శ్రీరామనవమి విశిష్టత.. పూజా విధానం|Sri Rama Navami 2023 Date Significance And Puja Vidhanam

Sri Rama Navami 2023 Date Significance And Puja Vidhanam

శ్రీరామనవమి విశిష్టత.. పూజా విధానం

తేదీ 30.03.2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి గురువారం శ్రీరామనవమి 

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు.

శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి?

చైత్రమాసమున శుక్లపక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన శ్రీరామచంద్రుడు అవతరించెను. కావున ఆరోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించాలి. పురాణమును పఠించి (చదివి) జాగరణము చేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు నెరవేర్చుకున్న తరువాత తన శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించాలి. పాయసముతో అన్నము చేసి పెద్దవారిని, బంధువులను తృప్తిపరిచి, గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యాపుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింప చేయవలెను.

ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపములు అన్ని నశించును. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకములందు భోగమును మోక్షమును కలిగించునది. కావున మహాపాపి అయిననూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్నీ జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభిరాముడగు శ్రీరాముని వలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును.

శ్రీరామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటికంటే ఉత్తమమైన ఈ వ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలము కాదు. కావున ఈ వ్రతము ఒకసారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహా పాపములు అన్నియూ తొలగి కృతార్థులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ (బొమ్మ)కు పూజావిధానముచేత ఆచరించువాడు ముక్తుడు అగును.

Popular post to download:

lord rama ttd ebooks free downloadlord rama ttd ebooks free download

More Books:

 keywords :Srirama Navami 2023, ramnavami,birthday of lord Rama,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS