TTD SAPTHAGIRI 2022 JANUARY TELUGU MAGAZINE DOWNLOAD | TTD eBooks Download |

 TTD SAPTHAGIRI 2022 JANUARY TELUGU MAGAZINE DOWNLOAD

TTD SAPTHAGIRI 2022 JANUARY TELUGU MAGAZINE DOWNLOAD | TTD eBooks Download |

Language: Telugu

Year: 2022

ద్వాదశాదిత్యులలో విష్ణువు అనే సూర్యుడు, స్థావరాల్లో హిమాలయం. నదులలో గంగానదీ, మత్స్యాలలో మకరం, అయనాలలో ఉత్తరాయణం కూడా నేనే" అన్నాడు పరమాత్మ. అందుచే ఉత్తరదిక్కు దేవతలకు ప్రీతికరమైందంటారు. మార్గశిరమాసంలో సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన వేళ "ధనుస్సంక్రాంతి" మొదలుగా, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించగా "మకరసంక్రాంతి" అవుతుంది. సూర్యసంచారం పుష్యమాసం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించగా అది "ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమౌతుంది. ఆకాలం పరమాత్మ నిలయమని ఋషివాక్కు ఉత్తరదిక్కున బదరికాదిపుణ్యభూముల్లో నరనారాయణులు ఉద్భవించారు. నారద, మౌద్గల్య, విశ్వామిత్రాది మహర్షులెందరో మంత్రద్రష్టలైనారు ఆ ఉత్తరహిమాలయ భూములమీద. ఆ ఉత్తర దిక్కునే పవిత్ర గంగానది పుట్టింది. అష్టాంగధర్మాన్ని పండించటానికి కురుమహారాజు ఉత్తరభూములను దున్ని కురుక్షేత్రాన్ని "ధర్మక్షేత్రంగా" మార్చాడు. ఇలా అనేకవిధాల పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి.

ఒకప్పుడు శివుణ్ణి భర్తగా కోరిన కాత్యాయనీదేవి హేమంతఋతువులో ధనుర్మాస ఉషఃకాలాన శివుణ్ణి అర్చించి సాత్వికాహారమైన హవిష్యం నివేదన చేసిన కారణంగా ఆవ్రతానికి ధనుర్మాసవ్రతం అని పేరు వచ్చిందట. తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్మపొందునుకోరి ఈ వ్రతాన్ని "కాత్యాయనీ" వ్రతంగా ధనుర్మాసంలో ఆచరించి ధన్యులైనారట-గోపికలు. అప్పటినుండి సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పుడే ఈ వ్రతం చేయటం పరిపాటి అయింది. అన్నింటికన్నా అతిపవిత్రం, ప్రసిద్ధం, పుణ్యప్రదం అయిన గోదాదేవి చేసిన "గోపికావ్రతం" సాక్షాత్తు భగవంతుని సాక్షాత్కారానికి నిదర్శనం.

ఆ గోదాదేవే "చూడికుడుత్త నాచ్చియార్" గా నేటికీ శ్రీరంగాచిక్షేత్రాలలో, శ్రీ వేంకటేశునిసన్నిధిలో పూజలందుకుంటున్నది. ఆమె రోజుకొకటిగా పాడినపద్యాలే "తిరుప్పావై" లేదా "ఆండాళ్ పాశురాలుగా" నేటికీ ధనుర్మాసబ్రాహ్మీముహూర్తంలో స్వామిసేవకు గానం చేయబడుతుంటాయి. అదే అనూచానంగా నేటికీ స్త్రీలు ధనుర్మాసవ్రతాన్ని పాటిస్తూనే ఉన్నారు.

అటు తరువాత భూమిని సస్యశ్యామలం చేసేది పుష్యమాసం. పౌష్య అంటే పోషించునది అని అర్ధం. పూర్వం వామనావతారంలో శ్రీమహావిష్ణువుచేత పాతాళానికి తొక్కబడిన బలిచక్రవర్తి తాను పాలించిన భూమి మీద ప్రజల సుఖసంతోషాలు చూడటానికి సంక్రాంతినాడు భూమిమీదకు వస్తాడని ఒక నమ్మకం. ఆయనకు స్వాగతంగా ఒక ఇంటినుండి మరో ఇంటికి ముగ్గులరథాలు వేయటంలో అనూచానంగా వస్తున్న అర్ధం ఇదే!

                                              

ఈ కింది పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోండి  

                                telugu boooks downloadpothana bhagavatam free download

Tatparya Sahitha Stotralu Telugu Book DownloadALL TELUGU BOOKS DOWNLOAD

భగవద్గిత,మహాభారతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి 

TTD eBooks Free Download Bhagavad Gita

keywords:TTD Books Download ,Telugu Sapthagiri Book Download pdf ,Telugu Sathagiri Magazine , Sapthagiri Book Telugu Books Downloads. 

Comments