తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 2023- టిక్కెట్ల ధర, కోటా మరియు బుకింగ్ వివరాలు | Tirumala Vaikuntha Ekadashi Dwara Darshan 2023 Booking Details

Tirumala Vaikuntha Ekadashi Dwara Darshan 2023 Booking Details

శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

తిరుమల వైకుంట ద్వారం జనవరి 2023లో తెరవబడుతుంది.

వైకుంట ద్వారం జనవరి 2వ తేదీ, ఉదయం 3:00 గంటల నుండి జనవరి 11వ తేదీ వరకు, 11:59pm వరకు తెరవబడుతుంది.

వైకుంఠ ఏకాదశి జనవరి 2న రావడంతో 2023లో వచ్చే కొత్త సంవత్సరం జనవరి 2 నుంచి 11 వరకు భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం లేదా ఉత్తర ద్వార దర్శనాన్ని పది రోజుల పాటు తెరవాలని టీటీడీ నిర్ణయించింది. జనవరి 2, 2023న వైకుంఠ ఏకాదశిని, మరుసటి రోజు వైకుంఠ ద్వాదశిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. శీఘ్ర దర్శనం కోసం ఒక్కొక్కటి రూ. 300 ధరతో 25,000 టిక్కెట్లను టిటిడి జారీ చేస్తుంది, అయితే మొత్తం 10 రోజుల పాటు ప్రతి రోజు 50,000 ఉచిత సర్వ దర్శనం (SSD) టిక్కెట్లు జారీ చేయబడతాయి.

జనవరి 1 నుంచి మూడు షిఫ్టుల్లో టిక్కెట్లు జారీ చేయనున్నారు.మొత్తం 2.50 లక్షల ఎస్‌ఈడీ టిక్కెట్లు, 5 లక్షల ఎస్‌ఎస్‌డీ టోకెన్లను భక్తులకు అందజేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఆఫ్‌లైన్ SSD టోకెన్‌లు తిరుపతిలోని కౌంటర్లలో జనవరి 1 నుండి ఐదు లక్షల కోటా పూర్తయ్యే వరకు 24 గంటలు జారీ చేయబడతాయి.

ప్రయోగాత్మకంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం కానుండడంతో సాధారణ యాత్రికులు దర్శనం కోసం వేచి ఉండకుండా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. తాపడం పనుల కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని వినియోగిస్తాం. బంగారు తాపడం పనుల కోసం 1957-58 సంవత్సరంలో టీటీడీ అనుసరించిన విధానాన్నే అనుసరిస్తాం.

– అలిపిరి వద్ద స్పిరిచువల్ సిటీ నిర్మాణ పనులకు డిజైన్లు ఖరారు చేశాం. త్వరలో మొదటి దశ టెండర్లను పిలవడం జరుగుతుంది.

– టిటిడిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఈఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. వచ్చే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సమర్పిస్తారు.

– భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని నందకం విశ్రాంతి గృహంలో మంచాలు తదితర ఫర్నీచర్‌ కొనుగోలుకు రూ.2.95 కోట్లు మంజూరు.

– తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణానికి రూ.9.05 కోట్లతో టెండరుకు ఆమోదం.

– తిరుమల బాలాజి నగర్‌ ప్రాంతంలో అంతర్గత రోడ్లు, పార్కింగ్‌ ప్రదేశం, మురుగుకాల్వల నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరు.

– తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్ద గదుల ఆధునీకరణ ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.3.80 కోట్లు మంజూరు.

– ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను రాష్ట్ర రైతు సాధికార సంస్థ సహకారంతో ఎపి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ఆమోదం.

– జమ్మూలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి పనులు, వసతులు కల్పించేందుకు గాను 10 రకాల పనులను రూ.7 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం.

– తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో బాలుర హాస్టల్‌ భవనంలో అదనపు అంతస్తు నిర్మాణానికి రూ.3.35 కోట్లు మంజూరు.

– టిటిడి ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు గాను మందుల కొనుగోలుకు రూ.2.56 కోట్లు, సర్జికల్‌ సామగ్రి కొనుగోలుకు రూ.36 లక్షలు మంజూరు.

– తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.3.75 కోట్లు మంజూరు.

– టిటిడిలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 2022 శ్రీవారి బ్రహ్మోత్సవ బహుమానం చెల్లింపునకు ఆమోదం. టిటిడిలో 7 వేల మంది రెగ్యులర్‌, 14 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు.

రెగ్యులర్‌ ఉద్యోగులకు – 14000/-

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు – 6850/-.

అనంతరం టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో లడ్డు కౌంటర్లలో ఇటీవల తలెత్తిన సమస్య గురించి సుదీర్ఘంగా వివరించారు. ప్రస్తుతానికి లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవని మరో పది రోజుల్లో నూతన సిబ్బంది ద్వారా లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తామని తెలిపారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS