తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ– శ్రీవారి దర్శనం కోసం 40 గంటలు |HEAVY RUSH AT TIRUMALA

HEAVY RUSH AT TIRUMALA

HEAVY PILGRIM RUSH AT TIRUMALA _ తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

 తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

– శ్రీవారి దర్శనం కోసం 40 గంటలు

– టీటీడీ విస్తృత ఏర్పాట్లు

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.

వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో ఉప్మా, పొంగల్ ఉన్నాయి) పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు.

అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.

భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ డి టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

30 HOURS FOR DARSHAN TIME TO TOKENLESS DEVOTEES

ELABORATE ANNAPRASADAM AND WATER ARRANGEMENTS DONE

 Heavy weekend rush coupled with a series of holidays which began since Thursday has been continuing in Tirumala. By the time of 6pm on Saturday, the lines are getting added at Silathoranam and for tokenless devotees it is taking approximately 30 hours for darshan of Sri Venkateswara Swamy.

In spite of repeated announcements about the time at Tirupati Railway station, bus station, Alipiri, the pilgrim crowd is swarming to Hill Town. TTD has made elaborate arrangements of Annprasadam, water and security to the multitude of visiting pilgrims. On Saturday itself, till 5pm, Annaprasadam was served to 80 thousand pilgrims in MTVAC and another 80 in outside queue lines.

About 2500 Srivari Sevaks have been deployed to render services to the waiting pilgrims in all these areas.

Under the instructions of TTD EO Sri AV Dharma Reddy, in the supervision of JEO Sri Veerabrahmam, all the senior officers of TTD in Tirumala have been monitoring the facilities from time to time and ensuring hassle-free darshan to devotees.

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS