శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం|Sri bhadrakali sametha Sri Veereswara Swamy Devasthanam.....
ఆలయం గురించి
శ్రీ వీరబద్ర స్వామిని దక్షయజ్ఞమును అడ్డుకోవడానికి శివుడు ని పుట్టిస్తాడు. దకుని మీద కోపమార్ధం ద్వారా పుట్టినటువంటి శ్రీ వీరభద్ర స్వామి దక్షుడి యొక్క యజ్ఞాన్ని అడ్డుకుంటాడు. మహా విష్ణువు యొక్క సలహాతో అతను మళ్లీ జన్మించి దక్షయజ్ఞమును విజయవంతంగా పూర్తిచేస్తాడు. య్యాం ముగిసిన తరువాత శ్రీ వీరభద్ర స్వామి తన కోపాన్ని వదిలిపెట్టలేకపోయాడు. అందుచే అతను మహోజ్వల అగ్ని కీలలతో నిండిపోయాడు. అప్పుడు శ్రీ వీరభద్ర స్వామిని శాంతింపజేయడానికి, ఋషులు మరియు దేవతలు పైకుంఠం' పెళ్లి వీరభద్రస్వామిని శాంత పరచమని శ్రీ మహా విష్ణువును వేడుకున్నారు.
వీరభద్ర స్వామిని శాంతింపజేయడానికి మహా విష్ణువు నరసింహ భగవంతుడి అవతారంలో వారి అభ్యర్ధన మేరకు వెళ్తాడు. కానీ అగ్నితో ఉన్న శ్రీ వీరబడ్డ స్వామి మహా విష్ణువుని పట్టుకున్నాడు. నరసింహ మారువేషంలో వున్న మహా విష్ణు బ్రహ్మ లోకాకు వెళ్లి వీరభద్ర స్వామిని గురించి బ్రహ్మ దేవకు సమాచారం అందిస్తారు. అప్పుడు. త్రిమూర్తులు ముగ్గురు కలసి స్వామిని తృప్తి పరిచేందుకు ఆదిపరాశక్తిని అభ్యర్ధించారు. అప్పుడు ఆమె స్వామిని శాంతపరిచేటందుకు తనలోని ఒక కళను (16 కళల్లో) భద్రకాళి పేరుతో భూమిమీదకు పంపింది. అయిన స్వామి శాంతించకపోయేసరికి ఆమె నదిలో వేమునిగి ఒక యువతిలా మారువేషములో బయటకువస్తుంది. ఆ యువతిని చూసి స్వామి శాంతింపబడతారు.
వారిరువురు గందర్వ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. మహా మునులు ఏర్పాటు చేసుకున్న ఆశ్రమాలను ముణి మండలి అని పిలుస్తారు. అదే తర్వాత కాలంలో మురమల్లగా మారింది. అప్పటినుంచి మహామునులు స్వామివారికి నిత్యము గాంధర్వ వివాహం చేయసాగిరి, అదే ఇప్పటికీ కొనసాగుతోంది.
శ్రీ స్వామివారి నిత్యకళ్యానికి భక్తులేకాక మహామునులైన అగస్త్య, కుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ట, గౌతమ, భార్గవ, మరీచుడు, కళ్ళప్పుడు, మార్కండేయుడు మరియు నారదుడు సాక్షులుగా నిలిచారు.
