శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి|Sri subramanyeswara Swamy Devasthanam mopidevi

Sri subramanyeswara Swamy Devasthanam mopidevi

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి|Sri subramanyeswara Swamy Devasthanam mopidevi

ఆలయం గురించి

కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం.కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి లోని వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణభారత దేశం లోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గా విరాజిల్లుతోంది.

స్థల పురాణం: 

స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారం తో విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్నిసైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది.గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్నినివారించ గలిగేది అగస్త్యమహర్షి మాత్రమే నని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షి కి , విషయాన్ని వివరించారు.

యోగదృష్టి తో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీ ని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు . లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని , దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను ,శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

“ వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్య మనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.

కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి.

“ సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు.వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.

“ కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.

కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు.మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది ,గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా ఉండి , భక్తులకు కనువిందు చేస్తున్నాయి.ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

ఆలయప్రత్యేకత: 

స్వామివారి ఆలయం తూర్పుదిశ గా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగు తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు :

నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు.స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది.ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతువు ,సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ఉగాది ప్రవదినం,దసరా శమీపూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రో త్సవము విశేషంగా జరుగుతాయి.మాఘమాసం లో కళ్యాణోత్సవం, రథోత్సవం,వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.భక్తుల సౌకర్యార్ధం నిత్యాన్నదాన పథకం ఇటీవలె ప్రారంభించబడింది

Mopidevi Temple

Mopidevi Temple is known for Sarpa Dosha Nivarana Pooja,  Anapathya Dosha Pooja and Naga Pratishta Poojas.

Mopidevi Temple History

According to the Sthala Purana, Lord Subrahmanyeswara Swamy is in Swayambhu (self-manifested) Linga form at Mopidevi temple.

According to some local legends, Veeravarapu Parvathalu is a great devotee of Lord Karthikeya Swamy and is a pot maker by profession.

Lord Subrahmanyeswara Swamy was once pleased with his ardent devotion appeared in his dream and guided him to dig at the nearby anthill to uncover the Lingam.

Immediately, Pavathalu informed about his dream and took the help of villages to go to the place indicated by Lord Subrahmanyeswara Swamy in the dream.

They started to dig up the anthill and to their surprise, found the Swayambhu Lingam in the anthill. Later, Parvathalu added some more baked clay idols of great Rishis, Nandi, Garuda Horse, Cock and began to worship Swayambhu Lord Subrahmanyeswara Swamy.

Lord Subramanyeswara is the principle deity of the royal family Challapalli and are currently taking care of the temple.

Mopidevi Temple Timings

Morning Hours: 5:30 am – 1:00 pm

Evening Hours: 4:00 pm – 8:00 pm

Mopidevi Temple Poojas

Everyday Pooja

S.No Pooja Name            Persons allowed         Ticket Cost

1 Mahanyasa Rudrabhishekam            2                      Rs.516

2 Abhishekam                                    2                      Rs.60

3 Ear boring                                                      Rs.60

4 Namakaranam ( Naming Ceremony)              Rs.150

5 Aksaharabhyasam                                              Rs.150

6 Annaprasana                                                      Rs.150

7 Sarpa Dosha Nivarana Pooja                              Rs.280

8 Uyala (Cradle)                                              Rs.80

9 Palapongallu on  Gas stove                              Rs.20

10 Tonsuring                                                      Rs.10

11 Sahasranama Puja                              2                      Rs.55

12 Asttothara Namarchana                      2                      Rs.45

13 Naga Pratishta                                                    Rs.5116

14 Nithya Kalyanam                                            Rs.1116


Abhishekam will be issued over the counter from 6:00 am – 12:30 pm.

Every day at 6:30 pm, Pancha Harathi and Chaturvedi Swasthi will be offered to the Lord.


Permanent Poojas

S.No          Pooja Name                                            Ticket Cost

1           Saswatha Abhishekam – Once in a year       Rs.3500

2          Saswatha Kalyanam – Once in a year              Rs.10000

3          Saswatha Annadhana                                        Rs.111


 Regular Sevas & Darsan Timings

Temple Open Time (Morning)ఆలయం తెరుచు వేళలు(ఉదయం)

06:00 AM-01:00 PM


Temple Open Time (Evening) ఆలయం తెరుచు వేళల (సాయంత్రం)

04:00 PM - 08:00 PM


Gopooja Rs.20/-(Regular) గో పూజ టికెట్ రుసుము రూ.20/- (ప్రతి రోజు) 

06:00 AM - 11:30 AM


Ashtottara Namarchana Rs.75/- (Regular) అష్టోత్తరనామార్చన టికెట్ రుసుము రూ.75/- (ప్రతి రోజు) 

05:00 PM - 05:30 PM


Sahasra Namarchana Rs.100/-(Regular) సహస్ర నామార్చన టికెట్ రుసుము రూ.100/- (ప్రతి రోజు)

 05:30 PM - 06:00 PM


Swarna Bilvarchana Rs.100/- (Regular) స్వర్ణ బిల్వార్చన టికెట్ రుసుము రూ.100/- (ప్రతి రోజు)

06:00 PM - 06:30 PM


Vunjala Seva Rs.100/- (Regular) ఉంజల్ సేవ టికెట్ రుసుము రూ.100/- (ప్రతి రోజు) 

06:30 PM - 07:00 PM


Mahanyasa Poorvaka Rudrabhishekam Rs.516/ (Regular) మహన్యాస పూర్వక రుద్రభిషేకము టికెట్రూ.16/-(ప్రతి రోజు) 

06:00 AM - 07:00 AM


Kaala Sarpadosha Nivarana Pooja Rs.500/- (Regular) కాలసర్పదోష నివారణ పూజ టికెట్ రుసుము రూ.500/- (ప్రతి రోజు)

06:00 AM - 01:00 PM


Nitya Kalyanam Rs.1116/- (Regular) నిత్య కళ్యాణము టికెటు రుసుము రూ.1116/- (ప్రతి రోజు) 

11:00 AM - 01:00 PM


Abhishekam (At Abhisheka Mandapam) Rs.100/ (Regular) అభిషేకం (అభిషేక మండపములో) టికెట్రుసుము రూ.100/- (ప్రతి రోజు)

06:00 AM - 01:00 PM


Paroksha (Virtual) Seva Details

PAROKSHA SEVA: Mahanyasa Poorvaka Rudrabhishekam Rs.516/-(Virtual) పరోక్ష సేవ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం టికెట్ రుసుము రూ.516/ ఉదయం 6.00 నుండి 7.00 వరకు

Daily from 06:00 AM-07:00 AM


PAROKSHA SEVA: Kaala Sarpadosha Nivarana Pooja Rs.500/-(Virtual) పరోక్ష సేవ: కాల సర్పదోష నివారణ పూజ టికెట్ రుసుము రూ.500/- ఉదయం 7.00 గంటల నుండి 18.00 గంటల వరకు

Daily from 07:00 AM-08:01 AM


PAROKSHA SEVA: Abhishekam (At Abhisheka Mandapam) Rs.100/- (Virtual) పరోక్ష సేవ బయలుదేరుతారు అభిషేకం (అభిషేక మండపంలో) టికెట్ రుసుము రూ.100/- ఉదయం 8.00 గంటల నుండి 9.00గంటల వరకు 

Daily from 08.00 AM.90:00 AM


PAROKSHA SEVA: Nitya Kalyanam Rs.1116/- (Virtual) పరోక్ష సేవ: నిత్య కళ్యాణం టికెట్ రుసుము రూ.1116/ ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు 

Daily from 09:00 AM-11:00 AM

Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు

Hamsala Deevi


HamsalaDeevi is situated at 35 Kms from Mopidevi. HamsalaDeevi is a Village in Koduru Mandal in K rishna District of Andhra Pradesh State, India. It is also known as "Swan Island". Krishna River meet s Bay of Bengal outside Hamsaladeevi village. It is also known as sangara sangamam. The river Kris hna branches into two streams at Puligadda near Avanigadda.There is also an old Venugopalaswamy (Lord Krishna) temple at Hamsaladeevi.

మోపిదేవి నుండి హంసలదీవి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కోడూరు మండలంలో హంసలదీవి అను ఒక గ్రామం ఉన్నది. దీనిని "స్వాన్ ఐలండ్" అని కూడా పిలుస్తారు. పవిత్ర కృష్ణా నది హంసలదీవి ప్రాంతములో బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిని సాగర సంగమం అని కూడా పిలుస్తారు. కృష్ణా నది శాఖ లు అవనిగడ్డ సమీపంలో పులిగడ్డ వద్ద రెండు ప్రవాహాలుగా ఉన్నాయి. హంసలదీవిలో పురాతన వేణుగోపాలస్వామి ఆల యం కూడా ఉంది.


Sri Durga Nageswara Swamy Temple

Sri Durga Nageswara Swamy Temple is situated at 8 Kms from Mopidevi. Sri Durga Nageswara Swa my temple, Pedakallepalli is a very famous temple. This is called as "DHAKSHANA KASI" on account of the several similarities when compared to Banaras. The river Krishna flows here towards North as r iver Ganges flows towards North at Banaras. There is Viswanatha Swamy temple at Kasi and there is Nageswara Swamy at Pedakallepalli. The kshetrapalaka at Kasi is Sri Bindu Madava Swamy, where is Sri Venugopala swamy at Pedakallepalli. This kshetram is referred as Kadalipuri or kadali kshetram In the puranas.

మోపిదేవి నుండి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం 8 కిలో మీటర్ల దురంలో ఉంది. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం, పెడకేలేపల్లిలోని ఒక ప్రసిద్ధ ఆలయం. దీనిని "దక్షిణ కాలి" అని కూడా పిలుస్తారు. టెనారస్ వద్ద ఉత్తర దిశగా గంగా నది మ రియు గంగా నదికి ఉత్తర దిశగా కృష్ణా నది ప్రవహిస్తుంది. కాళీ వద్ద విశ్వనాథ స్వామి ఆలయం ఉంది మరియు పెదకళ్లేపల్లి వద్ద శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం ఉంది. కాశీలోని విశ్వనాధసాడు కి క్షేత్రపాలకుడిగా శ్రీ బిందు మాదవ స్వామి మరియు పెదకళ్లేపల్లిలోని దుర్గ నాగేశ్వర స్వామి వద్ద శ్రీ వేణుగోపాల స్వామి వారు కొర్రపాలకుడిగా ఉన్నారు. ఈ క్షేత్రాన్ని పురాణాల కడలిపురి లేదా కడలి క్షేత్రం అని పిలుస్తారు.

SRIKAKULESWARA SWAMY TEMPLE

SRIKAKULESWARA SWAMY TEMPLE, SEIKAKULAM(V), GHANTASALA(M) KRISHNA DISTRICT

శ్రీకాకులేశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీకాకులం గ్రామము, ఘంటశాల మండలం, కృష్ణ జిల్లా

Transport|రవాణా

By Road:

A.P.S.R.T.C busses are available from Vijayawada.Buses will be available from Vijayawada A.P.S.R.T.C Bus Stand to Avanigadda via Karakatta.Since Mopidevi is between Challapalli and Avanigadda.Devotees are requested to take Avanigadda Bus.Karakatta Route is the best route to travel from vijayawada to mopidevi temple. It's 75km from Vijayawada and from Machilipatnam, its 30km to Mopidevi Temple,

విజయవాడ నుండి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులు అందుబాటులో ఉండును. విజయవాడ నుండి 75కి. మీ., మరియు మచిలీపట్నం నుండి 30 కి.మీ. దూరంలో ఆలయం ఉంటుంది.

By Train:

Nearest Railway Station is Repalle, Guntur District and from here it takes 20 minutes to reach the Temple and The other Nearest Railway Station is Machilipatnam, Krishna District which is 32 kms from the temple

ఈ ఆలయానికి చేరువలో రేపల్లి రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుండి ఆలయానికి చేరుకోవటానికి 20 నిమిషాల సమయం పడుతుంది అలాగే ఆలయం నుండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు 32 కిమీ ల దూరం కలదు.


By Air:

Nearest Airport is Vijayawada-Garlavaram Airport and is away by 64 Km.

ఆలయం నుండి 64 కి.మీ. దూరములో విజయవాడ - గన్నవరం జాతీయ విమానాశ్రయం ఉంది.

Contact Numbers anAddress

Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam,

Mopidevi Village,

Mopidevi Mandal,

Krishna District,

Andhra Pradesh.

Pin code: 521 125.

Office: 08671-2572401

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOADTTD eBooks Free Download Bhagavad Gitapothana bhagavatam free downloadmahabharatam books free downloadLalitha SahasranamaSripathi Stuti Mala Telugu Book Downloadtelugu books download

More Books:

keywords: Sri subramanyeswara Swamy Devasthanam mopidevi Information,Sri subramanyeswara Swamy Devasthanam mopidevi,Sri subramanyeswara Swamy Devasthanam mopidevi history,Sri subramanyeswara Swamy Devasthanam mopidevi contact numbers,popular places to visit in mopidevi,mopidevi transport,mopidevi timings in temple history,mopidevi temple timings,mopidevi temple adopted places and temples,Saptagiri Telugu books download, Telugu popular books download, Bhagavad Gita Telugu PDF download,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri Lalitha sahasranama stotram PDF download,sripathi Stuti mala stotra PDF download,Sri Devi mahatyam PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS