భారతదేశం పారంపర్యంగా మతాత్మక దేశం. ప్రకృతి శక్తుల్లో వికసించిన పువ్వులో మండే నిప్పులో ప్రవహించే నీళ్ళలో , వీచే గాలిలో దైవాన్ని దర్శించి ఆరాదించే చిత్త ప్రవృత్తికి నిలయమైన సంస్కృతి వెల్లివిరిసిన దేశం. అయితే ఇలా మర్మగర్భతంగా ప్రకృతి పరిణామ ఫలితంలో దాగిన దైవ మహిమను చూడగలగడం ప్రతి నేత్రానికి సాధ్యం కాదు అట్టి ఆంతర్య దృష్టిని పెంచుకోవడంలో ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు అనేక సాధనాలు అలవర్చుకొంటారు. అభ్యసిస్తారు. అట్టి సాధనలో ఒకటి గురుశుశ్రుష. విశ్వంలో దైవాన్ని దైవంలో విశ్వాన్ని దర్శించే ఆంతరంగిక సూక్ష్మదృష్టిని ప్రసాదించి తమ శిష్య వర్గాన్ని ఆధ్యాత్మిక విషయానురాక్తులను చేసి జీవితం ధన్యం చేసి కొనేవారుగూరువులు. అందువల్ల ఈ గురువ్యవస్థ ఈనాడు జన్మించినది కాదు. ఏ ఒక్క మతానికో , దేశానికో పరిమితమైంది కాదు. ఆ వ్యవస్థ సర్వకాలీనం , సార్వత్రికం , సర్వ సంస్కృతులకు కరతలామాలకం.
BabaluSwamijiluGuruMaharajlu Telugu PDf Download
Related postings :
keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,