స్థల పురాణం
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళలో ఈ దేవాలయం ఉంది
భారద్వాజాంతర్భూత పావన వృద్ద గౌతమీ నదీతీరమందు ఉన్న మురమళ్ళ దివ్య క్షేత్రములో నిత్య కళ్యాణము పచ్చ తోరణముతో విరాజిల్లుచూ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారు ప్రత్యేక్ష దైవముగా ప్రకాశించుచున్నారు.శ్రీస్వామివారికి నిత్యకళ్యాణము జరుగు.విశేషమునకు కారణమేమనగా దక్షయజ్ఞ ధ్వంసమునకు ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్య ప్రకాశములతో ఉగ్రరూపుడై దక్షుడిని సంహరించి యజ్ఞమును ధ్వంసం చేసెను. తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయాగము పూర్తి చేయుటకు సమ్మతించి దక్షుడి మొండెమునకు మేక తలను తగిలించి దక్షుడిని బ్రతికించెను. పిదప దక్షునిచే వేదోక్తముగా యజ్ఞము పూర్తిచేయించిన తరువాత కూడా వీరభద్రు కోపాగ్నిని వీడలేదు. సతీదేవి యోగశక్తితో అగ్నిపుట్టించుకుని అందులో ఆహుతైన కారణమే శ్రీ వీరభద్రుని కోపాగ్నికి కారణమని గ్రహించిన మహామునులు, దేవతలు భయకంపితులై వీరభద్రుని శాంతింపజేయుటకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిరి. అంతట శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి శ్రీ వీరభద్రుని శాంతింపజేయుటకు ప్రయత్నించెను. నరసింహమావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినను వీరభద్రుడు శాంతించకపోవడంతో వెనువెంటనే మహావిష్ణువు నరసింహావతారంలో ఉన్న తన లీలను అచటనే వదలి వీరభద్రుని శాంతింపజేయుటకు త్రిమూర్తులందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆదిపరాశక్తి ప్రత్యక్షమై కారణమేమని అడిగెను. కోటి సూర్యులకాంతితో ఉగ్రరూపుడైన వీరభద్రుడు చూచుటకు భయంకరముగా ఉన్నందున లోకమునకు శాంతి కలగదని వీరభద్రుని శాంతింపజేయమని కోరెను అంతట ఆదిపరాశక్తి షోడశ కళలలో ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుని శాంతింపజేయుటకు భూలోకమునకు పంపెను. భద్రకాళీ అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుడు శాంతించకపోవడంతో "అశ్శరభశ్శరభ" అనుచూ భద్రకాళి అమ్మవారు కన్యారూపము దాల్చి గౌతమి నది నుండి బయటకు వచ్చి వీరభద్రుని చూచెను. అంతట వీరభద్రుడు కన్యారూపములో ఉన్న భద్రకాళిని చూసి శాంతించెను.అప్పుడు వీరిరువురికీ మునిమండలి యందు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణము జరిపి శాంతింపజేసిరి. ఈ పవిత్ర ప్రదేశమైన గౌతమి నదీ తీరమున మహామునులందరూ ఆశ్రమములు ఏర్పరచుకొనిన ప్రదేశము మునిమండలి. ప్రస్తుతము వాడుకలో ఉన్న మురమళ్ళ గ్రామం. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ వీరేశ్వర స్వామివారికి గాంధర్వ వివాహ పద్ధతితో నిత్య కళ్యాణము చేయుచుండిరి లోక ప్రసిద్ధి గాంచిన శ్రీ స్వామివారి నిత్య కళా్యాణమునకు నిత్యము అగస్త్యుడు. శుకుడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భారద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదులవారు మొదలైన ఋషీశ్వరులందరూ వేంచేచుదురని పురాణములో ఉంది. ఈ పద్ధతి ప్రకారమే నేటికీ శ్రీ స్వామి వారికి నిత్యకళ్యాణము చేయుట ఆనవాయితీగా వచ్చుచున్నది
About Temple
"Sri Veerabhadra Swamy' was born brightly to demolish Dakshayagna. After demolition of Dakshyagna with advice of Lord Maha Vishnu, he again made Daksha alive and thus Dakshayagna was successfully completed. Even after completion of Yagna, Sri Veerabhadra Swamy could not leave his anger and so he was full in fire, that was caused due to the Yoga Sakthi of Sathi Devi. To pacify Sri Veerabhadra Swamy, the saints and the devotees went to 'Vaikunta' and requested Sri Maha Vishnu to pacify Veerabhadra Swamy.
On their request, Sri Maha Vishnu went to Veerabhadra Swamy in the disguise of Narasimha to pacify Veerabhadra Swamy. But Sri Veerabhadra Swamy caught hold of Maha Vishnu tightly. Then Maha Vishnu who was in Narasimha disguise has gone to Brahma Lokam and informed Lord Brahma Deva about Veerabhadra Swamy.
Then Trimurtulu requested Adiparasakthi to pacify Veerabhadra Swamy who was in harsh stage. Then she has sent one of her KALA by name Bhadrakall (Out of 16 KALAS) on earth to pacify Veerabhadra Swamy but it was in vain. Then she was shrink in the nearby water tank and came out in the disguise of a young lady and went near Veerabhadra Swamy. After seeing her, Veerabhadra Swamy was pacified.
Then they both got married in the way of 'GANDHARVA VIVAHAM'. All the Maha Munis have erected Ashramas called Muni Mandall which was turned in the name of 'MURAMALLA' after many years. From then onwards, all the Maha Munis are performing Gandarva Vivaham to Lord Veerabhadra Swamy in the disguise of Nitya Kalyanam, which is continuing till today.
The Nitya Kalyanam of Sri Veerabhadra Swamy will be witnessed not only by the devotees but it is in vogue that Munis like Agastya, Sukudu, Viswamitra, Vasista, Gowtama, Bhargava, Vyasa, Bharadwaj, Marichidu, Kasyapudu, Markendeyudu and Narada will also witness this Kalyanam.
Regular Sevas & Darsan Timings
Morning Temple opening and clousing, ఉదయం సమయంలో 05:30 AM - 12:30 PM
Temple opening and clousing. సాయంత్రం సమయం లో
04:00 PM - 09:00 PM
నిత్య కళ్యాణం సేవ Rs/-800, Nithya Kalyanam seva(Regular) Rs/-800
05:30 PM - 09:30 PM
లఘున్యాస పూర్వక ఏకవార అభిషేకం Rs 20.(Regular) Laghunyasa purvaka ekavaraabhishekam seva Rs 20.
06:30 AM - 10:30 AM
పంచామృతాభిషేకం Rs 150.(Regular)mPanchamrutabhishekam seva Rs150
05:30 AM - 06:30 AM
సహస్ర నామ కుంకుమ పూజ Rs 20. (Regular) Sahasranama kumkuma puja Rs 20
04:30 PM - 05:30 PM
గోపూజ Rs 150.(Regular) Go puja Rs 150.
07:00 AM - 10:00 AM
రుద్ర హెూమం ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజున Rs 216.(Regular) Rudra homam Rs 216.
09:30 AM - 12:30 PM
చండీ హెూమం ప్రతినెల పౌర్ణమి తిధి రోజున Rs 216. Regular) Chandi homam Rs 216
09:30 AM -12:30 PM
లక పత్రి పూజ ప్రతినెల మాస శివరాత్రి రోజున Rs 216.(Regular) Laksha patri puja Rs 216.
10:00 AM - 03:00 PM
బ్రహ్మోత్సవ కళ్యాణం వైశాఖ శుద్ధ పంచమి Rs 1116. (Regular) Brahmotsava kalyanam Rs 1116
06:00 AM - 06:00 PM
లక్ష రుద్రాక్ష పూజ శ్రావణ మాసశివరాత్రి రోజున Rs 250. (Regular) Laksha rudraksha puja
Rs 250.
10:00 AM - 04:00 PM
ద్వాదశ పుష్కర నది జలాభిషేకం మహాశివరాత్రి రోజున Rs 200. (Regular) Dwadasha pushakara nadi jalaabhishekam Rs 200.
10:00 AN 04:00 PM
శ్రీస్వామివారి దర్శన వేళలు(12:30 నుండి04 మూసివేయబడును)
05:30 AM-09:00 PM
Paroksha (Virtual) Seva Details
పరోక్ష సేవ శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం.(Virtual)
Panchamrutaabhishekam Rs 150
Daily from 05:30 AM-06:30AM
పరోక్ష నిత్యకల్యాణం సేవ Rs 800. (Virtual) Parokshanityakalyanam seva Rs 800.
Daily from 05:30 PM-09:00 PM
పరోక్ష సేవ గోపూజ Rs 116(Virtual) Paroksha Go puja Rs 116
Daily from 07:00 AM-10:30 AM
పరోక్ష చండీ హెూమం ప్రతి నెల పౌర్ణమి తిధికి Rs 216 (Virtual) Paroksha chandi homam Rs 216
Every undefined from 09:30 AM-12:30 PM
పరోక్ష రుద్ర హెూమం ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున Rs 216(Virtual) Paroksha rudra homam Rs 216
Every undefined from 09:30 AM-12:30 PM
పరోక్ష లక్షపత్రి పూజ ప్రతి నెల మాస శివరాత్రికి Rs 216(Virtual) Paroksha palsha patri puja Rs 216
Every undefined from 10:00 AM-03:00 PM
Places To Visit|సందర్శించవలసిన ప్రదేశాలు
Sri Vigneswara Swamy Temple
Sri Vigneswara Swamy Vari Devastanam, Ainavilli is located 22kms away from the muramu lla village, the presiding deity of sri vigneswara swamy temple is Siddhi Vinayaka Swamy, t here are also other shrines which have been installed and are situated in this temple premi ses. There is a shrine of Annapurna Devi along with Sri Vishveshwara Swamy which faces east. To the right side of this shrine is the shrine of Sri Keshava Swamy along with his cons ort Sri Bhoo Devi. To the left side of Annapurna Devi along with Sri Vishveshwara Swamy s hrine, there is a shrine of Sri Annapurna Devi which faces south. In the northeast corner of the temple, there is a shrine of Sri Kala Bhairava Swamy which faces east, and is the Kshe tra Palaka.
శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం, అయినవిల్లి, మురమళ్ళ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరములో ఉంది. విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన దేవుడు సిద్ధి వినాయకుడు, ఈ దేవాలయములో ఇతర చిన్న ఆల యాలు మరియు విగ్రహాలు కూడా ఉన్నాయి. తూర్పు ముఖంగా ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి తో పాటు అన్న పూర్ణ దేవి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి కుడి వైపున శ్రీ కేశవ స్వామి మరియు సతిమణి శ్రీ భూదేవి తో క లిసి ఉంది. ఈ ఆలయం యొక్క ఈశాన్య భాగంలో, తూర్పు ముఖంగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంది మ రియు ఈ కాలభైరవుడు ఆలయానికి క్షేత్రపాలకుడు...
Sri Kalyana Venkateswara Swamy Temple
Sri Kalyana Venkateswara Swamy temple is one of the famous temples In Amalapuram whi ch is also known as Panchalingapuram, as it is the place of five famous Shiva temples nam ely Sri Amaleswara Swamy, Sri Sidheswara Swamy, Sri Ramalingeswara Swamy, Sri Chand ramouleeswara Swamy and Sri Chennamalleswara Swamy, Amalapuram is also famous as the Head of Konaseema which is known for its scenic beauty of nature.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అమలాపురంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి, ఇది పంచ లింగాపురంగా కూడా పిలువబడుతుంది. శ్రీ అమలేశ్వర స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళేశ్వరస్వామి మరియు శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వంటి ఐదు శివ దేవాలయాలు కూడా ఈ దేవాల యానికి చుట్టూ ప్రక్కలా ఉంటాయి. అమలాపురం ప్రకృతికి ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది.
Sri Balabalaji Temple
Sri Bala balaji temple is located in historical place Appanapalli and Appanapalli is 32 kilome ters far away from Muramalla village. The vigraha prathishta of Sri Bala Balaji Swamy in th e newly constructed temple was performed by the holy hands of Sri Tridandi Shrimannaray ana chinna jeeyer Swamiji Brahmosthavams are being celebrated from 'jyesta suddha Das ami' to 'jyesta suddha Chathurdhasi' every year
శ్రీ బాల బాలాజీ ఆలయం మురమళ్ళ గ్రామం నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రదేశం అయిన టువంటి అప్పనపల్లి లో ఉంది. కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీ బాల బాలాజీ స్వామి యొక్క విగ్రహం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామిజీ చేతుల మీదుగా ప్రతిష్టింపబడింది. స్వామి వారి యొక్క ట్ర హ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ' జ్యేష్ఠ శుద్ధ దశమి' నుండి ' జ్యేష్ఠ శుద్ధ చతుర్ది' వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.....
Transport|రవాణా
By Road:
Muramalla village is 37 kms from Kakinada, From Amalapuram it is about 23 kms and from Rajahmundry it is about 75 kms.
Distance From;
Hyderabad 550km
Kakinada 40km
Amalapuram 20km
Visakhapatnam 200km
Vijayawada 220km
మురమళ్ళ గ్రామం కాకినాడ నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమలాపురం నుండి 23 కిలోమీటర్లు మరియు రాజమండ్రి నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది
Popular post to download:
More Books:
keywords:Sri bhadrakali sametha Sri Veereswara Swamy Devasthanam Muramalla Information,Sri bhadrakali sametha Sri Veereswara Swamy Devasthanam Muramalla,Sri bhadrakali sametha Sri Veereswara Swamy Devasthanam Muramalla history,Sri bhadrakali sametha Sri Veereswara Swamy Devasthanam Muramalla contact numbers,popular places to visit in Muramalla,Muramalla transport,Sri bhadrakali sametha Sri Veereswara Swamy Devasthanam Muramalla,temple history Muramalla temple timings,Muramalla temple adopted places and temples,Telugu popular books download, ,bhagavatam PDF download,Mahabharat PDF download,Sri mukundamala PDF download,shiva Mahapuran PDF download,mukapanchasathi pdf download,sri Gayatri anushthan prakashika PDF download