శ్రీ నరసింహ ఈరణ్ణ స్వామి వారి దేవస్థానం,ఉరుకుంద|Sri Narasimha Eranna Swamy Vari Devasthanam,urukunda

Sri Narasimha Eranna Swamy Vari Devasthanam,urukunda

శ్రీ నరసింహ ఈరణ్ణ  స్వామి వారి దేవస్థానం,ఉరుకుంద|Sri Narasimha Eranna Swamy Vari Devasthanam,urukunda

తెలుగు లో ఆలయ వివరణము 

ఉరుకుంద ఈరణ్ణస్వామి

ఉరుకుంద ఈరణ్ణస్వామి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ యోగులు. వీరు 1625 - 1685 మధ్య కాలంలో యోగ, భక్తి, వేదాంత, వైద్య, జ్యోతిష, వాస్తు శాస్త్రాల ద్వారా సామాన్య జనానికి సేవలు చేస్తూ సమసమాజ నిర్మాణానికి నడుం బింగించిన ఆధ్యాత్మిక గురువు. ఈరణ్ణ స్వామి శిష్యులు, అనుయాయులు అధికంగా శాంత స్వభావులు. ఈరణ్ణ వేష భాషలు శాంతికి విరక్తికి సంకేతాలు. ఐతే మిమతీయుల దౌర్జన్యాలు మితిమీరినపుడు ఈరణ్ణ తన తన శిష్యులను అనుయాయులను ఆ దుర్జనుల తలపండ్లు తరగడానికి పురికొల్పినాడు. ఆయన ముందుగా యోగి, కుండలినీ సాధనలో అణమాద్యష్టసిద్ధులు గడించాడు. తరువాత విరాగియైనాడు. కర్నూలు సమీపాన ఆదోని సమీపాన గల కౌతాళానికి చేరువగల ఉరుకుంద పొలిమేరలోని రావిచెట్టు నీడ ఆ శైవయోగికి సాధనా కేంద్రం. అదే ఆయన సమాధిస్థలం.

స్వామి వారి చరిత్ర

క్రీశ.1610లో కౌతాళం గ్రామంలో హిరణ్యులు అనే స్వామి జన్మించారు. తన 12వ ఏటా ఆవులు మేపడానికి స్వామి ఉరుకుంద ప్రాంతానికి వచ్చాడు. ఆవులు గడ్డి మేస్తున్న సమయంలో హిరణ్యులు రావిచెట్టు కింద మౌనంగా కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో ఆ దారిని వెళుతున్న ఒక సిద్ధుడు హిరణ్యుల వద్దకు వచ్చి గురుబోధన చేశారు. దైవధ్యానం చేస్తూ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపమని సిద్ధుడు హిరణ్యులను ఆశీర్వాదించారు. అప్పటినుంచి బాలబ్రహ్మచారిగా స్వామివారు అశ్వద్ధ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తూ సమాధి ముద్రలో లక్ష్మీనరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారు. కాలక్రమంలో హిరణ్యులు తపస్సు చేసిన అశ్వద్ధ వృక్షం కిందనే ఉరుకుంద ఈరన్నస్వామి సన్నిధి ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తూ వచ్చారు. 1660లో ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రం వ్యాప్తి చెందింది. 1768లో భక్తులు స్వామివారికి దేవాలయాన్ని నిర్మించారు. 1995లో ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మాణ కార్యక్రమం 10 సంవత్సరాలపాటు సాగింది. నేడు ఉరుకుంద మహామాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. స్వామివారి ఆదాయం అంచలంచెలుగా పెరుగుతూ వస్తోంది.

ఈరణ్ణ క్షేత్రం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వీరన్నగా ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం ఉరుకుంద ఆదోనికి ౩౦ కిలోమీటర్ల దూరంలో ఉంది. . ఇక్కడికి రావాలంటే ఆదోని నుండి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యము ఉంది. అలాగే ఎమ్మిగనూరు నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యము ఉంది.ప్రతి ఏటా శ్రావణ మాసం స్వామి వారికి ఉత్సవాలు జరుగును.[1] స్వామి వారిని స్మరించి దర్శించిన కోరిన కోర్కెలు తీరును. పలికే దేవుడిగా స్వామి వారు ప్రసిద్ధిచెందారు. వారంలో సోమవారం, గురువారం స్వామి వారికి అంత్యంత ఇష్టమైనవి, అమావాస్య కూడా స్వామి వారికి చాల ఇష్టం.

ఉరుకుంద ఈరన్నస్వామి కొలిచిన వారికి కొంగు బంగారం. కోరిన వెంటనే భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా స్వామికి పేరు. వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది ఉరుకుంద ఈరన్న క్షేత్రం. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామం సమీపంలో ఉరుకుంద ఈరన్న క్షేత్రం నెలకొంది. ఉరుకుంద ఈరన్న స్వామిని ఈ ప్రాంతం ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ఇంటి దేవుడిగా పూజిస్తున్నారు. కోర్కెలు తీరిన అనంతరం భక్తులు తమ పిల్లలకు ఉరుకుందు, ఉరుకుందప్ప, ఈరన్న, అశ్వర్థప్ప అన్న స్వామి పేర్లు పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దాదాపు నెల రోజుల పాటు స్వామి వారికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమ, గురువారాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. శ్రావణ మాసం 3వ సోమవారం 30 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ ఒక్కరోజే స్వామివారికి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.

స్వామివారి మహిమలు

ఉరుకుంద ఈరన్నస్వామిని కొలవనివారు స్వామికి భక్తులు కొట్టిన కొబ్బరి తినాలంటేనే భయపడుతారు. కొబ్బరి తింటే ఈరన్నస్వామి వదలడని, కొలిచి తీరాల్సిందేనని, అందువల్ల ఆ స్వామిని నిప్పులాంటి దేవుడు అని భక్తులు విశ్వసిస్తారు. ఉరుకుంద ఈరన్నస్వామిని ఒక్క హిందూవులే కాకుండా ముస్లింలు సైతం కొలుస్తారు. ఇక్కడ ముస్లింలు సైతం స్వామివారికి పూజలు చేయడం మనం చూడవచ్చు. శ్రావణమాస ఉత్సవాల్లో ఇతర మతస్థులు కూడా కొబ్బరికాయలు ఇచ్చి పంపుతుంటారు. అందువల్ల స్వామిని మతసామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. గతంలో స్వామివారి క్షేత్రంలో భక్తులు నిద్రించడానికి వీలులేకుండా రాళ్లు వచ్చి పడేవని వృద్ధులు నేటికి చెబుతుంటారు. అందువలన అప్పట్లో ఉదయం పూట స్వామిని దర్శించుకుని చీకటి పడుతుండగానే ఇంటిదారి పట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఉరుకుంద ఈరన్నస్వామిగా పిలువబడుతున్న హిరణ్యులు అశ్వద్ధ్థవృక్షం కింద కూర్చోని ధ్యానం చేసి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పొందినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నారు. అందుకే భక్తులు నేటికీ స్వామికి ప్రతీకగా నిలిచిన అశ్వద్ధవృక్షానికి పూజలు చేస్తుంటారు. ఈ క్షేత్రంలోని అశ్వద్ధ వృక్షం ఏళ్లనాటిదని చెబుతుంటారు. వందల సంవత్సరాలైన అశ్వద్ధ్థ వృక్షం చెక్కుచెదరకుండా ఉంది. స్వామికి నిర్వహించే శ్రావణమాస ఉత్సవాలకు ఒక ప్రత్యేకం ఉంది. స్వామివారిని కొలిచే లక్షలాది మంది భక్తులు శ్రావణమాసాల్లో ఇండ్లు శుభ్రం చేసుకుని శ్రావణమాస ఉత్సవాలు ముగిసేంత వరకు మాంసాహారాన్ని ముట్టరు. మద్యం సేవించరు. స్వామి పట్ల అంచంచల భక్తి విశ్వాసాలతోనే భక్తులు మాంసం, మద్యానికి ఈ మాసం దూరంగా ఉంటుంటారు. శ్రావణమాస ఉత్సవాల్లోనే గాకుండా ప్రతి సోమ, గురువారాల్లో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకుంటుంటారు.

ఉరుకుంద క్షేత్రంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి కర్నూలు జిల్లా నుంచే గాకుండా పొరుగున ఉన్న అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు.

English Information About Temple

Urukunda' Village is situated for (Urukunda Eranna Swamy) in Kowthalam Mandalam, Kurnool District. He is the most powerful God. There was a sage named Hiranya (popularly called as Eranna or Veeranna In these areas) who did penance for many years under a Peepal tree in Urukunda village. All the cows that grazed in the village used to flock around him and he spent a lot of time pampering and talking to them. The villagers brought fruits and food to him and sought his blessings. Sage Eranna helped to cure chronic diseases and Ailments of these kind villagers.


One day, Sage Veeranna disappeared from his usual place under the Peepal tree. At about the same time, an idol of Sri Lakshmi Narasimha appeared below the tree. The villagers believed that the sage had appeared before them again as Narasimha Swamy. They placed the idol of Sri Lakshmi Narasimha under the Peepal tree and started worshipping him.


They also wanted to place an idol of Sage Veeranna alongside the Lakshmi Narasimha Swamy for worship. Since Sage Veeranna had been like a guardian angel of the village, (Kshetrapalaka), they made a silver idol of him represented as Sri Veerabadra Swamy and installed it next to the idol of Sri Lakshmi Narasimha.


There is also another version of the story, that Sage Eranna used to advocate a lot for Salva-Vaishnava unity, and after he disappeared two idols Veerabadra and Lakshmi Narasimhaswamy were found below the Peepal tree and the villagers started worshipping them together within the same Sanctum Sanctorum. Both Veerabadraswamy and Lakshmi Narasimha are worshipped as per the Veera Salva tradition to date.

Regular Sevas & Darsan Timings

| Sri Swamy Vari Binde Seva / శ్రీ స్వామి వారి బిందె సేవా

04:30 AM-05:00 AM

| Sri Swamy Vari Abishekam / శ్రీ స్వామి వారి అభిషేకం |

 05:00 AM-05:30 AM

Sri Swamy Vari Mahamangala Harathulu and Mantra | Pushpamu /శ్రీ స్వామి వారి మహామంగళ హారతులు మరియు మంత్రపుష్పము

05:30 AM-06:00 AM |

Allarshanam / సర్వదర్శనములు

06:00 AM - 11:30 AM 

Sri Swamy Vari Madhyanakala Maha Nivedyam / శ్రీ స్వామి వారి మధ్యానకాల మహా నైవేద్యం 

11:30 AM - 11:59 AM

| All Darshanams / సర్వదర్శనములు

 12:00 PM 07:00 PM

Sri Swamy Vari Binde Seva / శ్రీ స్వామి వారి బిందె సేవా 

07:01 PM 07:20 PM

Sri Swamy Varj Mahamangala Harathulu and Mantra | Pushpam | స్వామి వారి మహామంగళ హారతులు మరియు మంత్రపుష్పము

07:30 PM 08:00 PM

Abishekam (Regular) /  అభిషేకం(రెగ్యులర్) Rs.250/

08:00 AM-11:00 AM 

Astotharam (Regular) / అష్టోత్తరం(రెగ్యులర్) Rs.50/

06:00 AM-07:00 PM

Aaku Pooja (Regular)/ఆకు పూజ(రెగ్యులర్) Rs. 25/

06:00 AM - 07:00 PM

Mahamangala Harathi (regular)/ మహామంగళ హారతి రెగ్యులర్) Rs.50/ 

05:30 AM-06:00 AM

Harathi (Regular)/హారతి(రెగ్యులర్) Rs.5/ 

06:00 AM - 07:00 PM

Nivedyam/Janiyaram (Regular)/నైవేద్యం/జనివారం(రెగ్యులర్) Rs.5/

 06:00 AM 07:00 PM 

Prakarothsava Seva (Regular)/ప్రకారోత్సవ సేవ (రెగ్యులర్) Rs.400/

06:00 PM - 06:30 PM

Four Wheeler Vehicle Pooja (Regular)/భారి వాహనము పూజ (రెగ్యులర్) Rs.100/

06:00 AM-06:30 PM

Two Wheeler Vehicle Pooja (Regular)/వాహనము పూజ

(రెగ్యులర్) Rs.25/

06:00 AM-06:30 PM

Kalyanavastram Pooja (Regular/కళ్యాణవస్త్రం పూజ రెగ్యులర్) Rs.50/

06:00 AM-07:00 PM


Paroksha (Virtual) Seva Details

Paroksha Seva Abishekam(Virtual)/పరోక్ష సేవా అభిషేకం (వర్చువల్) Rs.250/ 

Daily from 06:00 AM-11:00 AM


Paroksha Seva Astotharam(Virtual)/పరోక్ష సేవ అష్టోత్తరం(వర్చువల్) Rs.50/

 Daily from 06:00 AM-11:00 AM


Places To Visit

Sree Raghavendra Swamy Mutt, Mantralayam

Antralaya is one of the important pilgrimage centers in South India as it houses the origina I samadhi of the great Vaishnava saint Sri Raghavendra. Sri Ragahavendra selected Mantra laya for his Jeeva Samadhi. Devotees visit Mantralaya to have the darshan of the Brindava n of Sri Raghavendra. The mutt is situated on the banks of river Tungabhadra in the state of Andhra Pradesh bordering Karnataka.

For sevas, you need to make a booking at the temple office by 8 AM. Most popular is the "Sankalpa Seva". Aradhana at Mantralaya is very popular and numerous devotes reach Ma ntralaya at the time of Aradhana. Temple also serves free meals as Prasadam to all devote es visiting Mantralaya.


Sree Mahayogi Lakshmamma Avva Devasthanam, Adoni

The Samadhi is built in an underground chamber and a gold idol of Lakshmamma Avva is p laced over it in the Sanctum Sanctorum. The beautifully decorated and bejewelled idol is a delight to watch. What was most endearing is that the idol was decorated with a saree ma de from pomegranate seeds. During her life. Lakshmamma Avva had considered even clot her as a burden. It was ironical to see her gold idol with so much finery. However, the dev otees were showing their deep love, gratitude and devotion to Avva by decorating her to th eir pleasure.

Even today, several hundreds of devotees throng her samadhi every day, seeking blessings and offering gratitude for prayers answered. The environment in the temple is calms and so othing amidst the glaring marble tiles. Some people also go into the underground samadhi and meditata in peace in front of Avva


Transport


By Road:

Urukunda is well connected by A.P.S.R.T.C.Buses not only from all corners of the State but also from Kamataka Transport Corporation is also running buses from various main cities of that state.

1.The Nearest Bustand is Adoni which is 28kms from Urukunda.

2.The Nearest Bustand is Yemmiganur which is 44kms from Urukunda.

3.The Nearest Bustand is Raichur (Karnataka) which is 67kms from Urukunda.

4.The Nearest Bustand is Siruguppa (Kamataka) which is 55kms from Urukunda.


By Train:

1.The nearest Railway Station is Kuppagal, which is 12 K.M. from Urukunda from where buses are available to Urukunda.

2.The nearest Railway Station is Adoni which is 28kms from Urukunda.


By Air:

1.The nearest Airport is Rajiv Gandhi International Airport, Hyderabad (330 K.M.) from where buses are available to Urukunda everyday frequently,

2.The nearest Bellary Airport (IATA: BEP, ICAO: VOBI) is an airport serving Bellary Bellary (100kms) from where buses are available to Urukunda everyday frequently.


Contact Numbers and information

Sri Narasimha Eranna Swamy Vari Devasthanam,

Urukunda(V), Kowthalam(M),

Kurnool District.

Andhra Pradesh-518 344.

Office Land Phone: 08512-258083

Popular post to download:

sapthagri books Free DownloadALL TELUGU BOOKS DOWNLOAD

TTD eBooks Free Download Bhagavad Gita

telugu books downloadtelugu books download
telugu books downloadtelugu books download

More Books:

keywords: Sri Narasimha Eranna Swamy Vari Devasthanam urukunda Information,Sri Narasimha Eranna Swamy Vari Devasthanam urukunda ,Sri Narasimha Eranna Swamy Vari Devasthanam urukunda history,Sri Narasimha Eranna Swamy Vari Devasthanam urukunda contact numbers,popular places to visit in urukunda,urukunda ,transport,urukunda timings in Sri Narasimha Eranna Swamy Vari Devasthanam urukunda, temple history urukunda,urukunda temple timings,urukunda temple adopted places and temples,Saptagiri Telugu books download, Telugu popular books download, Annamayya vinnapalu PDF download,Bramanda nayakuni PDF download, Vishnu Maya vilasamu PDF download, annamayya sankeerthanalu PDF download,Mahabharat PDF download,Mahabharat Telugu books download,TTD books download,popular Telugu books download ,elugu PDF download,

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS