Bhishma Ekadashi : మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక దీనికి 'భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు.
Bhishma Ekadashi 2023 : భీష్మ ఏకాదశికి మాఘమాసంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇది 2023లో ఫిబ్రవరి 2వ తేదీన వచ్చింది. మరి రోజుకు ఎందుకింత ప్రత్యేకత ఉంది.ఏకాదశి రోజున గోపూజ సకల ఫల దాయకం. గోమాతకు అరటిపండ్లు అందిస్తే అన్నిదోషాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ఉవాచ...
భీష్మాష్టమి విశిష్టత
మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేక స్థానమున్నది. భీష్మాచార్యులవారు ఈ సృష్టికి విష్ణు సహస్ర నామాన్ని అందించినటువంటి ఆచార్యులు. భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టగలడు. ఈమేరకు ఉత్తరాయణం కోసం వేచిచూచి తన ప్రాణమును త్యాగం చేసినటువంటి యోధుడు భీష్మాచార్యులు వారు. మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత, సూర్యుడు తన గతిని మార్చుకునేటువంటి రథసప్తమి వరకు ఆగి, ఆ రథసస్తమి పూర్తి అయిన తరువాత మాఘ మాస శుక్ల పక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి రోజు భీష్మాష్టమి.
భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి తల్లిదండ్రులకు, విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదలాలి. భీష్మాష్టమి రోజు గంగాస్నానం లేదా పుణ్యనదీ స్నానం ఆచరించడం, అలాగే నువ్వులను, అన్నమును దానము చేయడం చాలా విశేషం.
భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘ మాస పుణ్య నదీ స్నానాలు ఆచరించి, మహా విష్ణువును పూజించినవారికి, ఈ మూడు రోజులు విష్ణు సహస్రసామా పారాయణ చేసిన వారికి భీష్మాచార్యులు ఆశీస్సులు, మహావిష్ణువు అనుగ్రహం కలిగి వారికి పాపములు తొలగి, విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Vishnu Sahasranamam :
మాఘమాసం శుక్ల పక్షం ఏకాదశి మాఘమాసం ఎంతో పవిత్రమయినది. ఈరోజున భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజునే విష్ణు సహస్ర నామాలు పుట్టాయని.. అంపశయ్య మీదున్న భీష్ముడు పాండవులకు ఈ విష్ణు సహస్రనామాలను భోధించారని.. అందుకనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి.
More Books
keywords:Bhishma Pitamah jayanti,Bhishma Ashtami, Bhishma, Bhishma Ashtami 2023 date,