దేవి మహత్యము శ్రీ చండీ నవశతి మంత్రమాల|Devi Mahathyam Chendi Navashathi Telugu Book Download
బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీశ్రీశ్రీ గోపానంద నాథుల చరణ కమలములకు
నమస్కారములు.
శ్రీ విద్యా ప్రచారము నందగ్రగణ్యులగు తమచే ప్రకటింపబడు "శ్రీ దేవీ మాహా త్మ్యము శ్రీ చండీ నవశతీ మంత్రమాలా" యను గ్రంధము నామూలగ్రము పతించి ఆనందము చెందితిని,
ఇతః పూర్వము చండీ సప్తశతియను పేరున వాడుకలో ఉన్న గ్రంధరాజ సాహాయ్య మున నవ రాత్రుల యందు. పారాయణ హోమాదులయందు ప్రయుక్త మగుట లోక విదితము.
సప్త సంఖ్య పూర్ణము కానేరదు. అయినప్పటికి అయ్యది షట్చక్రములు - సహ స్రారమునుకు చిహ్నము కావచ్చును. నవ సంఖ్య పరిపూర్ణము. అటులనే నవరాత్రులు, శ్రీ విద్యను లోకమునందధిక సంఖ్యాకులు "స్త్రీ విద్యగా" భావింతురు. ↓ విద్యయనగా బ్రజ్మా విద్య. ఈ విద్యోపాసన సిద్ధి బడయవలయునన్న, అష్టాంగ యోగములనుష్టించి, కుండలినీ శక్తిని జాగృతము చేసిన సహస్రారమునందు శ్రీ దేవీ దర్శనభాగ్యము, తద్వారా మోక్ష సామ్రాజ్యము సాధకుడు తప్పక పొందగలడు.
త్రికరణ శుద్ధిగా జన్మరాహిత్యము నందగోరు జిజ్ఞాసువులకు శ్రీ విద్యోపాసన తప్ప వేరు మార్గము నిర్దేశింపబడలేదు. జిజ్ఞాసువులకు పండితులకు, ఆలోటు తీర్చుటకునై .ఈ నవశతీ మంత్రమాల తప్పక దోడుపడునని నా ప్రగాఢ విశ్వాసము.
భక్తుల కొరకు శ్రీ దేవీజయమాలా, అపరాథస్తవము, ఫలశృతి అనుబంధముగ చేర్చిం ఎంతేని ముదావహము. ఈ గ్రంధరాజము త్వరలో వ్యాప్తి చెంది ప్రజలను సర్వశక్తిమంతులుగా తీర్చిదిద్దు గాక.
"యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా"