డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు
– నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టిటిడి తెలియజేసింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముంది.
నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభం
శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
SRIVANI OFFLINE COUNTER TO BE OPENED ON NOVEMBER 30 IN TIRUPATI
ACCOMMODATION FOR SRIVANI AT MADHAVAM
As per the decision by the TTD Trust Board during the previous board meeting, the VIP break darshan timings will shift to 8am from December 1 onwards.
This decision has been taken keeping the larger interests of common devotees to avoid long waiting hours for Darshan.
SRIVANI OFFLINE IN TIRUPATI ONLY
Henceforth SRIVANI tickets in off-line will be issued in Tirupati only. The TTD shifted the offline counter to Madhavam Rest House in Tirupati. The SRIVANI ticket holders shall book accommodation in Madhavam Rest House subject to availability. The Madhavam counter for issuing offline tickets for SRIVANI will be opened on November 30 by 10am.
Devotees are requested to know about these amendments and book their darshan and accommodation accordingly and co-operate with the TTD Management.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI