వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృతబండాగారాన్ని మన తెలుగులు అందరికీ అందించారు. సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. అలాగే, ఇంత సమగ్రంగా తెలుగులోనే కాదు దేశభాషల్లో అంతర్జాలంలో అందించిన మొట్టమొదటి గ్రంథంగా మన "తెలుగు భాగవతానికే" ఆ ఘనత దక్కింది. "పలికెడిది భాగవతమట నే పలికిన భవహార మగునట" అని తన వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు . మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం; రండి రండి: ఆస్వాదించండి.
POTANA BHAGAVATAM Vol-2 : పోతన తెలుగు భాగవతము
Related Books: