తిరుమలలో అంగప్రదక్షిణ నియమాలు కొత్త రూల్స్ | Tirumala Angapradakshina New Rules Ticket Booking Process

TIRUMALA ANGAPRADAKSHINA NEW RUELS


తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల స్వామి వారి ఆలయం లో భక్తులకు అంగప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు .  స్వామి వారి సన్నిధి లో అంగప్రదక్షిణ చేసి ఆ తరువాత దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము . జీవితం లో ఒక్కసారైనా అంగప్రదక్షిణ చెయ్యాలి అనిపిస్తుంది ఒకసారి చేసిన తరువాత మరల మరల అవకాశం కుదిరినప్పుడల్లా అంగప్రదక్షిణికే రావాలి అనిపిస్తుంది. 

అంగప్రదక్షిణ నియమాలు :  

అంగప్రదక్షిణ మగవారు ఆడవారు అనే తేడాలేకుండా అందరు చేయవచ్చు . 

సాంప్రదాయ దుస్తులను ధరించాలి

మగవారు నైట్ పేంట్స్ అలానే చిరిగిన జీన్స్  , బెల్ట్ , పర్సు తో అనుమతించరు . 

పంచలు  లేకపోయిన మామూలు ప్యాంటు లతో లోపలకి అనుమతిస్తారు . 

ఆడవారు జీన్స్ వేసుకోరాదు . చీర , పంజాబీ డ్రెస్ లతో అనుమతిస్తారు. 

అంగప్రదక్షిణ దర్శన సమయం :

స్వామి వారి పుష్కరిణిలో తలస్నానం  చేసి భక్తులు తడిబట్టలతో  అర్ధరాత్రి 12:30 కు లైన్ లో నిలబడతారు . 

క్యూ లైన్ లో చెకింగ్ పూర్తీ అయ్యాక అనగా అంగప్రదక్షిణ టికెట్ మరియు ఆధార్ కార్డు చూపించాలి . కంపార్ట్మెంట్ లో ఉంచుతారు . 

తెల్లవారు జామున 3 గంటలకు దేవాలయం లోకి తీస్కుని వెళ్తారు . 

అంగప్రదక్షిణ ఒక సారి మాత్రమే చేయనిస్తారు అనగా ఒక రౌండ్ మాత్రమే చేస్తాము . చాలామంది 3 సార్లు అనుకుంటారు . 

బంగారు బావి నుంచి స్వామి వారి హుండీ వరకు ప్రదక్షిణ చేస్తాము .

ప్రదక్షిణ అయినతరువాత బయటకు పంపించి అనగా ధ్వజ స్థంభం వరకు బయటకు పంపి సర్వదర్శనం లైన్ లో కలుపుతారు . దర్శనం వెంటనే అయిపోతుంది . 

అంగప్రదక్షిణ టికెట్స్ బుకింగ్ విధానం : 

అంగప్రదక్షిణ టికెట్స్ ప్రస్తుతం ఆన్లైన్ లో ఇస్తున్నారు ప్రతి నెల 20వ తేదీ తరువాత వచ్చే నెలకు టికెట్స్ ఇస్తున్నారు . 

ఈ టికెట్స్ ఉచితంగా బుక్ చేస్కోవచ్చు 

ప్రతిరోజూ 650 టికెట్స్ విడుదల చేస్తారు . 

శుక్రవారం అంగప్రదక్షిణ ఉండదు . 

ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు 15వ తేదీన బుక్ చేసుకుంటే మీరు 14 వ తేదీ రాత్రి 12 గంటలకు లైన్ లో ఉండాలి

అంగప్రదక్షిణ టికెట్స్ ఇంతకూ ముందు తిరుమల కొండపైన cro దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచి టికెట్స్ ఇచ్చేవారు . భక్తులు ఆధార్ కార్డు తో లైన్ లో నిలబడేవారు . 

తిరుమల అంగప్రదక్షిణ టికెట్స్ బుకింగ్  వెబ్సైటు లింక్ : 

https://tirupatibalaji.ap.gov.in

Keyowrds : tirumala angapradakshina new ruels , angapradakshina ticket cost , tirumala angapradakshina booking website , tirumala updates, angapradakshina booking counter in tirumala. tirumala sevas list. 

Post a Comment

Previous Post Next Post

Recent in Technology

Facebook

Free Books
CLOSE ADS