఆకర్షిస్తుంది. పూజారిచే సాంప్రదాయబద్ధంగా అలంకరించిన శ్రీ కామాక్షి దేవి అమ్మవారి విగ్రహం భక్తుల చూపు మార్చలేనంత రమణీయంగా ఉంటుంది. దివ్యకాంతితో విరాజిల్లుతున్న ఈ ప్రదేశాన్ని భక్తులు మళ్ళీ మళ్ళీ దర్శించాలి అనుకుంటారు.

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారు ఇక్కడ శ్రీచకాన్ని ప్రతిష్టించారు. తెలుగు తిది ప్రకారం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం జరుపుతారు మరియు దేవి శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు చాల ఘనంగా నిర్వహిస్తారు. చాల మంది భక్తులు శుక్రవారం రోజున ఆలయాన్ని సందర్శించి రాత్రికి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు నవ ఆవరణ పూజ చేస్తారు మరియు గంగా కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి కల్యాణోత్సవం జరుపుతారు.

Temple History In English

Sri Mallikarjuna Swamy Kamakshitayee Devasthanam is located on Clive2. the bank of river Pennar at Jonnawada Village, 12 Km from Nellore City the ng the Village is part of Buchireddipalem Mandal. It attracts any piligirims the temple entrance door Dwaja Sthambham Flag mast and gopuram tower of the temple adorning with five kalasam pots on the top which is made out of gold. The statue of the goddess Kamakshi Devi who is greatly adorned the traditional way by the priests is stunning for any devotee or visitor. Everyone would like to revisit this place having glowing divine radiance which can be self experienced only.

Here Jagadguru Sri Adi Shankaracharya installed a SriChakram. Brahmotsavam is performed in Vaisaka Masam of Telugu month and Nine days of Dasara festival also celebrated in a grand way. Many devotees will visit temple on Fridays and they will sleep in temple premises. Here Sri Chakra Navaavarna Pooja will be performed and daily Kalyanostavam will be done to Ganga and Kamakshi Sametha Sri Mallikarjuna Swamy.

Regular Sevas & Darsan Timings

Srivarla Darsanam (Rs. 50/-)(Rs.10/-)(Free) // శ్రీవార్ల దర్శనం (రూ.50/-)(రూ 10/-)(ఉచితం) 
07:00 AM-01:00 PM

Srivarla Darsanam (Rs. 50/-)(Rs.10/-)(Free) // శ్రీవార్ల దర్శనం (రూ.50/-)(రూ 10/-)(ఉచితం) 
05:00 PM 09:00 PM

Prathyaksha Seva Astotharam (Rs. 20/-) // ప్రత్యక్ష సేవ అష్టోత్తరం (రూ. 20/-) [Regular]
07:00 AM-01:00 PM

Prathyaksha Seva Khadgamala Pooja (Rs. 100/-) // ప్రత్యక్ష సేవ ఖడ్గమాల పూజ (రూ.100/-) [Regular] 
07:00 AM - 12:30 PM

Prathyaksha Seva Laghunyasa Abhishekam(Rs.200/-1 // ప్రత్యక్ష సేవ లఘున్యాస అభిషేకం (రూ.200/-) [Regular
07:30 AM - 08:00 AM

Prathyaksha Seva Navaavarana Pooja(Rs. 510/-) // ప్రత్యక్ష సేవ నవావరణ పూజ (రూ.510/-) [Regular]
08:00 AM - 09:00 AM

Prathyaksha Seva Mahanyasa Abhishekam (Rs. 510/-) // ప్రత్యక్ష సేవ | మహాన్యాస అభిషేకం (రూ.510/-) [Regular]
08:00 AM - 09:00 AM

Prathyaksha Seva Sahasranamarchana(Rs. 200/-)
 // ప్రత్యక్ష సేవ సహస్రనామార్చన(రూ.200/-) [Regular] 
08:30 AM - 09:00 AM.

Prathyaksha Seva Prardhana Kalyanam (Rs. 1000/-) // ప్రత్యక్ష సేవ ప్రార్ధనా కళ్యాణం(రూ.1000/-) [Regular] 
10:00 AM - 11:00 AM

Paroksha (Virtual) Seva Details

Paroksha Seva - Khadgamala Pooja (Rs. 300/-) /పరోక్ష సేవ - ఖడ్గమాల పూజ (రూ.300/-) [Virtual] 
Daily from 07:30 AM-08:00 AM

Paroksha Seva - Laghunyasa Abhishekam (Rs. 500/-) / పరోక్ష సేవ - లఘున్యాస అభిషేకం (రూ. 500/-) [Virtual] 
Daily from 07:30 AM-08:00 AM

Paroksha Seva - Mahanyasa Rudrabhishekam(Rs. 1000/-)/853 మహాన్యాస రుద్రాభిషేకం(రూ. 1000/-) [Virtual] 
Daily from 08:00 AM-09:00 AM

Paroksha Seva - Srichakra Navavaarana Pooja(Rs. 1000/-) / పరోక్ష సేవ - శ్రీచక్ర నవావరణ పూజ(రూ. 1000/-) [Virtual]
 Daily from 08:00 AM-09:00 AM

Paroksha Seva - Maha Rudra Homam (Rs. 6116/-) / పరోక్ష సేవ - మహా రుద్రహోమం (రూ. 6116/-) [Virtual]
Daily from 09:00 AM-11:00 AM

Paroksha Seva - Prardhanaa Kalyanam (Rs. 1000/-) / పరోక్ష సేవ - ప్రార్ధనా కళ్యాణం(రూ. 1000/-) [Virtual]
Daily from 10:00 AM-11:00 AM

Paroksha Seva - Astothara Sathanamarchana(52 Fridays) (Rs. 5116/-)/ పరోక్ష సేవ - అష్టోత్తర శతనామార్చన (52శుక్రవారములు) (రూ. 5116/-) [virtual] 
Every Friday from 07:30 AM-08:00 AM

Paroksha Seva - Navaavarana Homam(Rs.16116/-) / పరోక్ష సేవ - నవావరణ హోమం (రూ. 16116/-) [Virtual]
Daily from 09:00 AM-11:00 AM

Transport|రవాణా

By Road:

Andhra Pradesh Road Transport Corporation buses are available from all places in Andhra Pradesh and also Metro Cities in South India to reach Nellore city.and then From Nellore City, one can hire local Autos, Cabs to reach Jonnawada Temple.

And also Piligrims reach by their own vehicles by road with 16.9 Kms from NH 16 at Nellore
దేవాలయం, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్నది..

By Train:

Railway station near to Jonnawada is Nellore Railway Station in just 13.5 Kms, Daily 140 trains, including 132 express trains and 6 passenger trains and 2 EMU/DMU are passing through this station, which can be reached by hiring a cab from Nellore. Taxis and autos are available for Nellore to Jonnawada.
నెల్లూరు రైల్వే స్టేషన్, ఈ ఆలయానికి 15 కి.మీ దూరంలో ఉన్నది.
By Air:
Airport near Jonnawada is Tirupati International Airport, in Tirupati, which can be reached by hiring a cab from Nellore, Cabs, Buses are available for Airport to Tirupafty Bustand to Nellore.
తిరుపతి విమానాశ్రయం, ఇక్కడకి 135 కి.మీ దూరంలో ఉన్నది.
Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు
Vedagiri Lakshmi Narasimha Swamy Temple in Nellore - Narasimha Konda

Sri Rajarajeswari Ammavari Devasthanam

Sri Sridevi Bhudevi Sametha Varadara Swamy Vari Devasthanam

Contact Numbers and information

Sri Mallikarjuna Swamy Kamakshi Tayee Devasthanam,
Jonnawada Kshetram, Buchireddypalem Mandal, 
SPSR District,
Andhra Pradesh, Pin code: 524305.

Popular post to download:
mahabharatam books free downloadALL TELUGU BOOKS DOWNLOADtelugu books downloadtelugu books downloadtelugu books downloadTatparya Sahitha Stotralu Telugu Book Download

ప్రసిద్ధ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

కొత్తగా చేర్చిన పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

More Books
keywords:Sri Mallikarjuna Swamy kamakshi Tayee Ammavari Devasthanam Nellore Information,Sri Mallikarjuna Swamy kamakshi Tayee Ammavari Devasthanam Nellore,Sri Mallikarjuna Swamy kamakshi Tayee Ammavari Devasthanam Nellore history,Sri Mallikarjuna Swamy kamakshi Tayee Ammavari Devasthanam Nellore contact numbers,popular places to visit in Nellore,Nellore transport,TTD ebooks download, Shri gaytri anushthan prakashini stotram PDF download, tatparya sahit stotralu PDF download,Shri Mukunda mala PDF download, pdf download,Mahabharatam books download,Telugu mahabharatam download,popular Mahabharat Telugu popular books download,

Comments