మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము|Mahishasuramardini Sthotralu Telugu Books Download
మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము
నాకు బాగా నచ్చింది. మేము యువభారతి సంస్థ ద్వారా ఎన్నో పుస్తకాలు లోగడ ముద్రించి పాఠకులకు అందజేశాము. పుస్తక ప్రచురణ రంగంలో మాకు సరిపడినంత అనుభవం ఉంది. మీరు గనక మహిషాసుర మర్దినీ స్తోత్రానికి మీ పద్ధతిలో వివరణ వ్రాసి ఇస్తే ప్రచురించాలని ఉంది" అని విశ్వనాథంగారు అన్నారు. అలా అంటూనే “లక్ష ప్రతులు మా లక్ష్యం" అన్నారు. "లక్ష్యం బాగానే ఉంది లక్షలు ఖర్చుపెట్టాల్సి వుంటుంది" అన్నాను నేను. "ఆ లక్ష్యాన్ని మాకు వదిలివెయ్యండి, మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చండి” అన్నారు ఆయన. ఇలాంటి పనులకు పూర్తిగా అమ్మవారి అనుగ్రహంపైనే ఆధారపడ్డనేను - "అలాగే, అయితే మే నెలనుండి గాని ఆ పనిని ప్రారంభించలేను అన్నాను". "ఫర్వాలేదు 2002 అక్టోబర్ నెలలో వచ్చే దసరాల్లో పుస్తకం ఆవిష్కరణ అయ్యేటట్లుగా మాకిస్తేచాలు", అయితే ఒక్క చిన్నకోరిక - పుస్తకంలో ఎక్కడో ఒక చోట ఈ పుస్తకం' మా నాన్నగారికి అంకితం ఇస్తున్నట్లు తెలియపరచాలి" అన్నారు. ఆయన కోరికను నేను కాదనకుండా ఒప్పుకున్నాను.